Vivo Pad 3 Launch : కొత్త ట్యాబ్ కొంటున్నారా? భారీ డిస్‌ప్లేతో వివో ఎల్‌సీడీ స్ర్కీన్ ట్యాబ్ 3 ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Vivo Pad 3 Launch : కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వివో ప్యాడ్ 3 ప్రీ-ఆర్డర్‌లు అందుబాటులో ఉన్నాయి. టాబ్లెట్ కోల్డ్ స్టార్ గ్రే, స్ప్రింగ్ టైడ్ బ్లూ, థిన్ రెయిన్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుందని జాబితా వెల్లడించింది.

Vivo Pad 3 Launch : కొత్త ట్యాబ్ కొంటున్నారా? భారీ డిస్‌ప్లేతో వివో ఎల్‌సీడీ స్ర్కీన్ ట్యాబ్ 3 ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Vivo Pad 3 With 12.1-Inch LCD Screen ( Image Source : Google )

Vivo Pad 3 Launch : కొత్త ట్యాబ్ కొంటున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి కొత్త టాబ్లెట్ వచ్చేసింది. అదే.. వివో ప్యాడ్ 3 టాబ్లెట్.. చైనా మార్కెట్లో ముందుగా లాంచ్ అయింది. ఈ లేటెస్ట్ టాబ్లెట్‌గా క్వాల్‌కామ్ నుంచి స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్‌తో వస్తుంది.

Read Also : VI Plan Tariffs Hike : జియో, ఎయిర్‌టెల్ బాటలో వోడాఫోన్ ఐడియా.. బాదుడే బాదుడు.. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు..!

వివో టాబ్లెట్ 12.1-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 600నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. వివో ప్యాడ్ 3 సంస్థ ఆర్జిన్ఓఎస్ 4 స్కిన్‌తో పాటు ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 44డబ్ల్యూ వద్ద ఛార్జ్ చేయగల 10,000mAh బ్యాటరీని అందిస్తుంది.

వివో ప్యాడ్ 3 ధర ఎంతంటే? :
వివో ప్యాడ్ 3 ఫోన్ ధర 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో కూడిన బేస్ మోడల్ ధర సీఎన్‌వై 2,499 (దాదాపు రూ. 28,700)గా నిర్ణయించింది. అదే సమయంలో మరో మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లు 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ ధర సీఎన్‌వై 2,799 (దాదాపు రూ. 32,100), సీఎన్‌వై 3,099 (దాదాపు రూ. 35,500) ఉంటుంది. వివో ప్యాడ్ 3 కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లు అందుబాటులో ఉన్నాయి. టాబ్లెట్ కోల్డ్ స్టార్ గ్రే, స్ప్రింగ్ టైడ్ బ్లూ, థిన్ రెయిన్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుందని జాబితా వెల్లడించింది. జూలై 5 నుంచి చైనాలో విక్రయానికి రానుంది.

వివో ప్యాడ్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో ప్యాడ్ 3 ఆండ్రాయిడ్ 14పై ఆధారపడిన ఆర్జిన్ఓఎస్4పై రన్ అవుతుంది. టాబ్లెట్ 144Hz రిఫ్రెష్ రేట్, 600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 12.1-అంగుళాల (2,800 x 1,968 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12జీబీ వరకు LPDDR5ఎక్స్ ర్యామ్‌తో వస్తుంది. సింగిల్ 8ఎంపీ బ్యాక్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

టాబ్లెట్ 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది (128జీబీ మోడల్ నెమ్మదిగా యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని కలిగి ఉంది). వివో ప్యాడ్ 3 వై-ఫై 6, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. యూఎస్‌బీ 3.2 జనరేషన్ 1 టైప్-సి పోర్ట్‌తో అమర్చి ఉంది. డేటా బదిలీలకు 44డబ్ల్యూ వద్ద 10,000mAh బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు ఉపయోగించవచ్చు. ఈ ఫోన్ కొలతలు 266.43x192x6.57ఎమ్ఎమ్, బరువు 589.2 గ్రాములు ఉంటుంది.

Read Also : SIM Swap New Rules : మొబైల్ నంబర్ పోర్టబిలిటీపై కొత్త రూల్.. ఇకపై సిమ్ మార్చుకుంటే ఎన్ని రోజులు పడుతుందంటే?