Zuckerberg : మార్క్ జుకర్‌బర్గ్ కీలక నిర్ణయం.. మెటా ఫ్యాక్ట్ చెకర్స్ ప్రొగ్రామ్ తొలగింపు.. ట్రంప్ మెప్పు కోసమేనా?

Zuckerberg : మెటా ఫ్యాక్ట్ చెకింగ్ ప్రొగ్రామ్‌ తొలగించింది. జుకర్‌బర్గ్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రొగ్రామ్ తొలగింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Zuckerberg : మార్క్ జుకర్‌బర్గ్ కీలక నిర్ణయం.. మెటా ఫ్యాక్ట్ చెకర్స్ ప్రొగ్రామ్ తొలగింపు.. ట్రంప్ మెప్పు కోసమేనా?

Mark Zuckerberg

Updated On : January 8, 2025 / 8:28 PM IST

Mark Zuckerberg : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు ఆయన రాగానే పెద్ద మార్పు చూస్తామా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మెటా ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రామ్‌ను తొలగించారు. దాంతో పాటు సెన్సార్‌షిప్ విధానాన్ని కూడా మార్చాలని జుకర్‌బర్గ్ నిర్ణయించారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ బాటలోనే మెటా సీఈఓ అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. మస్క్ నిర్వహించే ఎక్స్-ప్రేరేపిత కమ్యూనిటీ నోట్స్ మోడల్ వైపు జుకర్‌బర్గ్ కొనసాగనున్నారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు మెటా సపోర్టుపై ఆధారపడే థర్డ్-పార్టీ ఫ్యాక్ట్-చెకింగ్ సంస్థల భవిష్యత్తు కూడా ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. జుకర్ బర్గ్ నిర్ణయంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ వంటి మెటాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రామ్ రద్దు అవుతుంది.

Read Also : Best Mobile Phones 2025 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రూ. 35వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

మెటా సీఈఓ నిర్ణయంతో సాంకేతిక, రాజకీయ రంగాలలో పెద్ద చర్చలకు దారితీసింది. ఎందుకంటే.. మెటా స్వేచ్ఛా ప్రసంగం, కంటెంట్ నియంత్రణ, రాజకీయ ఒత్తిళ్లను సమతుల్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. బహుశా రాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే సందేహాలకు తావిస్తోంది.

మెటా ఫ్యాక్ట్ చెకింగ్ ప్రొగ్రామ్ తొలగింపు :
సోషల్ మీడియా దిగ్గజం కంటెంట్ నియంత్రణను ఎలా చేస్తుందనే ఆందోళన నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ ప్రొగ్రామ్ ముగించాలని మెటా నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలలో కీలక భాగమైన ఈ ప్రొగ్రామ్ చాలా ఏళ్లుగా అమలులో ఉంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను ధృవీకరించడానికి, తప్పుడు సమాచారాన్ని ఫ్లాగ్ చేయడానికి, ఫేక్ న్యూస్ వ్యాప్తిని తగ్గించడానికి ఇది థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది.

అయితే, జుకర్‌బర్గ్ ఇటీవల సిస్టమ్‌లోని లోపాలను ఎత్తి చూపారు. కంటెంట్‌ను మోడరేట్ చేయడంలో కంపెనీ విఫలమైందని ఆయన అంగీకరించారు. వీడియో ప్రకటనలో.. జుకర్‌బర్గ్ మెటా మూలాలకు తిరిగి రావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. స్వేచ్ఛా ప్రసంగం, యూజర్ కంటెంట్‌తో ఈ ప్లాట్‌ఫారమ్ వినియోగదారు వ్యక్తీకరణను అతిగా పరిమితం చేయకుండా దృష్టి సారిస్తుందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్‌ను బుజ్జగించేందుకేనా? :
మెటా నిర్ణయంపై చాలా మంది రాజకీయ ప్రేరేపితమా? అనేక ప్రశ్నకు దారితీసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను దీర్ఘకాలంగా విమర్శిస్తున్న ట్రంప్‌తో సంబంధాలను సరిదిద్దుకునే ప్రయత్నాల్లో భాగమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫేస్‌బుక్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లపై ట్రంప్ చేసిన విమర్శలు సెన్సార్‌షిప్ వాదనలపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఇప్పుడు ఆయన వైట్‌హౌస్‌లో మళ్లీ అడుగుపెట్టబోతున్నారు. ఈ తరుణంలో మెటా నిర్ణయం బహుశా ట్రంప్ అభిప్రాయాలతో వ్యూహాత్మకంగా సరిపోయే అవకాశం ఉందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

