WhatsApp Channels : వాట్సాప్ ఛానెల్‌లో త్వరలో పర్సనల్ చాట్స్ నుంచి నేరుగా మీడియా ఫైల్స్ ఫార్వార్డ్ చేయొచ్చు!

WhatsApp Channels : ఈ కొత్త అప్‌డేట్‌లో వాట్సాప్ ఛానెల్ ఓనర్లు తమ వ్యక్తిగత చాట్ నుంచి నేరుగా మెసేజ్‌లు, మీడియాను ఫార్వార్డ్ చేయడానికి ఒక ఫీచర్‌ను తీసుకువస్తోంది.

WhatsApp Channels : వాట్సాప్ ఛానెల్‌లో త్వరలో పర్సనల్ చాట్స్ నుంచి నేరుగా మీడియా ఫైల్స్ ఫార్వార్డ్ చేయొచ్చు!

WhatsApp will soon allow channel owners to forward messages ( Image Source : Google )

WhatsApp Channels : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. అతి త్వరలో వాట్సాప్ ఛానెల్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ను భారత్‌లో రిలీజ్ చేయనుంది. వాట్సాప్ యూజర్లు తమకు సంబంధించిన అప్‌డేట్‌లను పొందడానికి వాట్సాప్ ఛానెల్‌లు ఒక ప్రైవేట్ మార్గంగా చెప్పవచ్చు. ఈ ఫీచర్ మరింత మెరుగుపరిచేందుకు గో-టు-మెసెంజర్ అప్లికేషన్ కొత్త అప్‌డేట్‌తో వస్తోంది.

ఈ కొత్త అప్‌డేట్‌లో వాట్సాప్ ఛానెల్ ఓనర్లు తమ వ్యక్తిగత చాట్ నుంచి నేరుగా మెసేజ్‌లు, మీడియాను ఫార్వార్డ్ చేయడానికి ఒక ఫీచర్‌ను తీసుకువస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ద్వారా ఛానెల్ యజమానులు వారి వ్యక్తిగత చాట్‌ల నుంచి నేరుగా వారి ఛానెల్‌లకు మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, జిఫ్ త్వరగా సులభంగా షేర్ చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. త్వరలో రెగ్యులర్ యూజర్లందరికి కూడా అందుబాటులోకి రానుంది.

Read Also : Vivo Y03t Launch : వివో నుంచి సరికొత్త Y03t ఫోన్, స్మార్ట్‌‌వాచ్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

నివేదిక ప్రకారం.. బీటా ప్రోగ్రామ్‌లోని కొంతమంది వినియోగదారులు ఇప్పుడు కొత్త ఛానెల్ ఫార్వార్డింగ్ ఫీచర్‌ను పొందవచ్చు. వాట్సాప్ ఇప్పుడు ఈ మార్పును పబ్లిక్‌తో టెస్టింగ్ చేస్తున్నట్టుగాకనిపిస్తోంది. ఈ ఫీచర్‌లో ఛానెల్ అడ్మిన్లు థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా ఫైల్ ఎక్స్‌ప్లోరర్ వంటి ఇతర యాప్‌ల నుంచి నేరుగా వారి ఛానెల్‌లకు వారి మీడియాను కూడా షేరింగ్ చేయవచ్చు.

వాట్సాప్ ఛానెల్ ఫార్వార్డింగ్.. ఇదేలా పనిచేస్తుందంటే? :
వాట్సాప్ మెసేజ్, ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఫార్మాట్లను నేరుగా ఛానెల్‌లకు సులభంగా ఫార్వార్డ్ చేయొచ్చు. అలాగే షేరింగ్ కూడా చేయొచ్చు. కాంటాక్టు ఛానెల్ అడ్మిన్లకు గణనీయమైన మరింత పవర్ అందిస్తుంది. ఈ ఫీచర్ గతంలో అవసరమైన మల్టీ ఆప్షన్లను తొలగించడం ద్వారా ఛానెల్‌లను సులభంగా మేనేజ్ చేయొచ్చు.

వినియోగదారులు ఇకపై ముందుగా మీడియాను వారి ఫోన్లలో సేవ్ చేసి ఆపై మాన్యువల్‌గా ఛానెల్‌కు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా వారి వ్యక్తిగత చాట్‌ల నుంచి కంటెంట్‌ను ఫార్వార్డ్ చేయవచ్చు లేదా ఫైల్ ఎక్స్‌ప్లోరర్లు లేదా ఫొటో లైబ్రరీ వంటి ఇతర యాప్‌ల నుంచి మీడియాను నేరుగా వారి ఛానెల్‌లకు షేర్ చేయవచ్చు.

ఛానెల్ యజమానులు సాంప్రదాయకంగా కంటెంట్‌ని రెడీ చేయడానికి అప్‌లోడ్ చేసేందుకు వెచ్చించే సమయాన్ని తగ్గిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ బీటా లేటెస్ట్ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్‌లకు ఛానెల్‌లలో ఫార్వార్డ్, షేర్ మెసేజ్, మీడియా అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

వాట్సాప్ వీడియో నోట్స్ :
వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం అప్లికేషన్ అప్‌గ్రేడ్‌పై నిరంతరం కృషి చేస్తోంది. మరో నివేదికలో బీటా యూజర్లు తమ చాట్‌లలో కంటెంట్‌ను షేరింగ్ చేసేందుకు కొత్త కెమెరా మోడ్‌ను కూడా పొందవచ్చు. ఈ మోడ్ యూజర్లు నేరుగా కెమెరా ఇంటర్‌ఫేస్‌లో వీడియో నోట్‌లను సులభంగా రికార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది, చాట్ బార్‌లో ఉన్న కెమెరా ఐకాన్ నొక్కి పట్టుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.

వీడియో మెసేజ్‌లను క్యాప్చర్ చేయడంతో పాటు షేర్ చేయడానికి యూజర్లను అందిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వాట్సాప్ బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన ఆండ్రాయిడ్‌లో ఎంపిక చేసిన బీటా టెస్టర్‌ల ద్వారా వీడియో నోట్ మోడ్ ఫీచర్‌పై ప్రస్తుతం టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ రాబోయే రోజుల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ యాక్సెస్ చేసేందుకు మరింత మంది వినియోగదారులను అనుమతిస్తుంది.

Read Also : Redmi 13 5G Launch : రెడ్‌మి 13 5జీ ఫోన్ భారత్‌కు వచ్చేస్తోంది.. ఈ నెల 9నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?