చెత్తంతా అక్కడికే : ఎలక్ట్రానిక్ వేస్ట్ రీ సైక్లింగ్ కోసం ఓ సిటీ

చెత్తంతా అక్కడికే : ఎలక్ట్రానిక్ వేస్ట్ రీ సైక్లింగ్ కోసం ఓ సిటీ

Updated On : March 28, 2019 / 6:19 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద రీ సైకిల్ హబ్‌ను దుబాయ్ ప్రారంభించింది. అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. జనాభా పెరిగిన కొద్దీ వాడుకునే పరికరాలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో పాటు టెక్నికల్‌గా దినదినాభివృద్ధి సాధిస్తున్న ప్రజానీకం.. ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలా వాడిన పరికారలు పాడైపోతే అన్ని పదార్థాలకు మాదిరి అవి మట్టిలో కలిసిపోవు కదా.. అందుకే ఈ వేస్ట్ పద్ధతిని వినియోగంలోకి తీసుకొచ్చారు. 

దుబాయ్‌లోని ఇండస్ట్రీయల్ పార్క్‌లో 2 లక్షల 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఈ ప్లాంట్‌ సంవత్సరానికి లక్ష టన్నుల ఈ వేస్ట్‌ను రీసైకిల్ చేసే సామర్థ్యముంది. దీని కోసం ఆ ప్రభుత్వం 120 మిలియన్ దీరామ్స్(5 మిలియన్ డాలర్లు) అంటే రూ.225కోట్లకు పైనే వెచ్చిస్తోంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాలతో పాటు ఐటీకి సంబంధించిన మరిన్ని పరికరాలను, రిఫ్రిజరేటర్ గ్యాస్‌లను రీసైకిల్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు.  

ఇండస్ట్రీయల్ పార్క్ మేనేజింగ్ డైరక్టర్ సౌద్ అబు అల్ షవారెబ్ మాట్లాడుతూ.. భౌగోళికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను చక్కదిద్దాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమంలో మొదలుపెట్టాం. దాంతో పాటు మంచి బిజినెస్ కూడా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం’ అని వెల్లడించాడు.