WhatsApp Search Images : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. యాప్‌లో నేరుగా వెబ్‌లో ఫొటోలను సెర్చ్ చేయొచ్చు..!
WhatsApp Search Images : డిజిటల్‌గా మార్చిన ఫొటోలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి ఈ కొత్త ఫీచర్ యూజర్లకు కచ్చితమైన సమాచారాన్ని అందించే టూల్‌గా పనిచేస్తుంది.

WhatsApp Search Images
WhatsApp Search Images : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. షేర్ చేసిన ఫొటోల ప్రామాణికతను వెరిఫై చేసేందుకు సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ యాప్‌లో నేరుగా వెబ్ ఆధారిత ఫొటో సెర్చింగ్ నిర్వహిస్తుంది.
బీటా యూజర్ల కోసం క్రమంగా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫొటోను వీక్షిస్తున్నప్పుడు యాప్ ఆప్షన్ల మెను ద్వారా యాక్సెస్ చేయవచ్చు. బీటా యూజర్లు ఇప్పుడు ఈ టూల్ గురించి వివరాలను షేర్ చేసింది. అదనపు భద్రత, సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
డిజిటల్‌గా మార్చిన ఫొటోలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి ఈ కొత్త ఫీచర్ యూజర్లకు కచ్చితమైన సమాచారాన్ని అందించే టూల్‌గా పనిచేస్తుంది. ప్రత్యేకించి ఫొటోలు, వివిధ ఛానెల్‌లలో సర్యూలేట్ ఫొటోల ప్రామాణికతను నిర్ధారించడానికి యూజర్లను ఎనేబుల్ చేయొచ్చు. వాట్సాప్ మానిప్యులేటెడ్ మీడియా, పుకార్ల వ్యాప్తిని అరికట్టడంలో కూడా సాయపడుతుంది.
ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలి? :
వాట్సాప్ ఫీచర్‌ను ఉపయోగించేందుకు యూజర్లు వాట్సాప్ చాట్‌లో ఫొటోను ఓపెన్ చేయాలి. త్రి డాట్స్ మెను ఐకాన్‌పై ట్యాప్ చేయండి. ఓవర్‌ఫ్లో మెనూ నుంచి “వెబ్‌లో సెర్చ్ ” ఎంచుకోండి. రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను ఎనేబుల్ చేస్తుంది. ఆన్‌లైన్‌లో ఇతర ఫొటోల గురించి త్వరగా యాక్సెస్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఒక ఫొటో ఎడిట్ చేశారా? లేదా తప్పుదారి పట్టించే విధంగా మార్పింగ్ చేశారా? అని గుర్తించడానికి ఈ ఫీచర్ సాయపడుతుంది. ఆ ఫొటో కచ్చితత్వాన్ని అంచనా వేయొచ్చు.
ఈ సెర్చ్ ఫంక్షన్ షేర్ చేసిన సమాచారంపై యూజర్ కంట్రోలింగ్ అప్‌గ్రేడ్ చేయనుంది. కేవలం ఒక్క ట్యాప్‌తో వినియోగదారులు యాప్ నుంచి బయటకు రాకుండా ఫొటో సోర్స్ లేదా బ్యాగ్ గ్రౌండ్ చెక్ చేసుకోవచ్చు. సంప్రదాయ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లతో పోలిస్తే.. సమయాన్ని శ్రమను ఆదా చేస్తారు. ఫొటోను డౌన్‌లోడ్ చేసి సెర్చ్ ఇంజిన్‌కి అప్‌లోడ్ చేయాలి. ఈ ఇంటిగ్రేటెడ్ టూల్ యాప్‌లోనే ఇమేజ్‌లను త్వరగా క్రాస్-చెక్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
అదనంగా, వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఆప్షనల్‌గా రూపొందించింది. వినియోగదారులు ఈ ఫీచర్‌పై పూర్తి కంట్రోల్ కలిగి ఉంటారు. ఇమేజ్ రివర్స్ టూల్ కోసం గూగుల్ సబ్మిట్ చేసినా సెర్చ్ బెనిఫిట్స్ కోసం మాత్రమే ప్రాసెస్ అవుతుంది. వాట్సాప్ ద్వారా సేవ్ చేయలేరు. ఈ డిజైన్ యూజర్ ప్రైవసీని సూచిస్తుంది. అయితే, స్వీకరించే కంటెంట్‌ను ధృవీకరించాలనుకునే వారికి అదనపు కంట్రోల్ అందిస్తోంది.
ప్రస్తుతం, ఈ ఫీచర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసిన ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, వాట్సాప్ రాబోయే వారాల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. వాట్సాప్ యూజర్లతో షేరింగ్ చేసిన ఫొటోల అథెంటికేషన్ ధృవీకరించేందుకు యాప్‌లో ఆప్షన్ అందిస్తుంది.