Mark Zuckerberg

Mark Zuckerberg

ట్రంప్‌తో సంబంధాలున్న డానా వైట్ వంటి వ్యక్తులను మెటా తన బోర్డులో ఇటీవల నియమించడం కూడా మరింత బలాన్ని ఇస్తోంది. ట్రంప్ ప్రభుత్వంతో భవిష్యత్తులో వైరుధ్యాలను నివారించడానికి మెటా ప్రయత్నిస్తోందని, సంప్రదాయవాద భావజాలంతో, ముఖ్యంగా స్వేచ్ఛా వాక్చాతుర్యంతో మరింత సన్నిహితంగా ఉండాలని సూచిస్తున్నాయి.

దాదాపు రెండు నెలల క్రితమే జుకర్‌బర్గ్ తన మార్-ఎ-లాగో క్లబ్‌లో ట్రంప్‌తో విందు చేశాడు. ఆ సమయంలో ట్రంప్ ప్రారంభోత్సవ కమిటీకి ఒక మిలియన్ డాలర్ విరాళంగా ఇవ్వడానికి మెటా ప్లాన్ గురించి చర్చించారు. 2021లో మెటా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి నిషేధానికి గురై 2023లో తిరిగి వచ్చిన ట్రంప్‌తో సంబంధాలను సరిచేసుకోవడానికి మెటా చేస్తున్న ప్రయత్నాలు కూడా కావచ్చు.

కమ్యూనిటీ నోట్స్ మోడల్ అంటే ఏంటి? :
మెటా కమ్యూనిటీ నోట్స్ మోడల్ అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. వివిధ దృక్కోణాలను ప్రోత్సహించినందుకు కమ్యూనిటీ నోట్స్ కొందరు ప్రశంసించగా, తప్పుడు సమాచారాన్ని పరిష్కరించడంలో ఈ మోడల్ ప్రభావం గురించి మరికొందరు సందేహిస్తున్నారు. సెంట్రల్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రొగ్రామ్ లేకుండా తప్పుడు సమాచారం ఇంకా పెరగవచ్చని విమర్శకులు వాదించారు.

మెటా కొత్త చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్, జోయెల్ కప్లాన్ మాట్లాడుతూ.. 2025లో రాబోయే నెలల్లో కొత్త వ్యవస్థను దశలవారీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా తప్పుడు సమాచారం సులభంగా వైరల్ అయ్యే యుగంలో తప్పుడు సమాచారం వ్యాప్తికి సంబంధించిన ఆందోళనలను తగ్గించేందుకు ఈ విధానం సరిపోతుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

కమ్యూనిటీ నోట్స్ మోడల్ అనేది ఎలన్ మస్క్ తన (X) ప్లాట్‌ఫారమ్‌‌ను ప్రాచుర్యంలోకి తెచ్చిన మోడల్. మెటా చీఫ్ గ్లోబల్ ఆఫీసర్ జోయెల్ కాప్లాన్ మాట్లాడుతూ.. ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ మోడల్ విజయాన్ని సాధించడాన్ని తాను చూశానని చెప్పారు. ఈ మోడల్లో వారు తమ కమ్యూనిటీకి ఏది తప్పు ఏంటో నిర్ణయించే హక్కును ఇస్తారు. మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయం పట్ల ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు.

జుకర్‌బర్గ్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ ‘బహుశా.. అవును’ అంటూ సమాధానమిచ్చారు. ఇప్పటికే, చాలా చోట్ల లోపాలున్నాయని మార్క్ జుకర్‌బర్గ్ అంగీకరించారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. ఫేస్‌బుక్ యొక్క మోడరేషన్ సమస్యలలో ఫ్యాక్ట్ చెకింగ్‌లో చాలా తప్పులు ఉన్నాయని కనుగొన్నారు. ఫ్యాక్ట్ చెకింగ్ చేసేవారు రాజకీయంగా పక్షపాతంతో ఉన్నారని నివేదిక పేర్కొంది.

