Toyota Hilux: కొత్త పికప్ ట్రక్ బుకింగ్ లు నిలిపివేసిన టొయోటా, కారణం?

బుకింగ్ లు ప్రారంభించి పది రోజులు గడవకముందే..భారత్ లో "హైలక్స్" బుకింగ్ లను నిలివేస్తున్నట్టు గురువారం సంస్థ ప్రకటించింది.

Toyota Hilux: కొత్త పికప్ ట్రక్ బుకింగ్ లు నిలిపివేసిన టొయోటా, కారణం?

Toyota

Updated On : February 3, 2022 / 4:55 PM IST

Toyota Hilux: జపాన్ వాహన దిగ్గజం టొయోటా సంస్థ ఇటీవల భారత్ లో “హైలక్స్” పికప్ ట్రక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. లైఫ్ స్టైల్ యుటిలిటీ సెగ్మెంట్ లో.. ప్రీమియం వాహన వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ “హైలక్స్” వాహనాన్ని భారత్ లో విడుదల చేసింది టొయోటా సంస్థ. జనవరి 20న వాహననాన్ని ఆవిష్కరించగా మూడు రోజుల అనంతరం భారత్ లో “హైలక్స్” బుకింగ్ లు ప్రారంభించింది టొయోటా సంస్థ. అయితే బుకింగ్ లు ప్రారంభించి పది రోజులు గడవకముందే.. “హైలక్స్” బుకింగ్ లను నిలివేస్తున్నట్టు గురువారం సంస్థ ప్రకటించింది.

Also read: Amazon Jeff Bezos: జెఫ్ బెజోస్ భారీ పడవ కోసం చారిత్రక వంతెనను కూల్చనున్న నెదర్లాండ్స్

“ఇటీవల ప్రవేశపెట్టిన “హైలక్స్” వాహనానికి తమ వినియోగదారుల నుంచి ఊహించని రీతిలో అద్భుతమైన స్పందన వచ్చిందని.. భారత్ లో వాహనాన్ని విడుదల చేసిన రెండో రోజు నుంచే విపరీతంగా బుకింగ్ లు వచ్చినట్లు” టొయోటా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈక్రమంలో వచ్చిన బుకింగ్ లను ప్రాసెస్ చేసేందుకు తమవద్ద తగినంత సమయం లేదని.. అందుకే తాత్కాలికంగా “హైలక్స్” బుకింగ్ లు నిలిపివేస్తున్నట్టు టొయోటా సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

Also read: PRASHAD Scheme: కేంద్ర ప్రభుత్వ “ప్రషాద్ పథకంలో” ఏపీ నుంచి 4 దేవస్థానాలు

ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా భారత్ లో కార్ల తయారీ సంస్థలు చిప్ ల కొరత ఎదుర్కొంటున్నాయి. మైక్రో ప్రాసెసర్లు లేకుండా కార్లలో పనిచేయవు. దీంతో ప్రస్తుతం చిప్ లు డిమాండ్ సరిపడా అందుబాటులోకి వస్తే తప్ప..ఈ కొరత తీరదు. “హైలక్స్” పికప్ ట్రక్ బుకింగ్ లు నిలిపివేసేందుకు ఇదికూడా ఒక కారణంగా చెప్పిన సంస్థ.. తిరిగి బుకింగ్ లు ఎప్పుడు ప్రారంబిస్తామనే విషయాన్నీ వెల్లడించలేదు. ఇక చిప్ ల కొరతతో 2021 డిసెంబర్ నాటికే భారత్ లో 7 లక్షలకు పైగా కార్ల ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నట్లు ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్ సర్వేలో కేంద్ర ఫైనాన్స్ మంత్రిత్వశాఖ పేర్కొంది.

Also read: Adhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డుకి అప్లై చేసుకోనే విధానం