World smallest Jeep: హోండా యాక్టివ్ ఇంజిన్‌తో చిన్న జీప్‌ను నడిపించేస్తున్నారు

షీట్ మెటల్ కాకుండానే మొత్తం బాడీ రెడీ చేశారు. మహీంద్రా ఎస్యూవీ ఇన్ స్పిరేషన్ తో తయారుచేశానని చెప్తున్నారు.

World smallest Jeep: హోండా యాక్టివ్ ఇంజిన్‌తో చిన్న జీప్‌ను నడిపించేస్తున్నారు

Worlds Smallest Jeep Is Powered By Honda Activa And Maruti Suzuki 800

Updated On : May 12, 2021 / 3:48 PM IST

World smallest Jeep: పంజాబ్ నుంచి బాబర్ సింగ్ అనే వ్యక్తి హోండా యాక్టివా ఇంజిన్ తో చిన్న సైజు జీపును నడిపేస్తున్నాడు. అతని చిన్నతనంలో ఫుల్ సైజ్ మోడల్ తో కొనుగోలు చేసిన ప్రపంచంలోనే అత్యంత చిన్న జీపుకు హోండా యాక్టివాను తగిలించాడు. దీన్ని లిల్లీపుట్ జీప్ అని పేరు పెట్టేశారు. ఏ సమస్య లేకుండా నలుగురు వరకూ మోయగలదు ఈ జీప్.

మారుతీ సుజుకీ 800 మాడిఫైడ్ వెర్షన్ తో చేసిన చాసీస్. స్టీరింగ్ ర్యాక్, స్టీరింగ్ వీల్ కూడా ఆ వెహికల్‌దే. షీట్ మెటల్ కాకుండానే మొత్తం బాడీ రెడీ చేశారు. మహీంద్రా ఎస్యూవీ ఇన్ స్పిరేషన్ తో తయారుచేశానని చెప్తున్నారు. అంటే ఈ డిజైన్ ఫిక్స్ చేసింది కాదు కావాలంటే ఇంకా మార్చుకోవచ్చు కూడా.

మారుతీ సుజుకీ 800 విడి భాగాలే కాకుండా బజాజ్ మోటార్ సైకిల్ వస్తువులు కూడా దీనికి వాడారు. బైక్ నుంచి తీసిన డ్యూయెల్ స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్లు వాడి కంఫర్టబుల్ గా సిద్ధం చేశారు. నలుగురు కూర్చొనే కెపాసిటీని ముందు వెనుక బెంచ్ సీట్లను ఏర్పాటు చేశాడు.