మెటా ఫ్యాక్ట్ చెకింగ్ చేసే సంస్థలకు దెబ్బ :
మెటా నిర్ణయంతో థర్డ్-పార్టీ ఫాక్ట్-చెకింగ్ ప్రోగ్రామ్‌లో కీలక భాగమైన అనేక ఫ్యాక్ట్ చెకర్ సంస్థలకు తీరని దెబ్బ లాంటిది. కంటెంట్‌ని ధృవీకరించడానికి మెటాతో సన్నిహితంగా పనిచేసిన లీడ్ స్టోరీస్ వంటి గ్రూపుల భవిష్యత్తు గురించి నిరాశ, అనిశ్చితిని వ్యక్తం చేశాయి. లీడ్ స్టోరీస్ ఎడిటర్-ఇన్-చీఫ్ అలాన్ డ్యూక్ మాట్లాడుతూ.. ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ను ముగించాలనే మెటా ప్రణాళికల గురించి తమకు ముందస్తు నోటీసు లేదని, తమను అనిశ్చిత స్థితిలో ఉంచారని వెల్లడించారు.

ఈ చర్య గ్లోబల్ ఫ్యాక్ట్-చెకింగ్ కమ్యూనిటీకి విస్తృతమైన పరిణామాలకు దారితీస్తుంది. వీరిలో చాలా మంది తమ పనిని కొనసాగించడానికి మెటా ఫండ్స్, ప్లాట్‌ఫారమ్ భాగస్వామ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్‌వర్క్ చేసిన సర్వేలో గ్లోబల్ ఫ్యాక్ట్-చెకర్స్‌లో 64 శాతం మంది మెటా ప్రోగ్రామ్‌లో భాగమని కనుగొన్నారు. ఆకస్మిక ప్రొగ్రామ్ ముగింపుతో ఈ గ్రూపుల దీర్ఘకాలిక స్థిరత్వం ప్రశ్నార్థకంగా మారనుంది.

ఫ్యాక్ట్ చెకింగ్ ప్రొగ్రామ్ ఎప్పుడు ప్రారంభమైంది? :
మెటాలో ఫాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ 2016 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ ప్రోగ్రామ్‌లు తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి, లేబుల్ చేయడానికి థర్డ్-పార్టీ ఫ్యాక్ట్ చెకర్స్‌పై ఆధారపడతాయి.

మెటాకు రాజకీయ, నియంత్రణ సవాళ్లు ముందున్నాయా? :
మెటా మోడరేషన్ విధానాలను సెన్సార్‌షిప్ రూపంగా చూసే రిపబ్లికన్‌లకు ఫ్యాక్ట్ చెకింగ్ అనేది దీర్ఘకాలిక సమస్య. ట్రంప్ రాజకీయ రంగంలోకి మళ్లీ రావడం రిపబ్లికన్లు సంప్రదాయవాద అభిప్రాయాలను అణిచివేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై విమర్శలను గుప్పించవచ్చు. అయితే, ట్రంప్ మోడరేషన్‌ను ఆమోదించే కంపెనీలను సవాలు చేసే ప్రణాళికలను సూచించాడు.

మెటా తాజా నిర్ణయం ప్రజల చర్చకు సమతుల్యతను తెస్తుందని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. కానీ, ఫ్యాక్ట్ చెకింగ్ తొలగించడం వల్ల వైరల్ తప్పుడు సమాచారం పెరగడానికి దారితీస్తుందని విమర్శకులు సూచిస్తున్నారు. లీడ్ స్టోరీస్ అలాన్ డ్యూక్ మాట్లాడుతూ.. వాస్తవాలను ధృవీకరించేందుకు వాక్ స్వాతంత్య్రానికి ఫ్యాక్ట్ చెకింగ్ అనేది చాలా ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు.

Read Also : Donald Trump : గ్రీన్‌ల్యాండ్‌ జోలికి రావొద్దు.. అమెరికా బలగాలను పంపొద్దు.. ట్రంప్‌కు ఫ్రాన్స్‌ హెచ్చరిక!