Volvo C40 Recharge : కొత్త కారు కావాలా? వోల్వో C40 రీఛార్జ్ SUV ఇదిగో.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే బుకింగ్ చేసుకుంటారు..!

Volvo C40 Recharge : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త వోల్వో C40 రీఛార్జ్ SUV వచ్చేసింది. ఈ కొత్త కారును ఆన్‌లైన్‌లో మాత్రమే రూ. 1 లక్షతో బుక్ చేసుకోవచ్చు.

Volvo C40 Recharge : కొత్త కారు కావాలా? వోల్వో C40 రీఛార్జ్ SUV ఇదిగో.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే బుకింగ్ చేసుకుంటారు..!

Volvo C40 Recharge launched in India at Rs 61.25 lakh

Updated On : September 5, 2023 / 11:19 PM IST

Volvo C40 Recharge : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ ఆల్-ఎలక్ట్రిక్ వోల్వో C40 కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త వోల్వో C40 కారును ప్రారంభ ధర రూ. 61.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు విక్రయిస్తోంది. కొత్త వోల్వో C40 రీఛార్జ్ కారు బుకింగ్‌లు కూడా మొదలయ్యాయి. కార్‌మేకర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే వాహన బుకింగ్‌లు చేయవచ్చు. బెంగళూరు శివార్లలోని వోల్వో ఫ్యాక్టరీలో తయారైన రెండో మోడల్‌గా వోల్వో C40 రీఛార్జ్ ఎంట్రీ ఇచ్చింది.

Read Also : Honda Elevate SUV Launch : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ క్రెటాకు పోటీగా హోండా ఎలివేట్ SUV కారు.. 4 వేరియంట్ల ధర ఎంతంటే?

C40 రీఛార్జ్ ఎక్స్-షోరూమ్ ధరలో 3 ఏళ్ల సమగ్ర వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 సంవత్సరాల వోల్వో సర్వీస్ ఉన్నాయి. ప్యాకేజీ, బ్యాటరీ ప్యాక్‌పై 8 ఏళ్ల వారంటీ, డిజిటల్ సర్వీసులకు 5 సంవత్సరాల సభ్యత్వం, 11kW వాల్ బాక్స్ ఛార్జర్ కూడా పొందవచ్చు. వోల్వో C40 రీఛార్జ్ కారు 78kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. 402bhp, 660Nm టార్క్, 530కి.మీ WLTP పరిధిని అందిస్తుంది. C40 రీఛార్జ్ 4.7 సెకన్లలో 0 నుంచి 100kmph వరకు, గరిష్టంగా 180kmph వేగంతో దూసుకుపోగలదని వోల్వో తెలిపింది.

Volvo C40 Recharge launched in India at Rs 61.25 lakh

Volvo C40 Recharge launched in India at Rs 61.25 lakh

ఫీచర్ల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ కొత్త వోల్వో C40 రీఛార్జ్ లెదర్-ఫ్రీ ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్, 13-పీకర్ హార్మన్ కార్డాన్ సిస్టమ్, గూగుల్ వాయిస్ అసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, అధునాతన ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

భద్రత పరంగా, కొత్త వోల్వో C40 రీఛార్జ్ 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, క్రాస్-ట్రాఫిక్ అలర్ట్‌తో కూడిన బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పైలట్ అసిస్ట్, లేన్ కీపింగ్ ఎయిడ్, కొలిషన్ మిటిగేషన్ సపోర్ట్ (ఫ్రంట్ & బ్యాక్), పార్కింగ్ అసిస్టెన్స్ సెన్సార్లు (ఫ్రంట్, సైడ్ & రియర్) ఇతర వాటిలో ప్రధానంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా కొత్త వోల్వో కారును కొనాలనుకుంటే.. ఇప్పుడే ఆన్‌లైన్‌లో రూ. లక్ష కట్టి బుకింగ్ చేసుకోవచ్చు.

Read Also : Reliance Jio Data Offer : జియోకు 7 ఏళ్లు.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై 21GB డేటా ఉచితం.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!