WhatsApp New Features : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. ఇకపై ఫొటో, వీడియోలను మరింత క్రియేటివ్‌గా చేయొచ్చు!

WhatsApp New Features : ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు సులభంగా ఇంటరాక్ట్ అయ్యేందుకు వాట్సాప్ వరుస అప్‌డేట్‌లను ప్రవేశపెట్టింది.

WhatsApp New Features : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. ఇకపై ఫొటో, వీడియోలను మరింత క్రియేటివ్‌గా చేయొచ్చు!

WhatsApp New Features

Updated On : January 15, 2025 / 5:28 PM IST

WhatsApp New Features : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులను అందిస్తోంది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు సులభంగా ఇంటరాక్ట్ అయ్యేందుకు వాట్సాప్ వరుస అప్‌డేట్‌లను ప్రవేశపెట్టింది. ఈ మార్పులలో మెసేజింగ్‌ను మరింత కస్టమైజ్ చేసేందుకు రూపొందించిన కొత్త ఫీచర్‌లు, క్రియేటివీటికి సంబంధించిన అప్‌డేట్‌లను పొందవచ్చు.

Read Also : WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. త్వరలో గూగుల్ ఫొటోలను రివర్స్ సెర్చ్ చేయొచ్చు.. ఇదేలా ఎలా పనిచేస్తుందంటే?

చాట్‌లలో షేర్ చేసే ఫొటోలు, వీడియోల కోసం కెమెరా ఎఫెక్ట్‌లను ఎంచుకోవచ్చు. వినియోగదారులు ఇప్పుడు 30 విభిన్న ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లు, విజువల్ ఎఫెక్ట్‌ల నుంచి ఎంచుకోవచ్చు. వాటిని పంపే ముందు మెరుగుపరచవచ్చు. గత ఏడాదిలో వీడియో కాల్స్ కోసం వాట్సాప్ రూపొందించిన టూల్స్‌పై విస్తరిస్తుంది. నేరుగా మెసేజింగ్‌లో మరిన్ని క్రియేటివిటీ ఆప్షన్లను అందిస్తోంది.

వినియోగదారులకు ఆకర్షణీయమైన మరో కొత్త ఫీచర్ సెల్ఫీ స్టిక్కర్లు. ఇప్పుడు మీ చాట్‌లలో షేర్ చేయడానికి మీ సెల్ఫీలను స్టిక్కర్‌లుగా మార్చవచ్చు. మీరు చేయాల్సిందల్లా క్రియేట్ స్టిక్కర్ ఐకాన్ ట్యాప్ చేయండి > సెల్ఫీని క్యాప్చర్ చేసేందుకు కెమెరాను ఉపయోగించండి. మీరు కస్టమైజడ్ స్టిక్కర్‌ని పొందవచ్చు. ప్రస్తుతం, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. ఐఓఎస్ యూజర్లు ఈ కొత్త ఫీచర్ త్వరలో పొందవచ్చు.

వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్‌లను షేర్ చేసుకోవచ్చు. ఒక స్నేహితుడి కోసం స్టిక్కర్ ప్యాక్ ఎంచుకుని ఇప్పుడు మీరు దాన్ని నేరుగా మీ చాట్‌లలో షేర్ చేయవచ్చు. వారి కలెక్షన్లను ఇచ్చిపుచ్చుకోవడం షేర్ చేయొచ్చు. స్టిక్కర్ యూజర్లకు కచ్చితంగా నచ్చే సులభమైన ఆప్షన్‌గా ఉంటుంది. కొత్త అప్‌డేట్ రియాక్షన్లకు ఉపయోగకరమైన ఆప్షన్లను కూడా అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు రియాక్షన్లకు మెసేజ్‌పై రెండుసార్లు ట్యాప్ చేయొచ్చు.

వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే ఎమోజీలను కలిగిన స్క్రోలింగ్ పాప్-అవుట్ మెను కూడా ప్రవేశపెట్టింది. తరచుగా ఉపయోగించే రియాక్షన్లను వేగంగా వినియోగించవచ్చు. ఫుల్ ఎమోజి లైబ్రరీ ఇప్పటికీ రియాక్షన్ బార్ “+” ఐకాన్ ద్వారా యాక్సెస్ చేసేలా ఉంటుంది. ఈ ఫీచర్ డిస్కార్డ్ ఆఫర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను పోలి ఉంటుంది. తరచుగా ఉపయోగించే రియాక్షన్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

మెటా మెసెంజర్ యాప్ ఇప్పటికీ రియాక్షన్‌ల కోసం స్టేబుల్ ఎమోజీలను అందిస్తోంది. వాట్సాప్‌లో ఈ కొత్త అప్‌డేట్ చాలా మంది యూజర్లకు కస్టమైజడ్ అదనపు లేయర్ అందిస్తుంది. వాట్సాప్‌లో ఈ కొత్త మార్పులు 2025లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లకు ప్రైవసీ, భద్రతకు ప్రాధాన్యతనిస్తూనే మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌‌పై దృష్టి సారించింది.

Read Also : Trump Inauguration : ఈ నెల 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. హాజరుకానున్న బోజోస్, మస్క్, జుకర్‌బర్గ్..!