WhatsApp Blocked : మీ వాట్సాప్ బ్లాక్ అయిందా? ఈ Proxy టూల్ ద్వారా ఈజీగా రీస్టోర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Blocked : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) అకౌంట్ బ్లాక్ అయిందా? వాట్సాప్ సర్వీసులు మీరు ఉండే ప్రాంతాల్లో బ్యాన్ చేసినా లేదా బ్లాక్ చేసినా కూడా మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. WhatsApp ప్రాక్సీ (Proxy Server) సర్వర్‌లను ప్రవేశపెట్టింది.

WhatsApp Blocked : మీ వాట్సాప్ బ్లాక్ అయిందా? ఈ Proxy టూల్ ద్వారా ఈజీగా రీస్టోర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Access to WhatsApp blocked_ Now you can use proxy server to restore it

WhatsApp Blocked : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) అకౌంట్ బ్లాక్ అయిందా? వాట్సాప్ సర్వీసులు మీరు ఉండే ప్రాంతాల్లో బ్యాన్ చేసినా లేదా బ్లాక్ చేసినా కూడా మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. WhatsApp ప్రాక్సీ (Proxy Server) సర్వర్‌లను ప్రవేశపెట్టింది. ఈ సర్వర్ ఉపయోగించి వాట్సాప్ వినియోగదారులు మెసేజ్ యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు తరచుగా జరిగే దేశాలు, నగరాల్లో కొత్త సర్వీసులను ప్రత్యేకంగా యాక్సస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనల కారణంగా నెలరోజుల పాటు ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోయాయి.

WhatsApp CEO విల్ క్యాత్‌కార్ట్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. చాలా మంది మన ప్రియమైనవారికి WAలో మెసేజ్ పంపడం ద్వారా కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. అయితే, ఇరాన్‌తో పాటు ఇతర ప్రాంతాలలో లక్షలాది మంది యూజర్లు స్వేచ్ఛగా తమ సర్వీసులను వినియోగించాలని భావిస్తున్నారు. వాట్సాప్ యూజర్లు స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసేందుకు వాలంటీర్లు, సంస్థలు ఏర్పాటు చేసిన సర్వర్‌ల ద్వారా ప్రాక్సీ సర్వర్ ఎవరినైనా కనెక్ట్ చేయొచ్చునని క్యాత్‌కార్ట్ పేర్కొంది. వాట్సాప్‌కి కనెక్షన్ బ్లాక్ చేసినప్పుడు.. యాక్సెస్‌ని రీస్టోర్ చేసే అధికారం యూజర్లకు ఉంటుంది. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల కోసం ప్రాక్సీ సపోర్టును అందిస్తోంది.

Read Also : WhatsApp Mini-Guide : ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ స్టోరేజీని ఎలా క్లియర్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

వాట్సాప్‌లో సెక్యూరిటీతో పాటు ప్రైవసీకి సంబంధించి ఆందోళన అవసరం లేదు. మీరు ప్రాక్సీ సర్వర్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు WhatsApp హైలెవల్ ప్రైవసీతో పాటు సెక్యూరిటీని అందిస్తుందని గమనించాలి. మీరు ప్రాక్సీ ద్వారా WhatsAppని యాక్సెస్ చేసినప్పటికీ.. మీ పర్సనల్ మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది.

Access to WhatsApp blocked_ Now you can use proxy server to restore it

Access to WhatsApp blocked_ Now you can use proxy server to restore it

మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తికి మధ్య జరిగే చాట్ డేటా కూడా ప్రాక్సీ సర్వర్ల మధ్య సేఫ్‌గా ఉంటుంది. వాట్సాప్ లేదా మెటాకు కాకుండా మధ్యలో ఎవరికీ కనిపించకుండా వాట్సాప్ ప్రొటెక్ట్ చేస్తుంది. విశ్వసనీయమైన కమ్యూనికేషన్ అవసరం ఉన్న చోట ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ యూజర్లకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నామని WhatsApp బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల సమయంలో వాట్సాప్ కనెక్ట్ చేయడానికి మీరు ప్రాక్సీని ఎలా సెటప్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.. వాట్సాప్ కనెక్ట్ చేయాలంటే.. పోర్ట్‌లు 80, 443 లేదా 5222 సర్వర్ IP అడ్రస్ సూచించే డొమైన్ పేరు (లేదా సబ్‌డొమైన్) ఉన్న సర్వర్‌ని ఉపయోగించి ప్రాక్సీ సర్వర్‌ని సెటప్ చేయవచ్చు. వివరణాత్మక డాక్యుమెంటేషన్, సోర్స్ కోడ్ GitHubలో అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌కు నేరుగా కనెక్ట్ చేయలేని యూజర్లు ఈ అడ్రస్ ప్రైవేట్‌గా షేర్ చేసుకోవచ్చు. మెసేజింగ్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌లో అప్‌డేట్ అందుబాటులో ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Transfer Data : ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్ లేకుండా ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా?