WhatsApp Chat Lock : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ పర్సనల్ చాట్ ఇలా లాక్ చేయొచ్చు తెలుసా?
WhatsApp Chat Lock : కొత్త చాట్ లాక్ ఫీచర్ వచ్చేసింది. మీ డివైజ్‌లో పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్‌తో మాత్రమే యాక్సెస్ చేసే ఫోల్డర్‌లో పర్సనల్ చాట్ లాక్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

WhatsApp rolls out chat lock feature, here is how to lock your personal chat
WhatsApp Chat Lock : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఇటీవల కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్‌తో పర్సనల్ చాట్‌లను లాక్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లు తమ మెసేజ్ సెక్యూరిటీని మెరుగుపర్చేందుకు అనుమతిస్తుంది. అంతేకాదు.. యూజర్ల ప్రైవసీని కాపాడేందుకు అనుమతిస్తుంది. ఇతరులు వాట్సాప్ చాట్ యాక్సెస్ చేయకుండా సీక్రెట్ లేదా పర్సనల్ చాట్ లాక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ఫీచర్‌లోని కొత్త ‘Chat Lock’ యూజర్ చాట్ ప్రత్యేక ఫోల్డర్‌లోకి మార్చేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ యూజర్ల డివైజ్ పాస్‌వర్డ్ లేదా ఫింగర్ ఫ్రింట్ వంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించి మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. చాట్ లాక్ చేస్తే.. ఈ ఫీచర్ ఆటోమాటిక్‌గా నోటిఫికేషన్‌లలో చాట్ విషయాలను హైడ్ చేస్తుంది. వాట్సాప్ ద్వారా కొత్త (Chat Lock) ప్రైవసీ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..
వాట్సాప్‌లో చాట్ లాక్‌ని ఎలా ఉపయోగించాలంటే? :
– వాట్సాప్ డౌన్‌లోడ్ చేయండి లేదా అప్‌డేట్ చేయండి. మీ Android లేదా iOS డివైజ్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ని అప్‌డేట్ చేసుకోండి. మీ సంబంధిత యాప్ స్టోర్‌ల నుంచి కూడా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
– మీరు లాక్ చేయాలనుకునే చాట్‌కి వెళ్లండి. వాట్సాప్ ఓపెన్ చేసి లాక్ చేసే నిర్దిష్ట చాట్‌కు నావిగేట్ చేయండి.
– కాంటాక్టు లేదా గ్రూపు ప్రొఫైల్ ఫొటోపై నొక్కండి. మీ చాట్‌లో ఉన్నప్పుడు, మరిన్ని ఆప్షన్లను యాక్సెస్ చేసేందుకు కాంటాక్టు లేదా గ్రూపు యొక్క ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయండి.
– ‘చాట్ లాక్’ని ఎంచుకోండి. మీరు ‘చాట్ లాక్’ అనే కొత్త ఆప్షన్ చూసే వరకు మెనుని కిందికి స్క్రోల్ చేయండి. అదృశ్యమయ్యే మెసేజ్ మెనుకి దిగువన కనిపిస్తుంది. ఇప్పుడు Continue ఆప్షన్ నొక్కండి.
– చాట్ అన్‌లాక్ అథెంటికేషన్ : మీరు ‘చాట్ లాక్’పై నొక్కితే.. మీకు ఒక ప్రాంప్ట్ మెసేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత, మీ ఫోన్ పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్‌లను ఉపయోగించి అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

WhatsApp rolls out chat lock feature, here is how to lock your personal chat
వాట్సాప్‌లో లాక్ చేసిన చాట్‌లను యాక్సస్ చేయాలంటే? :
– వాట్సాప్ ఓపెన్ చేసి.. మీ హోమ్ పేజీకి వెళ్లండి. వాట్పాప్ ఓపెన్ చేసిన తర్వాత, మీ అన్ని చాట్‌లతో హోమ్ పేజీ కనిపిస్తుంది.
– లాక్ చేసిన అన్ని చాట్‌లను యాక్సెస్ చేసేందుకు కిందికి స్వైప్ చేయండి. లాక్ చేసిన అన్ని చాట్‌లను యాక్సెస్ చేసేందుకు స్క్రీన్‌పై కిందికి స్వైప్ చేయండి. వాట్సాప్‌లో మీరు లాక్ చేసిన అన్ని చాట్‌లు మీకు కనిపిస్తాయి.
– మీ వాట్సాప్ లాక్ చేసిన చాట్‌పై నొక్కండి. ఆ తర్వాత మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్న చాట్‌ను ఎంచుకోండి.
– చాట్‌ని అన్‌లాక్ అథెంటికేషన్ ద్వారా చాట్‌ని అన్‌లాక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్‌లను ఉపయోగించి అథెంటికేషన్ పూర్తి చేయొచ్చు.
ముఖ్యంగా, మీరు చాట్ లాక్ ఓపెన్ చేశాక అన్‌లాక్ చేసే వరకు చాట్‌లోని అన్ని మెసేజ్‌లు హైడ్ అవుతాయి. ప్రతి చాట్‌కు ఒక్కొక్కటిగా ఒకే దశలను ఫాలో కావడం ద్వారా వాట్సాప్‌లో మల్టీ చాట్‌ల కోసం చాట్ లాక్‌ని కూడా ప్రారంభించవచ్చు. అదనంగా, వాట్సాప్ భవిష్యత్తులో చాట్ లాక్ ఇతర డివైజ్ లకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. లాక్ చేయడంతో పాటు చాట్‌ల పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం వంటి మరిన్ని ఆప్షన్లను అందించనుంది.
Read Also : Vodafone Layoffs : వోడాఫోన్‌లో భారీ ఉద్యోగాల కోతకు ప్లాన్.. 11వేల మందిని తొలగించక తప్పదు.. సీఈఓ ప్రకటన