WhatsApp Disappearing Messages : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. అదృశ్యమయ్యే మెసేజ్‌లను కూడా ఇలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు!
WhatsApp Disappearing Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ ఇటీవల కొత్త ‘Kept’ మెసేజ్‌ల ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.

WhatsApp may soon allow users to save disappearing messages _ Here is how
WhatsApp Disappearing Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ ఇటీవల కొత్త ‘Kept’ మెసేజ్‌ల ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ అదృశ్యమవుతున్న మెసేజ్ (disappearing messages)లను సేవ్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.
WhatsApp ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఇంకా బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి రాలేదు. వాట్సాప్ అదృశ్యమవుతున్న మెసేజ్ ఫీచర్ నిర్దిష్ట సమయం వరకు చాట్ విండోలో మాత్రమే ఉండే మెసేజ్‌లను పంపడానికి యూజర్లను అనుమతిస్తుంది.
Kept మెసేజ్ ఫీచర్ ద్వారా అదృశ్యమవుతున్న మెసేజ్‌లను సులభంగా సేవ్ చేయవచ్చు. ఈ ఫీచర్ బీటా టెస్టర్‌ల కోసం రూపొందించారు. మొదట Wabetainfo ద్వారా గుర్తించారు. తాత్కాలికంగా సేవ్ చేసిన అదృశ్యమయ్యే మెసేజ్ చాట్ నుంచి ఆటోమాటిక్‌గా డిలీట్ కాదు. చాట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పటికీ దానిని చూడగలరు. అయినప్పటికీ, యూజర్లు తమ మెసేజ్‌లను సేవ్ చేయకూడదనుకుంటే వాటిని ‘Un-Keep’ చేయవచ్చు. అన్-కీప్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత చాట్‌లు చాట్ నుంచి అదృశ్యమవుతాయి.
Wabetainfo స్క్రీన్‌షాట్ ప్రకారం.. చాట్‌లో ఉంచిన మెసేజ్ సూచించే బుక్‌మార్క్ ఐకాన్.. కీప్ మెసేజ్ గుర్తించడానికి అదృశ్యమయ్యే మెసేజ్ బబుల్‌లో కనిపిస్తుంది. అదృశ్యమవుతున్న మెసేజ్ Kept అని ఐకాన్ సూచిస్తుంది. ఈ ఐకాన్ కనిపించిన తర్వాత, చాట్ విండో నుండి మెసేజ్ అదృశ్యం కాదు.

WhatsApp may soon allow users to save disappearing messages
అదృశ్యమవుతున్న మెసేజ్ ఫీచర్ ఆన్ చేసినా మెసేజ్ టైమ్ గడువు ముగిసినా కూడా కనిపిస్తుంది. చాట్‌లోని సాధారణ అదృశ్యమయ్యే మెసేజ్ నుంచి Kept మెసేజ్‌లను సులభంగా గుర్తించడానికి ఈ ఫీచర్ యూజర్లను అనుమతిస్తుంది. చాట్‌లో పాల్గొనే వారందరూ ఏ సమయంలోనైనా ఈ మెసేజ్‌లను డిలీట్ చేయొచ్చునని గమనించాలని వెబ్‌సైట్ పేర్కొంది.
వాట్సాప్ ఫ్యూచర్ అప్‌డేట్ కోసం WhatsApp ప్రస్తుతం అదృశ్యమయ్యే మెసేజ్‌లను ఉంచే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోందని వెబ్‌సైట్ నివేదించింది. ఈ ఫీచర్ ఎప్పుడు యూజర్లకు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల సందర్భాలలో మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్ చేయడానికి WhatsApp అధికారికంగా ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
WhatsApp Proxy సర్వర్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించి WhatsApp యూజర్లు మెసేజ్ యాప్‌ను యాక్సెస్ చేయగలరు. ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు తరచుగా జరిగే దేశాలు, నగరాల్లో కొత్త సర్వీసులు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం, హిజాబ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన కారణంగా నెలరోజుల పాటు ఇంటర్నెట్ పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..