WhatsApp Feature : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను పంపుకోవచ్చు!

WhatsApp Feature : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే కాదు.. ఐఫోన్లలోనూ ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను ఫైల్ ఫార్మాట్‌లో పంపుకోవచ్చు.

WhatsApp Feature : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను పంపుకోవచ్చు!

WhatsApp rolls out feature to send original quality media as a file for iPhone users

WhatsApp Feature : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీసు వాట్సాప్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే అనేక ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్, వాట్సాప్ వెబ్‌తో కూడిన మల్టీ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది.

యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కంపెనీ తన విభిన్న క్లయింట్‌లకు కొత్త ఫీచర్‌లను అందిస్తూనే ఉంది. ఇంతకుముందు, వాట్సాప్ ఐఫోన్ యూజర్ల కోసం ఒక ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. వినియోగదారులను కొంతమంది వినియోగదారులతో ఒరిజినల్ క్వాలిటీ గల మీడియాను ఫైల్‌గా పంపడానికి అనుమతిస్తుంది.

Read Also : WhatsApp Channel Owners : మీకు వాట్సాప్ ఛానల్ ఉందా? త్వరలో కొత్త అడ్మిన్లను కూడా ఇన్వైట్ చేయొచ్చు!

వాట్సాప్ (WABetaInfo) నివేదిక ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఎలాంటి మార్పులు అవసరం లేకుండా ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను త్వరగా షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్ (వెర్షన్ 23.24.73)తో ఈ ఫీచర్ ఐఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తోంది. యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసే ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

ఈ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి? :
వాట్సాప్ కొత్త ఫీచర్ వినియోగదారులకు ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలు, వీడియోలను డాక్యుమెంట్లుగా పంపడానికి సాయపడుతుంది. కంప్రెస్ చేయడం లేదా క్వాలిటీ నష్టం లేకుండా షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయాలంటే.. చాట్ షేర్ షీట్‌ని ఓపెన్ చేసి.. డాక్యుమెంట్ ఫైల్ ఫార్మాట్ ద్వారా ఫొటో లేదా వీడియోని ఎంచుకోండి అనే ఆప్షన్ ట్యాప్ చేయండి.

WhatsApp rolls out feature to send original quality media as a file for iPhone users

WhatsApp feature for iPhone users

ఐఫోన్‌ వాట్సాప్‌లో ఇతర ఫీచర్లు :
ఇవే కాకుండా ఐఫోన్‌లోని వాట్సాప్ యూజర్లు మరికొన్ని ఫీచర్లను కూడా పొందవచ్చు. ఈ అప్‌డేట్‌తో, ఐఫోన్ వినియోగదారులు పెద్ద గ్రూపులలో ప్రతి ఒక్కరినీ ఫోన్ రింగ్ చేయకుండానే వాయిస్ చాట్‌లను పంపుకోవచ్చు. అంతేకాకుండా, వాట్సాప్ ఇప్పుడు చాట్‌లో కొత్త బబుల్స్‌ను కూడా రిలీజ్ చేస్తోంది. ఐఫోన్ వినియోగదారులకు మిస్డ్ కాల్, కొనసాగుతున్న వాట్సాప్ కాల్ లేదా పూర్తయిన కాల్‌లను చూసేందుకు సాయపడుతుంది.

ఐఫోన్‌లోని వాట్సాప్ వినియోగదారులు తమ అవతార్‌ను ఉపయోగించి స్టేటస్ అప్‌డేట్‌లకు రిప్లయ్ ఇవ్వచ్చు. ఈ కొత్త అప్‌డేట్‌ను కొంతమంది వినియోగదారులు కనుగొనలేకపోతే, కొన్ని అకౌంట్లు రాబోయే వారాల్లో అందుకోవచ్చునని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్‌లను పొందడానికి, వినియోగదారులు తమ వాట్సాప్‌ను యాప్ స్టోర్, టెస్ట్‌ఫ్లైట్ యాప్ నుంచి క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also : Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదిరే ప్లాన్.. ఈ కొత్త ప్లాన్‌తో డిస్నీ‌ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా..