వోడాఫోన్ ఐడియా యూజర్లకు అదిరే ఆఫర్ : Voot ఓటీటీ ఫ్రీగా యాక్సస్ చేసుకోవచ్చు!

వోడాఫోన్ ఐడియా యూజర్లకు అదిరే ఆఫర్ : Voot ఓటీటీ ఫ్రీగా యాక్సస్ చేసుకోవచ్చు!

Updated On : January 30, 2021 / 8:30 AM IST

Vodafone Idea Users Will Get Free Access to Voot Select : వోడాఫోన్ ఐడియా (Vi) తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ అందిస్తోంది. ఓవర్-ది-టాప్ (OTT) సర్వీసులో ప్రీమియం కంటెంట్ లైబ్రరీకి ఉచిత యాక్సస్ అందిస్తోంది. Voot Select ఓటీటీ సర్వీసుతో వోడాఫోన్ ఐడియా భాగస్వామ్యం కలిగి ఉంది. ఇతర ఓటీటీ సర్వీసుల మాదిరిగానే ఈ Voot OTT సర్వీసు కూడా అందుబాటులో ఉంది. వోడాఫోన్ ఐడియా యూజర్లు Vi మెంబర్ షిప్ పొందవచ్చు.

Voot Select సర్వీసుతో ఓటీటీ మార్కెట్లో కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ సర్వీసును Vi యూజర్లకు సొంత OTT ప్లాట్‌ఫాం – Vi మూవీస్ అండ్ టీవీ ద్వారా అందిస్తోంది. Vi యూజర్లు.. Voot Select లైబ్రరీ నుంచి విలువైన ప్రీమియం కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ యాక్సస్ చేయడానికి యూజర్లు పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు.ఆకర్షణమైన స్పెషల్ టెలివిజన్ షోలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Vi వినియోగదారులు టాప్ గేర్, షార్క్ ట్యాంక్, టిన్ స్టార్, ది ఆఫీస్, పింక్ కాలర్ క్రైమ్స్, నాన్సీ డ్రూ, ఇంటర్నేషనల్ టీవీ షోలను ఉచితంగా యాక్సెస్ పొందవచ్చు . వూట్ సెలెక్ట్ సాధారణంగా నెలకు రూ.99 లేదా ఏడాదికి రూ. 399 చెల్లించాల్సి ఉంటుంది. కానీ Vi యూజర్లకు మాత్రం ఈ ఓటీటీ సర్వీసు ఉచితంగా అందిస్తోంది. Vi మూవీస్ అండ్ టీవీతో యూజర్లు 13 వేర్వేరు భాషలలో 9,500+ సినిమాలను యాక్సస్ చేసుకోవచ్చు. 400+ లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.