WhatsApp Filters : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. వీడియో కాల్స్‌కు ఫిల్టర్ ఎఫెక్ట్స్.. బ్యాక్‌గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు..!

WhatsApp Filters : ఈ కొత్త ఫీచర్‌లు ఏంటి? వీడియో కాల్స్ సమయంలో ఎలాంటి ఎఫెక్ట్స్ అప్లయ్ చేయొచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Filters : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. వీడియో కాల్స్‌కు ఫిల్టర్ ఎఫెక్ట్స్.. బ్యాక్‌గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు..!

WhatsApp introduces filters and backgrounds for video calls_ What's new

Updated On : October 2, 2024 / 3:13 PM IST

WhatsApp Filters : వాట్సాప్ యూజర్లకు అదిరే అప్‌డేట్.. ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. తాజాగా వాట్సాప్ వీడియో కాల్స్ కోసం కొత్త కెమెరా ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌ వంటి కొత్త ఆప్షన్‌లను తీసుకొచ్చింది. ఇప్పుడు యూజర్లు తమ బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చుకోవడంతో పాటు వీడియో కాల్ సమయంలో ఫిల్టర్‌ని యాడ్ చేసుకోవచ్చు.

Read Also : WhatsApp Messages : వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా?

ఈ కొత్త ఫీచర్లు చాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేస్తాయి. ఇప్పుడు, వినియోగదారులు తమ వీడియో కాల్‌లను ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లతో కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రతి చాట్‌కు ప్రత్యేకమైన ఫిల్టర్ యాడ్ చేయొచ్చు. మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులతో చాట్ చేస్తున్నా.. మీ మానసిక స్థితి లేదా సెట్టింగ్‌కు అనుగుణంగా మీ వీడియో ఎక్స్‌పీరియన్స్ సింకరైజ్ చేసేందుకు ఈ ఫీచర్‌లు అనుమతిస్తాయి.

ఈ అప్‌డేట్‌లతో వాట్సాప్ వీడియో కాలింగ్‌ను కేవలం ఫంక్షనల్‌గా మాత్రమే కాకుండా ఆనందదాయకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ఫీచర్‌లు ఏంటి? వీడియో కాల్స్ సమయంలో ఎలాంటి ఎఫెక్ట్స్ అప్లయ్ చేయొచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వీడియోలకు ఫిల్టర్‌ ఎఫెక్ట్‌ :
కొత్త ఫీచర్లలో ఫిల్టర్ ఫీచర్ ఒకటి. వినియోగదారులు ఈ ఫిల్టర్‌ల ద్వారా తమ వీడియోకు మరింత కలర్ ఫుల్‌గా మార్చుకోవచ్చు. వార్మ్, కూల్, బ్లాక్ అండ్ వైట్, డ్రీమీ మరిన్ని ఆప్షన్లతో సహా 10 ఫిల్టర్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఫిల్టర్ విభిన్న మూడ్‌ని ఎంచుకోవచ్చు. వినియోగదారులు తమ చాట్‌కు సరిపోయేదాన్ని ఎంచుకోవచ్చు. వీడియో కాల్‌ల సమయంలో బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేసేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది.

మరిన్ని బ్యాక్‌‌గ్రౌండ్ ఆప్షన్లు :
వాట్సాప్ ఫీచర్లలో బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్ ఒకటి. మీరు వీడియో కాల్ సమయంలో మీ బ్యాక్ కనిపించే వాటిని ఈజీగా మార్చుకోవచ్చు.సరికొత్త లొకేషన్ ఉన్నట్టుగా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు నిద్రించే గదిలో, రద్దీగా ఉండే కేఫ్‌లో లేదా బీచ్‌లో ఉన్నట్లుగా బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. బ్లర్ ఎఫెక్ట్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. మీ బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడానికిఫిల్టర్‌ల మాదిరిగానే 10 బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్లు ఉన్నాయి. స్టైలిష్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఈ ఫీచర్ యూజర్లు ప్రైవసీకి సరైనదిగా చెప్పవచ్చు.

టచ్ అప్ ఫీచర్ :
వాట్సాప్ టచ్ అప్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ మీ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేస్తుంది. అదనంగా, డిమ్ సెట్టింగ్‌లలో కూడా ప్రకాశాన్ని పెంచేలా లో లైటింగ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఎక్కడ ఉన్నా మీ వీడియో స్పష్టంగా ఉండేలా చూసుకోండి.

ఈ ఫీచర్లను ఎలా వాడాలంటే? :
వీడియో కాల్ సమయంలో ఈ ఫీచర్‌లను స్క్రీన్‌పై రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న ఎఫెక్ట్స్ ఐకాన్ ట్యాప్ చేయండి. అందుబాటులో ఉన్న ఆప్షన్ల ద్వారా బ్రౌజ్ చేయండి. మీరు 1:1 కాల్‌లో ఉన్నా లేదా గ్రూప్ వీడియో చాట్‌లో ఉన్నా, ఈ ఎఫెక్ట్‌లను యాక్సెస్ చేయొచ్చు. అలాగే అప్లయ్ చేయడం చాలా సులభం కూడా.

ఈ ఫీచర్లు ఎప్పుడు వస్తాయంటే? :
ఈ కొత్త అప్‌డేట్‌లు రాబోయే వారాల్లో వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఒక్కరూ వాట్సాప్‌లో ఫిల్టర్ ఎఫెక్ట్స్‌తో కూడిన సరికొత్త కస్టమైజడ్ ఫిల్టర్లతో వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

Read Also : WhatsApp Filters Effects : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. సింగిల్ క్లిక్‌తో ఫొటోలు, వీడియోలకు ఫిల్టర్ ఎఫెక్ట్స్..!