Xiaomi 12 Features Leak : ట్రిపుల్ కెమెరాలతో Xiaomi 12 స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ధర, ఫీచర్లు లీక్!

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ నుంచి సరికొత్త మోడల్ సిరీస్ మార్కెట్లోకి వస్తోంది. అదే.. షావోమీ 12 సిరీస్ (Xiaomi 12 Series).. రిలీజ్ కాకముందే ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.

Xiaomi 12 Features Leak : ట్రిపుల్ కెమెరాలతో  Xiaomi 12 స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ధర, ఫీచర్లు లీక్!

Xiaomi 12 Price And Specifications Leak, Renders Hint At A Curved Display(1)

Updated On : December 17, 2021 / 9:26 PM IST

Xiaomi 12 Price Features Leak : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ నుంచి సరికొత్త మోడల్ సిరీస్ మార్కెట్లోకి వస్తోంది. అదే.. షావోమీ 12 సిరీస్ (Xiaomi 12 Series).. ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కాకముందే ఫోన్ స్పెషిఫికేషన్లు, ధర
లీకయ్యాయి. Xiaomi 12, Xiaomi 12X, Xiaomi 12 Pro, Xiaomi 12 Ultra ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు అతి త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఇంతలోనే ఆయా మోడళ్లకు సంబంధించి కీలక ఫీచర్లు లీక్ అయినట్టు తెలుస్తోంది. షావోమీ12 సిరీస్
స్మార్ట్‌ఫోన్‌ కు సంబంధించి చైనా టెక్ దిగ్గజం షావోమీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, Xiaomi 12 స్మార్ట్‌ఫోన్‌ కీ స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. అంతేకాదు.. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్‌కు సంబంధించిన డిజైన్ కూడా లీక్ అయింది.
షావోమీ 12 ఫీచర్లను ఓసారి పరిశీలిస్తే.. వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అమర్చారు.

మొబైల్ డ్యూయల్-LED ఫ్లాష్ లైట్, 50MP ప్రైమరీ సెన్సార్ కెమెరాలతో రానుంది. సెంట్రల్ అలైన్డ్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. Xiaomi 12 Full HD+ (1,920X1,080pixels) రిజల్యూషన్ డిస్‌ప్లేతో రానుంది. స్క్రీన్ ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది. ఈ Xiaomi 12 standard edition ముందుగా China Compulsory Certification (3C) వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. వెబ్ సైట్ లిస్టింగ్ ప్రకారం.. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

బేస్ షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ 5,000mAh బ్యాటరీతో వస్తోంది. USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. షావోమీ 12 8GB RAM Qualcomm Snapdragon 8 Gen 1 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 5G బేసిడ్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ (dual-SIM support)తో పాటు Bluetooth V5.2 కనెక్టివిటీతో రానుంది. Xiaomi 12 స్మార్ట్ ఫోన్ ధర రూ.69,990గా ఉండొచ్చునని అంచనా. ఇదే స్పెషిఫికేషన్లతో ఈ ఏడాది మార్చినెలలోనే మార్కెట్లో లాంచ్ అయిన Xiaomi 11 Ultra లాంచ్ అయింది.

Read Also : Acer Online Sale Discounts : భారత్‌లో ఇయర్-ఎండ్ సేల్.. ఏసర్ ల్యాప్ టాప్స్‌పై భారీ డిస్కౌంట్!