Year Ender 2024 : యూట్యూబ్ ఇయర్ ఎండ్ 2024 ట్రెండ్స్ ఇవే.. ఈ ఏడాదిలో మనోళ్లు యూట్యూబ్‌ను ఊపేశారుగా..!
Yearender 2024 : ఈ ఏడాది ముగిసే సమయానికి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google ) సొంత సర్వీసుల్లో ఒకటైన యూట్యూబ్ సంవత్సరాంతపు ట్రెండ్‌లను ముందుగానే ఆవిష్కరించింది.

Yearender 2024 _ YouTube unveils year-end trends
Year Ender 2024 : మరికొద్ది వారాల్లో 2024 ఏడాది ముగియనుంది. ఈ ఏడాది ముగిసే సమయానికి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google ) సొంత సర్వీసుల్లో ఒకటైన యూట్యూబ్ సంవత్సరాంతపు ట్రెండ్‌లను ముందుగానే ఆవిష్కరించింది. భారత అంతటా యూట్యూబ్ ప్రేక్షకులను ఆకర్షించిన క్షణాలు, క్రియేటర్లు, ఈవెంట్‌లకు సంబంధించిన ట్రెండ్స్ అందిస్తోంది. క్రికెట్ నుంచి వైరల్ మ్యూజిక్ ట్రాక్‌ల వరకు, ప్లాట్‌ఫారమ్ మరోసారి దేశంలోని కంటెంట్ టాప్ ట్రెండింగ్ విషయాలను ఒకచోట చేర్చింది.
బిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన అంశాలతో పాటు కల్చరల్ ప్రొగ్రామ్స్ హెడ్‌లైన్స్‌గా మార్చాయి. ఈ సంవత్సరంలో అతిపెద్ద డిజిటల్ ట్రెండ్‌లు ఈవెంట్‌లు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, పారిస్ 2024 ఒలింపిక్స్ వంటి ప్రపంచ క్రీడా దృశ్యాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఈవెంట్‌లు బిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించి, క్రికెట్, క్రీడలను భారతీయ ప్రేక్షకులకు ఎవర్‌గ్రీన్‌గా నిలబెట్టాయి.
కల్చర్ ప్రొగ్రామ్స్ కూడా యూట్యూబ్ ట్రెండింగ్ స్పాట్‌లైట్‌లో నిలిచాయి. అంబానీ పెళ్లికి సంబంధించిన అంశాలతో పాటు అంబానీ వెడ్డింగ్ అనే టైటిల్స్‌ని కలిగిన వీడియోలపై 6.5 బిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇందులో “మోయే మోయే” వంటి అనే పదాలు ఇంటర్నెట్ సంచలనాలుగా మారాయి. 4.5 బిలియన్ వ్యూస్ పొందాయి. దిల్జిత్ దోసాంజ్, రతన్ టాటా వంటి దిగ్గజ వ్యక్తులు మిలియన్ల మందిని ప్రేరేపించారు. దోసాంజ్ పేరుతో దాదాపు 4 బిలియన్ వ్యూస్ సాధించిన వీడియోలు ఉన్నాయి.
టాప్ కంటెంట్ క్రియేటర్లదే హవా :
యూట్యూబ్ సంవత్సరాంత నివేదికలో భారత టాప్ కంటెంట్ క్రియేటర్లదే పైచేయి అని చెప్పవచ్చు. ఎందుకంటే.. వినూత్న కథనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించేలా కంటెంట్ క్రియేట్ చేశారు. గ్లోబల్ పవర్‌హౌస్ మిస్టర్ బీస్ట్ 332 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో అగ్రస్థానంలో ఉండగా, ఫిల్మీ సూరజ్ యాక్టర్ (32.5ఎం), సుజల్ థక్రాల్ (33.5ఎం) వంటి స్వదేశీ క్రియేటర్ల లోకల్ కంటెంట్‌తో తమ సత్తా చాటారు. క్రిస్టియానో, బాక్స్ ఆఫ్ వెంజియన్స్, స్టోక్స్ ట్విన్స్ వంటి ఇతరులు ప్లాట్‌ఫారమ్ విభిన్న క్రియేటర్లుగా నిలిచారు.
భారతీయ యూట్యూబ్ క్రియేటర్లు అత్యధికంగా షార్ట్‌లపైనే ఎక్కువగా కంటెంట్ క్రియేట్ చేశారు. మరాఠీ, గర్వాలీ వంటి భాషల్లోని హైపర్‌లోకల్ మ్యూజిక్ ప్రపంచ ప్రేక్షకులను అలరించింది. దేశ విదేశాల్లో ఇదే మ్యూజిక్ అలరిస్తూ సరిహద్దులను దాటింది. భారతీయ టాప్ ఫిమేల్ యూట్యూబ్ అయిన ప్రియాల్ కుక్రేజా అద్భుతమైన మ్యూజిక్‌తో ఈ ఏడాదంతా ట్రెండింగ్‌లో నిలిచారు. అయితే క్రియేటర్లు, మీమ్‌లు, క్రికెట్ మూవెంట్స్, ప్రముఖుల వివాహాలను ఆకర్షణీయమైన స్టోరీలుగా మార్చారు. ఈ వీడియో కంటెంట్ బాగా ట్రెండ్ అయింది.
యూట్యూబ్ ట్రెండ్‌లను రూపొందించడంలో మ్యూజిక్ ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. సాహితీ చాగంటి, శ్రీకృష్ణ రచించిన “కుర్చి మడతపెట్టి”, శివ చౌదరి “జాలే 2”, మధుబంతి బాగ్చి, దివ్య కుమార్‌ల “ఆజ్ కీ రాత్” వంటి పాటలు 2024 సౌండ్‌ట్రాక్ హిట్‌గా నిలిచాయి. యూట్యూబ్ షార్ట్‌లలో, ప్రియాంక మెహెర్, రోంగ్‌పాజ్‌ల “ధనా”, కరణ్ ఔజ్లా “తౌబా తౌబా” వంటి హిట్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ ట్రాక్‌లు అభిమానులకు ఇష్టమైనవిగా కాకుండా ప్లాట్‌ఫారమ్ ఎంగేజ్‌మెంట్ పెంచడంలో సాయపడ్డాయి. వినియోగదారులు కూడా ఆకర్షణీయమైన రీల్స్ రీమిక్స్‌లు, డ్యాన్స్ ఛాలెంజ్‌లతో తమదైన శైలిలో కంటెంట్ సృష్టించారు.
2024లో అత్యంత అద్భుతమైన ట్రెండ్‌లలో ఒకటి.. యాక్టివ్ ఫ్యాన్స్ పార్టిసిపేషన్ పెరిగిపోయారు. యూట్యూబ్ వీక్షకులు కేవలం కంటెంట్‌ను వినియోగించడమే కాదు.. సొంతంగా కూడా రూపొందిస్తున్నారు. క్రికెట్ మీమ్‌లు, మ్యూజిక్ ఎడిట్‌ల నుంచి సెలబ్రిటీల వివాహాలకు వరకు ఎన్నో అద్భుతమైన కంటెంట్‌ను క్రియేట్ చేశారు. అంతేస్థాయిలో 2024 ఏడాదిలో బాగా పాపులర్ అయ్యాయి.