Vivo Y300 Pro Launch : వివో నుంచి భారీ బ్యాటరీతో వివో Y300 ప్రో ఫోన్.. అదిరే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Vivo Y300 Pro Launch : ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో వై300ప్రో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో ఎఫ్/1.79 ఎపర్చరు, 2ఎంపీ సెకండరీ షూటర్‌తో ఎఫ్/2.4 ఎపర్చరుతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Vivo Y300 Pro Launch : వివో నుంచి భారీ బ్యాటరీతో వివో Y300 ప్రో ఫోన్.. అదిరే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Vivo Y300 Pro With 6,500mAh Battery, Snapdragon 4 Gen 2 SoC Launched

Updated On : September 5, 2024 / 9:06 PM IST

Vivo Y300 Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో కంపెనీ మిడ్‌రేంజ్ వై సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రవేశించింది. వివో వై300ప్రో చైనాలో లాంచ్ అయింది. ఈ కొత్త వివో హ్యాండ్‌సెట్ మొత్తం 4 కలర్ ఆప్షన్లు, 4 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో విక్రయిస్తోంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీపై రన్ అవుతుంది. వివో వై300ప్రో 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని అందిస్తుంది.

Read Also : Infinix Hot 50 5G : భలే ఉంది భయ్యా.. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ అదుర్స్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

వివో వై300 ప్రో ధర :
వివో వై300 ప్రో టాప్-ఎండ్ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వెర్షన్ కోసం సీఎన్‌వై 2,499 (దాదాపు రూ. 29వేలు)గా నిర్ణయించింది. 12జీబీ+ 256జీబీ, 8జీబీ+ 256జీబీ, 8జీబీ+ 128జీబీ ర్యామ్, స్టోరేజ్ మోడల్‌ల ధర సీఎన్‌వై 2,199 (దాదాపు రూ. 26వేలు), సీఎన్‌వై 1,999 (దాదాపు రూ. 23వేలు), సీఎన్‌వై రూ. 1,70 (రూ. 1,70), బ్లాక్ జేడ్, గోల్డ్ విత్ జేడ్, వైట్, టైటానియం వంటి కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది.

వివో వై300 ప్రో స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్-సిమ్ (నానో) వివో వై300ప్రో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆర్జిన్ఓఎస్ 4పై రన్ అవుతుంది. 60Hz, 90Hz, 120Hz మధ్య రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,392 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000నిట్‌ల గరిష్ట ప్రకాశం స్థాయి, 3,840Hz పల్స్-వెడల్పు మాడ్యులేషన్ (PWM), 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ, అడ్రినో 710 జీపీయూతో పాటు 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజీతో రన్ అవుతుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో వై300ప్రో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో ఎఫ్/1.79 ఎపర్చరు, 2ఎంపీ సెకండరీ షూటర్‌తో ఎఫ్/2.4 ఎపర్చరుతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

వివో వై300 ప్రోలోని కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.1, జీపీఎస్/ఏజీపీఎస్, బీఈఐడీఓయూ, జీఎల్ఓఎన్ఎఎస్ఎస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, వై-ఫై ఉన్నాయి. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

వివో వై300 ప్రో ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ65 రేటింగ్‌ను కలిగి ఉంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీని అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. బ్యాటరీ గరిష్టంగా 23.2 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్, 31.52 గంటల స్టాండ్‌బై టైమ్ అందించగలదు. ఈ ఫోన్ కొలతలు 63.4×76.4×7.69ఎమ్ఎమ్, బరువు 194 గ్రాములు ఉంటుంది.

Read Also : Ather Energy : ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు.. ప్రమాదాన్ని పసిగట్టే టెక్నాలజీ..!