Maruti Suzuki Gypsy : పోస్టల్ శాఖతో 22ఏళ్ల అనుబంధం.. మారుతి సుజుకీ జిప్సీకి ఘనంగా వీడ్కోలు..!
మారుతీ జిప్సీతో 22ఏళ్ల అనుబంధం.. తమిళనాడులోని వెల్లూరులో పోస్టల్ డిపార్ట్ మెంటులో సుదీర్ఘంగా సేవలందించిన మారుతీ సుజుకీ జిప్సీకి ఘనంగా వీడ్కోలు పలికారు పోస్టాఫీసు సిబ్బంది. ఈ వినూత్న ఘటన తమిళనాడులోని వెల్లూరులో జరిగింది.

Vellore Post Office Staff Bid Farewell To Their 22 Year Old Maruti Suzuki Gypsy
Maruti Suzuki Gypsy : మారుతీ జిప్సీతో 22ఏళ్ల అనుబంధం.. తమిళనాడులోని వెల్లూరులో పోస్టల్ డిపార్ట్ మెంటులో సుదీర్ఘంగా సేవలందించిన మారుతీ సుజుకీ జిప్సీకి ఘనంగా వీడ్కోలు పలికారు పోస్టాఫీసు సిబ్బంది. ఈ వినూత్న ఘటన తమిళనాడులోని వెల్లూరులో జరిగింది. సాధారణంగా సుదీర్ఘ కాలం పాటు ఒక సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు ఫేర్ వెల్ ఇవ్వడం కామన్. అయితే ఇక్కడ ఆ ఉద్యోగి ఎవరో కాదు.. సంస్థకు సేవలందించిన మారుతీ సుజుకీ జిప్సీ (Maruti Suzuki Gypsy). మార్చి 24, 1999లో వెల్లూరు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఈ మారుతీ జిప్సీని కొనుగోలు చేసింది. 22ఏళ్లుగా తమకు సర్వీసు చేసినందుకుగానూ మారుతీ జిప్సీ వాహనానికి గౌరవ సూచికంగా వీడ్కోలు పలికారు అక్కడి పోస్టల్ సిబ్బంది. మారుతి జిప్సీకి దండలు వేశారు. ఈ SUV చివరి డ్రైవర్ అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. సిబ్బంది కూడా వాహనానికి వందనం చేసి ఫొటోలు దిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ వాహనాన్ని ఇప్పుడు మెయిల్ మోటార్ సర్వీసుకు అప్పగించనున్నారు.
మారుతి జిప్సీని వెల్లూర్ డివిజన్ పోస్టాఫీసుల సూపరింటెండెంట్ తనిఖీ వాహనంగా ఉపయోగించారు. వెల్లూర్ డివిజన్ ప్రస్తుత పోస్టాఫీసుల సూపరింటెండెంట్ పి. కోమల్ కుమార్ మాట్లాడుతూ.. మా పోస్టాఫీసులలో ఒక ఆచారం కాదు.. వెల్లూరులో మారుమూల గ్రామాలు కొండ ప్రాంతాల్లో తాము చేరుకోవడానికి ఈ వాహనం మాకెంతో సాయపడింది. అందుకే ఈ జిప్సీకి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని భావించామన్నారు. మూడేళ్ళుగా ఇందులోనే ప్రయాణించానని చెప్పారు. వెల్లూర్ పోస్టల్ డివిజన్ 25 మంది సూపరింటెండెంట్లు ఈ వాహనాన్ని మొత్తం తమ సర్వీసులో వినియోగించారు. ప్రధానంగా జావాధు కొండలతో సహా కొండ ప్రాంతాల్లోని పోస్టాఫీసులను సందర్శించడానికి వినియోగించారు.
అప్పట్లో మారుతీ జిప్సీకి ఫుల్ క్రేజ్ :
భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి వచ్చిన మోడల్.. మారుతీ జిప్సీ అప్పట్లో బాగా పాపులర్ అయింది. తక్కువ ధర కావడంతో వినియోగదారులను ఆకర్షించింది. మారుతి సుజుకి మార్కెట్లో 4×4 SUV జిప్సీ భారీగా విక్రయించింది. కొత్త ఉద్గారాల భద్రతా నిబంధనల కారణంగా ఈ జిప్సీ మోడల్ ను మారుతి నిలిపివేసింది. అప్పట్లో కొనుగోలు చేసిన ఈ జిప్సీని ఇప్పటికీ వినియోగిస్తూనే ఉన్నారు. ఈ జిప్సీ వాహనాలకు సంబంధించి వీడియోలు కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
మారుతి జిప్సీకి ఇప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు ఈ జిప్సీని భారత సైన్యం వినియోగించింది. ఆ తరువాత దీనిని టాటా సఫారి స్టార్మ్ (Tata Safari Storme)తో కలిపేశారు. భారత సైన్యంలో ఎక్కువ కాలం పనిచేసిన వాహనాల్లో ఒకటిగా మారుతి సుజుకి జిప్సీ నిలిచింది. మారుతి జిప్సీకి 1.3 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇంజిన్ 80 Bhp , 103 Nm టార్క్ ఉత్పత్తి చేసింది. 4×4 తక్కువ శ్రేణి గేర్‌బాక్స్‌తో వచ్చింది. జిప్సీ మెయింట్ నెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఎలాంటి భూభాగాల్లోనైనా సులభంగా దూసుకెళ్లగల సామర్థ్యం ఉంది.
జిప్సీకి నెక్స్ట్ జనరేషన్.. జిమ్ని (Gypsy – Jimny) :
అంతర్జాతీయంగా.. next generation జిప్సీ (Gypsy) ఇప్పటికే అందుబాటులో వచ్చింది.. దీనిని Jimny అని పిలుస్తారు. కాంపాక్ట్ 4×4 SUV అంతర్జాతీయంగా బాగా పాపులర్ అయింది కూడా. భారీ డిమాండ్ మేరకు మారుతి సుజుకి ఇండియన్ ప్లాంట్‌లోనూ ఈ జిమ్నీ(Maruti Jimny) ఉత్పత్తిని ప్రారంభించేసింది. గత ఏడాది భారత్ లో తొలిసారిగా ఆటోలో Maruti Jimny ప్రదర్శించింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారతదేశంలో ఉత్పత్తి ప్రారంభమైందంట. మారుతి సుజుకి వచ్చే ఏడాది చివరిలో జిమ్నీని భారతీయ మార్కెట్లో రిలీజ్ చేయనుంది. ఈ Jimny మోడల్ 3-డోర్ల నుంచి 5-డోర్ల వెర్షన్ తో మార్కెట్లోకి రానుంది.