One UI 7 update: మీ స్మార్ట్‌ఫోన్‌కి ఈ అప్‌డేట్‌ ఎప్పుడు వస్తుందో తెలుసా?

ఇతర కంపెనీలు ఇప్పటికే లేటెస్ట్‌ ఓఎస్‌ను విడుదల చేశాయి.

One UI 7 update: మీ స్మార్ట్‌ఫోన్‌కి ఈ అప్‌డేట్‌ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Samsung

Updated On : March 30, 2025 / 9:56 PM IST

ఆండ్రాయిడ్‌ 15తో రూపొందించిన మేజర్ One UI 7 అప్‌డేట్ కోసం శాంసంగ్ గెలాక్సీ యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గూగుల్‌తో పాటు ఇతర కంపెనీలు ఇప్పటికే లేటెస్ట్‌ ఓఎస్‌ను విడుదల చేశాయి. శాంసంగ్‌ ఇప్పటివరకు ఈ అప్‌డేట్‌ ఇవ్వలేదు.

శాంసంగ్ తొలుత 2024 చివరిలో One UI 7 బీటా ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి స్టేబుల్‌ అప్‌డేట్‌ను విడుదల చేయాలని భావిస్తోంది.

One UI 7 బీటా రోల్అవుట్ టైమ్‌లైన్ ఇలా ఉంది
One UI 7 బీటా ప్రోగ్రామ్‌ను 2024 డిసెంబర్ 5న ప్రారంభించారు. భారత్‌తో పాటు అమెరికా, యూకే, జర్మనీ, దక్షిణ కొరియా, పోలాండ్‌లో Galaxy S24 సిరీస్ (S24, S24+, S24 Ultra)తో ఇది ప్రారంభమైంది. ఈ ఏడాది మార్చి 5న శాంసంగ్‌ అధికారికంగా బీటా ప్రోగ్రామ్‌ను Galaxy Z Fold6, Z Flip6, Tab S10, Galaxy S23 సిరీస్‌లకు కూడా అందించింది.

Also Read: భారీ డిస్కౌంట్.. రూ.32 వేల స్మార్ట్‌ఫోన్‌ రూ.12,500కే.. ఇంకా ఆలోచిస్తున్నారా? 

ఇప్పటికే గెలాక్సీ ఎస్‌24 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు ఆరు బీటా బిల్డ్‌లను అందించారు. అదే సమయంలో Galaxy S23, Tab S10, Fold6, Flip6 ఇప్పటి వరకు ఒక్కొక్కటి రెండు బీటా బిల్డ్‌ల అప్‌డేట్ల చొప్పున అందుకున్నాయి.

ఈ ఏడాది జనవరి 22న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్‌ చేసిన గెలాక్సీ S25 సిరీస్ (S25, S25+, S25 అల్ట్రా)తో వన్ UI 7 స్టేబుల్ వర్షన్ ప్రారంభమైంది. వాటిల్లో వన్ UI 7ను ముందే ఇన్‌స్టాల్ చేశారు. ఇప్పుడు దీన్నే ఇతర స్మార్ట్‌ఫోన్లకు అందిస్తారు.

ప్రస్తుతం యూజర్ల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లకు స్టేబుల్ One UI 7 అప్‌డేట్‌ ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి అందుతుంది.

ఏప్రిల్ 10న మొదట Galaxy S24 సిరీస్‌ ఫోన్లను ఈ అప్‌డేట్లు వస్తాయి. ఆ తర్వాత అదే రోజు Galaxy Z Fold6, Z Flip6 కూడా అప్‌డేట్‌ను పొందుతాయి.

ఇంకా ఏయే ఫోన్లకు ఏయే రోజున అప్‌డేట్లు

  • ఏప్రిల్ 17న: గెలాక్సీ S24 FE, S23 సిరీస్, Z ఫోల్డ్5, Z ఫ్లిప్5కు
  • ఏప్రిల్ చివరి వారంలో: Galaxy S23 FE, S22 సిరీస్‌కు
  • ఏప్రిల్ 15 తర్వాత: గెలాక్సీ ట్యాబ్ S10కు
  • ఏప్రిల్ చివరి వారంలో: గెలాక్సీ ట్యాబ్ S9కు
  • ఏప్రిల్ చివరివారంలో: గెలాక్సీ ట్యాబ్ S8కు
  • మే నుంచి: ఇతర గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లకు