Donald Trump : గ్రీన్‌ల్యాండ్‌ జోలికి రావొద్దు.. అమెరికా బలగాలను పంపొద్దు.. ట్రంప్‌కు ఫ్రాన్స్‌ హెచ్చరిక!

Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌ గ్రీన్‌ల్యాండ్, పనామా కెనాల్‌ను స్వాధీనం చేసుకునేందుకు దాడులకు దిగితే ఊరుకునేది లేదని ఫ్రాన్స్ హెచ్చరించింది.

Donald Trump : గ్రీన్‌ల్యాండ్‌ జోలికి రావొద్దు.. అమెరికా బలగాలను పంపొద్దు.. ట్రంప్‌కు ఫ్రాన్స్‌ హెచ్చరిక!

France warned Donald Trump

Updated On : January 8, 2025 / 7:22 PM IST

Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకంటే ముందే పనామా కెనాల్, గ్రీన్‌ల్యాండ్ విలీనమే లక్ష్యంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఫ్రాన్స్ గట్టిగానే హెచ్చరించింది. మిలటరీ బలం లేదా ఆర్థికంగా గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నించవద్దని ఫ్రాన్స్ ట్రంప్‌కు హెచ్చరికలను పంపింది.

ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ “మాది బలమైన ఖండం. ప్రపంచంలోని ఇతర దేశాలు, సార్వభౌమ సరిహద్దులపై దాడి చేయనివ్వదు” అని స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్, పనామా కెనాల్‌ను స్వాధీనం చేసుకునేందుకు దాడులకు దిగితే సహించేది లేదని మంత్రి బారోట్ పేర్కొన్నారు. ఈ భూభాగాలను అమెరికా ఆక్రమించుకుంటుందంటే తాను నమ్మనని చెప్పారు.

Read Also : Pawan Kalyan : బలమైన భారత్ కోసం కృషి చేస్తున్నారు- ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం

గ్రీన్ ల్యాండ్ విస్తారమైన ఆర్కిటిక్ ద్వీపం 600 సంవత్సరాలకు పైగా ఈయూ దేశమైన డెన్మార్క్‌లో భాగంగా ఉంది. అయితే, పనామా, గ్రీన్ ల్యాండ్ రెండు ప్రాంతాలు అమెరికా భద్రతకు అత్యంత ముఖ్యమైనవని. ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ పునరుద్ఘటించారు.

అవసరమైతే సైనిక బలగాలను దింపుతాం : ట్రంప్ 
అంతేకాదు.. అమెరికాలోకి గ్రీన్ ల్యాండ్ కలిపేందుకు సైనిక బలగాలను ఉపయోగించాల్సి వస్తే.. దాని నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. అమెరికా జాతీయ భద్రత కోసం ఈ ప్రాంతాలపై తమ నియంత్రణ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇదొక్కటే కాదు.. డోనాల్డ్ ట్రంప్ కెనడా గురించి కూడా చాలాసార్లు ప్రస్తావించారు. అమెరికాలో 51వ ప్రావిన్స్‌గా కెనడా మారాలని ఆకాంక్షించారు. ఇదికాకుండా, మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా సంబోధించారు.

ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్‌కు చెందినది. స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం. ట్రంప్ ఇప్పుడు అమెరికాతో విలీనంపై మాట్లాడటం ఐరోపా సమాఖ్యలో కలకలం రేపింది. ఇది మాత్రమే కాదు.. ట్రంప్ కుమారుడు కూడా గ్రీన్‌లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశాలపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి.

గ్రీన్‌ల్యాండ్, పనామా కెనాల్‌ను నియంత్రించడానికి సైనిక బలగం కూడా రంగంలోకి దిగుతుందా అని మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ స్పందిస్తూ.. నేను అలాంటి వాగ్దానాలేవీ చేయను. అవసరమైతే సైనిక బలగాలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు.

France warned Donald Trump

Donald Trump France warn ( Image Source : Google )

పనామా కెనాల్ మాకు చాలా ముఖ్యమైనదన్నారు. అది సాధించడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని, సైనిక బలగాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటే అందులో వెనక్కి తగ్గబోమని ట్రంప్ స్పష్టం చేశారు.

ఐరోపా సరిహద్దులపై దాడికి దిగితే సహించేది లేదు :
ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ ట్రంప్‌కు హెచ్చరికలు పంపింది. ఐరోపా సమాఖ్య సరిహద్దులపై దాడులకు దిగితే ఎంతమాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. “ఐరోపా సమాఖ్య ప్రపంచంలోని ఇతర దేశాలను సార్వభౌమ సరిహద్దులపై దాడికి అనుమతించదనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎవరైనా సరే… మనది బలమైన ఖండం” అని బారోట్ నొక్కిచెప్పారు.

కెనడియన్ వస్తువులపై అమెరికా ఖర్చు చేయడం, కెనడాకు సైనిక మద్దతును ట్రంప్ విమర్శించారు. అలా చేయడం వల్ల అమెరికా ఎలాంటి ప్రయోజనాలను పొందలేదని, రెండు దేశాల మధ్య సరిహద్దును “కృత్రిమంగా గీసిన రేఖ”గా ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా జాతీయ భద్రతకు కీలకమైన గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలన్న తన ప్రతిపాదనను వ్యతిరేకిస్తే.. డెన్మార్క్‌పై సుంకాలు విధిస్తానని ఆయన సూచించారు. ట్రంప్ వ్యాఖ్యలకు కొద్దిసేపటి ముందు.. ఆయన కుమారుడు డాన్ జూనియర్ ప్రైవేట్ పర్యటనకు గ్రీన్‌ల్యాండ్ చేరుకున్నారు. స్వయం పాలక భాగమైన గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదని డెన్మార్క్ పేర్కొంది.

Read Also : King fisher Beers : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో కింగ్ ఫిషర్, హైన్‌కెన్‌ బీర్లు బంద్.. ఎందుకంటే?