JioHotstar Twist : ‘జియోహాట్‌స్టార్’ డ్రామాలో ట్విస్ట్.. ఈ డొమైన్ దుబాయ్ చిన్నారులకు అమ్మేసిన ఢిల్లీ టెక్కీ..!
JioHotstar drama Twist : జియోహాట్‌స్టార్ కామ్ వెబ్‌సైట్ విజిట్ చేసేవారికి కొత్త ల్యాండింగ్ పేజీ కనిపిస్తోంది. ఆ సైటులో జైనం జీవిక అనే ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు. వీరిద్దరూ దుబాయ్‌కు చెందిన అన్నాచెల్లెల్లు.

Dubai siblings claim they bought domain from developer ( Image Source : Google )
JioHotstar drama Twist : జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్‌పై వివాదం కొత్త మలుపు తిరిగింది. జియోసినిమా, హాట్‌స్టార్ విలీనానికి ముందు ఢిల్లీలోని ఒక యాప్ డెవలపర్ ఈ రెండింటి పేరుతో డొమైన్ కొనుగోలు చేశాడు. ఈ డొమైన్ జియోకు విక్రయించాలని భావించాడు. కానీ, ఊహించిన విధంగా జియోహాట్‌స్టార్ కామ్ డొమైన్ దుబాయ్‌లోని ఇద్దరు పిల్లలకు విక్రయించాడు.
అయితే, జియోహాట్‌స్టార్ కామ్ వెబ్‌సైట్ విజిట్ చేసేవారికి కొత్త ల్యాండింగ్ పేజీ కనిపిస్తోంది. ఆ సైటులో జైనం జీవిక అనే ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు. వీరిద్దరూ దుబాయ్‌కు చెందిన అన్నాచెల్లెల్లు. పిల్లల వెబ్‌సైట్ (jainamjivikafuntime.com) ప్రకారం.. జైనం వయస్సు 13ఏళ్లు ఉండగా, సోదరి జీవిక (10ఏళ్లు) ఉంటుంది.
“ఢిల్లీకి చెందిన యువ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కు సపోర్టు ఇచ్చేందుకు తాము జియోహాట్‌స్టార్ డొమైన్‌ను కొనుగోలు చేసినట్లు లేఖలో జైనం, జీవిక పేర్కొన్నారు. జైనం, జీవిక పిల్లలకు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో బొమ్మలు, ఆటల గురించి డీఐవై కంటెంట్‌ని రూపొందిస్తున్నారు. జైనం జీవిక ఫౌండేషన్.. పేరు మీద ఒక ఎన్‌జీఓ కూడా రిజిస్టర్ అయింది. ఫౌండేషన్ డైరెక్టర్లు కాంతిలాల్ శంకర్‌లాల్ జైన్, శోభా కాంతిలాల్ జైన్‌గా ఉన్నారు. జియోహాట్‌స్టార్.కామ్ కొనుగోలు చేసినవారి గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదంతా జియోహాట్‌స్టార్ కామ్‌లో కనిపించిన లేఖతో ప్రారంభమైంది. డిస్నీ+ హాట్‌స్టార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన వయాకామ్18 విలీనం అయింది. ఉమ్మడి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కు జియోహాట్‌స్టార్ కామ్ సరైన డొమైన్ కూడా. అయితే, రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల విలీనాన్ని ఊహించి, ఢిల్లీకి చెందిన ఒక యాప్ డెవలపర్ ఇప్పటికే 2023లో డొమైన్‌ను కొనుగోలు చేశారు. అనంతరం రిలయన్స్ జియోకు లేఖ రాశాడు.
ఆ లేఖలో ఢిల్లీ డెవలపర్ తన డొమైన్‌ను కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ను రూ. 1 కోటికి పైగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సును చదివేందుకు ఈ డబ్బు ఖర్చు చేయాలని భావించాడు. అయితే, యాప్ డెవలపర్ తర్వాత రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ తనను సంప్రదించారని తాను ఆఫర్ చేసిన రూ. 1 కోటి ఇచ్చేందుకు తిరస్కరించినట్టు వెల్లడించారు. వాస్తవానికి రిలయన్స్ తన ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించినందుకు తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.