Update చేసుకున్నారా? : వాట్సాప్ లో కొత్త ఫీచర్లు 

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లు, ఫంక్షనాల్టీతో ముందుకొస్తోంది. యాప్ ప్లాట్ ఫాంపై కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్..

  • Published By: sreehari ,Published On : April 8, 2019 / 09:57 AM IST
Update చేసుకున్నారా? : వాట్సాప్ లో కొత్త ఫీచర్లు 

Updated On : April 8, 2019 / 9:57 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లు, ఫంక్షనాల్టీతో ముందుకొస్తోంది. యాప్ ప్లాట్ ఫాంపై కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లు, ఫంక్షనాల్టీతో ముందుకొస్తోంది. యాప్ ప్లాట్ ఫాంపై కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్.. ఫార్వాడింగ్ ఇన్ఫో ఫీచర్ ను ప్రవేశపెట్టగా.. ఆండ్రాయిడ్, iOS ప్లాట్ ఫాంలపై బీటా వెర్షన్ అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం.. ఫేస్ బుక్ సొంత సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అదే.. కొత్త ఆడియో పిక్కర్. ఈ కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ తీసుకొచ్చే కొత్త ఫీచర్ Audio Picker యూజర్ ఇంటర్ ఫేస్ ను మార్చేపనిలో పడింది.
Read Also : ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు

ఇప్పటివరకూ యూజర్లు తమ Whatappలో ఒక వీడియోను ఒకసారి మాత్రమే స్నేహితులకు, బంధువులకు పంపేందుకు వీలుంది. కానీ, ఇప్పుడు ఒకేసారి మల్టీపుల్ ఆడియో ఫైళ్లను పంపేలా యూజర్లకు అనుమతిపై కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి ఫంక్షనాల్టీని కూడా యాడ్ చేస్తోంది. అంటే.. ఆడియో ఫైల్ పంపే ముందు యూజర్లు ప్రివ్యూ చూసుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ Beta ఆండ్రాయిడ్ వెర్షన్ 2.19.89 అప్ డేట్ లో అందుబాటులో ఉంది. అన్ని ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. 

మరోవైపు.. వాట్సాప్.. మోడిఫైయిడ్ వెర్షన్ గ్రూపు ఫీచర్.. ఫ్రీక్వెంట్లీ ఫార్వాడెడ్ మెసేజ్ ఫీచర్ ను కూడా గ్రూపుల్లో యాడ్ చేయనుంది. యూజర్లు తమకు నచ్చిన  గ్రూపులో యాడ్ అయ్యేలా కొత్త ఫీచర్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు రాబోయే కొత్త ఫీచర్ తో గ్రూపులో అడ్మిన్లకు మరింత కంట్రోల్ రానుంది.

తమ గ్రూపుల్లో ఏ సమాచారం షేర్ అవుతుంది అనేది తెలుసుకునే వీలు ఉంటుంది. ఇటీవల వాట్సాప్ ఫార్వాడింగ్ ఇన్ఫో, ఫ్రీక్వెంట్లీ ఫార్వెడెడ్ మెసేజ్ ఫీచర్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఫీచర్లు వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.19.86 అప్ డేట్ తో అందుబాటులో ఉన్నాయి.
Read Also : Paytm మాల్ ప్లాన్ : 300 మంది ఉద్యోగులు కావాలి