ట్విట్టర్‌ Dislike Button తీసుకోస్తోంది..

  • Published By: sreehari ,Published On : November 18, 2020 / 08:47 AM IST
ట్విట్టర్‌ Dislike Button తీసుకోస్తోంది..

Updated On : November 18, 2020 / 10:39 AM IST

Twitter Adding Dislike Button : ప్రముఖ సోషల్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తన ప్లాట్ ఫాంపై డిస్ లైక్ బటన్ యాడ్ చేయాలని చూస్తోంది. డిస్ లైక్ లేదా డౌన్ వోట్ బటన్ యాడ్ చేయాలనే యోచనలో ఉంది. ప్లాట్ ఫాంపై యూజర్లు తమకు నచ్చని అంశాలను డిస్‌లైక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.



అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జో బైడెన్ క్యాంపెయిన్ నిర్వహించిన సమయంలో ట్విట్టర్ కొన్ని ప్రణాళికలను రూపొందించింది. కొత్తగా Fleets అనే ఆప్షన్ లాంచ్ చేసింది. ఈ ఫ్లీట్స్ ఆప్షన్ ద్వారా మీ ట్వీట్లను మిగతా యూజర్లకు షేరింగ్ చేసుకోవచ్చు.

ట్విట్టర్ ప్లాట్ ఫాంపై అభ్యంతర పోస్టులను తొలగించడంతోపాటు వేధింపులపై రిపోర్టు చేసేందుకు యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే Dislike బటన్ లేదా Downvote కెపబిలిటీని యాడ్ చేయాలని భావిస్తోంది. యూజర్లను హానికలిగించే కంటెంట్‌ను తొలగించేందుకు ఈ దిశగా అన్వేషిస్తోంది.



https://10tv.in/amazon-enter-into-online-pharmacy/
ప్రతిస్పందనగా, ట్విట్టర్ ప్రొడక్ట్ లీడ్ చేసే కైవోన్ బేక్‌పూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. ‘మేము చాలా పురోగతి సాధించాము, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇతర సమస్యలను కూడా పరిష్కరించడం చాలా ముఖ్యం’ అని భావిస్తున్నామని ట్వీట్ చేశారు.


డిస్ లైక్ బటన్ యాడ్ చేయాలనే ఆలోచనను ట్విట్టర్ ధృవీకరించిందని, మరింత సూక్ష్మమైన చర్చలకు నిలయంగా మారాలని కంపెనీ యోచిస్తోందని తెలిపారు.


2016లో ట్విట్టర్.. యూజర్లకు కొన్ని ట్వీట్లు నచ్చలేదనడానికి గుర్తుగా ఒక ఆప్షన్ యాడ్ చేసింది. మీ టైమ్‌లైన్‌ను మరింత క్యూరేట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.