Vivo X200T Launch : వివోనా మజాకా.. కొత్త వివో X200T ఫోన్ కేక.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర మీ బడ్జెట్‌లోనే
Vivo X200T Launch : వివో నుంచి X200T సిరీస్ వచ్చేసింది. 6.67-అంగుళాల భారీ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ వివో ఫోన్ ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి..
Vivo X200T Launch
- 6.67-అంగుళాల భారీ అమోల్డ్ ప్యానెల్ ఆప్షన్
- 12GB ర్యామ్, 256GB వేరియంట్ ధర రూ. 59,999
- 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ ధర రూ. 69,999
- 6,200mAh బ్యాటరీ సపోర్టు, 90W ఫాస్ట్ ఛార్జింగ్
Vivo X200T Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో X300 సిరీస్ తర్వాత వివో అధికారికంగా సరికొత్త వివో X200T ఫోన్ ప్రవేశపెట్టింది. వివో X200 ఎఫ్ఈ ఫోన్ మోడల్ మాదిరిగానే Zeiss-బ్యాక్డ్ కెమెరా, కొత్త డిజైన్, మీడియాటెక్ డైమెన్సిటీ చిప్, అమోల్డ్ ప్యానెల్ అందిస్తుంది. IP68, IP69 సర్టిఫికేషన్ అందిస్తుంది. Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC వంటి ఆప్షన్లు ఉన్నాయి. వివో X200T కీలక స్పెసిఫికేషన్లు, ధర సంబంధించి వివరాలపై ఓసారి లుక్కేయండి..
వివో X200T స్పెసిఫికేషన్లు :
వివో X200T ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల భారీ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. హుడ్ కింద, ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9400+ చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ అల్ట్రా, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ వివో ఫోన్ 6,200mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ OISతో 50MP LYT702 మెయిన్ సెన్సార్, JN1 వైడ్-యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP LYT 600 టెలిఫోటో సెన్సార్‌తో వస్తుంది. ఇవన్నీ Zeiss ద్వారా ట్యూన్ అయ్యాయి. ఈ వివో ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, లేజర్ ఫోకస్ సెన్సార్, ఫ్లికర్ సెన్సార్, డ్యూయల్-కలర్ టెంపరేచర్ సెన్సార్లు ఉన్నాయి.
వివో X200T భారత్ ధర ఎంతంటే? :
వివో X200T ఫోన్ 12GB ర్యామ్, 256GB వేరియంట్ ధర రూ. 59,999 నుంచి ప్రారంభమవుతుంది, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ ధర రూ. 69,999కు లభిస్తోంది. యాక్సెస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డులతో వినియోగదారులు రూ. 5వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ స్టెల్లార్ బ్లాక్, సీసైడ్ లిలాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
