TVS Jupiter 125 Scooter: ఇండియాలో మరింత కాస్ట్లీ కానున్న టీవీఎస్ వెహికల్

ఇండియాలో కొన్ని నెలలుగా ఇన్‌పుట్, కమోడిటీ ధరలు పెరుగుతుండటంతో వాహనాల ధరలు కూడా మరింత ప్రియం కానున్నాయి. ఇండియన్ ఆటో పరిశ్రమపై ప్రభావం చూపే కారకాల కారణంగా TVS జూపిటర్ 125తో సహా...

TVS Jupiter 125 Scooter: ఇండియాలో మరింత కాస్ట్లీ కానున్న టీవీఎస్ వెహికల్

New Tvs Jupiter 125 Scooter Launched In India At Rs 73,400

Updated On : February 8, 2022 / 3:36 PM IST

TVS Jupiter 125 Scooter: ఇండియాలో కొన్ని నెలలుగా ఇన్‌పుట్, కమోడిటీ ధరలు పెరుగుతుండటంతో వాహనాల ధరలు కూడా మరింత ప్రియం కానున్నాయి. ఇండియన్ ఆటో పరిశ్రమపై ప్రభావం చూపే కారకాల కారణంగా TVS జూపిటర్ 125తో సహా కొన్ని వాహనాల ధరలను పెంచింది.

గతేడాది భారతదేశంలో ప్రారంభించిన జ్యూపిటర్ 125, హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ వంటి వాటికి పోటీగా నిలిచింది. ఈ 125 cc TVS స్కూటర్ ధర దాదాపు వెయ్యి 275 రూపాయలు పెరిగింది. స్టీల్ వీల్స్‌తో కూడిన TVS జూపిటర్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఇప్పుడు రూ.74,4025కి బదులుగా రూ.75,625 అవనుంది.

ఎల్లోయ్ వీల్స్‌తో కూడిన జ్యూపిటర్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ రూ.76వేల 800కి బదులుగా రూ.78వేల 125 అవనుందని డేటా చెప్తుంది. టాప్-ఎండ్ TVS జూపిటర్ 125 డిస్క్ బ్రేక్ వేరియంట్ విషయానికొస్తే, రూ.81వేల 300కి బదులుగా రూ.82వేల 575 వరకూ చేరనుంది.

Read Also: ఈ వారమే ఖిలాడీ రిలీజ్.. ప్రమోషన్ల హడావుడి లేదేంటి?

TVS జూపిటర్ 125, 124.8 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌పై సస్పెన్షన్ డ్యూటీలు మూడు-దశల సర్దుబాటు చేయగల గ్యాస్-ఛార్జ్డ్ మోనో-షాక్‌తో టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో ఉండనున్నాయి.

జూపిటర్ 125 సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ అనలాగ్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ లతో పాటు జూపిటర్ 125 TVS IntelliGo స్టాప్-స్టార్ట్ సిస్టమ్, ఎకనోమీటర్, పవర్ మోడ్, సైలెంట్ స్టార్ట్ కోసం ఇంటిగ్రేటెడ్ స్టార్టర్-జనరేటర్, సైడ్-స్టాండ్ ఇన్హిబిటర్‌తో వస్తుంది.