Vi Max Postpaid Plans : వోడాఫోన్ ఐడియా విఐ మ్యాక్స్ పోస్టుపెయిడ్ ప్లాన్లపై స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ ఉచితం.. ఏ ప్లాన్ ధర ఎంతంటే?
Vi Max Postpaid Plans : వోడాఫోన్ ఐడియా యూజర్ల కోసం కొత్త పోస్టుపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లపై ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కూడా పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vodafone Idea Bundles Swiggy One Membership With Its Vi Max Postpaid Plans, Check Full Details
Vi Max Postpaid Plans : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం Vi (వోడాఫోన్ ఐడియా) తమ యూజర్ల కోసం భారత మార్కెట్లో కొత్త (Vi Max) పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. టెలికాం మేజర్ విఐ మ్యాక్స్ ఇండివిజువల్, విఐ మ్యాక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం అదనపు ఖర్చు లేకుండా స్విగ్గీ వన్ సభ్యత్వాన్ని అందిస్తోంది.
ఈ ఆఫర్‌తో, విఐ యూజర్లు రూ. 149 కన్నా ఎక్కువ ఆహార ఆర్డర్‌లపై అన్‌లిమిటెడ్ ఫ్రీ డెలివరీలను పొందవచ్చు. స్విగ్గీ ద్వారా రూ. 199 కన్నా విలువైన కిరాణా వస్తువుల కొనుగోలుకు రెస్టారెంట్ భాగస్వాములపై కూడా అదనపు తగ్గింపులు ఉంటాయి. విఐ కస్టమర్‌లు రూ. 501 కన్నా ఎక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు పొందడం ద్వారా స్విగ్గీ వన్ సభ్యత్వాన్ని పొందవచ్చు.
స్విగ్గీ వన్ సబ్‌స్ర్కిప్షన్.. విఐ పోస్టుపెయిడ్ ప్లాన్లు :
వోడాఫోన్ ఐడియా మ్యాక్స్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ. 501, రూ. 701 అలాగే (REDX) ప్లాన్ రూ. 1,101, విఐ మ్యాక్స్ ఫ్యామిలీ ప్లాన్‌లు రూ. 1,001, రూ. 1,151 ప్లాన్లపై ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా స్విగ్గీ వన్ సభ్యత్వాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లన్నీ అపరిమిత వాయిస్ కాల్‌లు, రోమింగ్ ఆఫర్‌లు, 3వేల ఎస్ఎమ్ఎస్‌లను అందిస్తాయి.
స్విగ్గీ వన్ సభ్యత్వం వివిధ స్విగ్గీ సేవల్లో ఉచిత అపరిమిత డెలివరీలు, తగ్గింపులను అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రస్తుతం మూడు నెలలకు రూ.599కు అందుబాటులో ఉంది. రూ. 149 కన్నాఎక్కువ ఫుడ్ ఆర్డర్‌లపై అన్‌లిమిటెడ్ ఫ్రీ డెలివరీలను అందిస్తుంది.

Vodafone Idea Swiggy One Membership
రెస్టారెంట్లపై 30శాతం వరకు అదనపు డిస్కౌంట్ :
30వేల కన్నా ఎక్కువ రెస్టారెంట్లపై 30 శాతం వరకు అదనపు తగ్గింపుతో అందిస్తోంది. స్విగ్గీ వన్ సబ్‌స్క్రైబర్‌లు ఇన్‌స్టామార్ట్‌లో రూ. 199 కన్నా ఎక్కువ ఆర్డర్‌లపై అపరిమిత ఉచిత డెలివరీలను పొందవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ డైన్‌అవుట్‌పై గరిష్టంగా 40 శాతం తగ్గింపును కూడా అందిస్తుంది. వినియోగదారులు నెలకు రూ.150 విలువైన రెండు అదనపు కూపన్‌లను పొందవచ్చు. అదనంగా, అన్ని (Swiggy Genie) డెలివరీ ఫీజులపై 10 శాతం తగ్గింపు ఉంటుంది.
సింగిల్ రీఛార్జ్ ప్లాన్.. రెండు సబ్‌స్ర్కిప్షన్లు :
స్విగ్గీ వన్ కాకుండా వోడాఫోన్ ఐడియా మ్యాక్స్ పోస్ట్‌పెయిడ్ వ్యక్తిగత, కుటుంబ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ , సోనీలైవ్, సన్ ఎన్‌ఎక్స్‌టీ వంటి మల్టీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈజీమైట్రిప్ (EaseMyTrip), నార్తన్ 360 మొబైల్ సెక్యూరిటీ, ఈజీడైనర్ సర్వీసులను కూడా పొందవచ్చు. ఒకే పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్‌లు పైన పేర్కొన్న ఏవైనా రెండు సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు (Vi Mobies), టీవీ యాప్, విఐ యాప్‌లోని హంగామా మ్యూజిక్, వోడాఫోన్ ఐడియా గేమ్‌లకు ఉచిత యాక్సెస్‌తో వస్తాయి.