10th Hindi Paper Leak : టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసు.. ముగ్గురు నిందితులు బెయిల్ పై విడుదల
పేపర్ లీకేజీలో తన పాత్ర లేదని నిందితుడు ప్రశాంత్ అన్నారు. కుట్ర చేసి తనపై కేసులు పెట్టారని తెలిపారు. రెండు గంటల్లో వందల ఫోన్ కాల్స్ మాట్లాడింది అవాస్తవం, అబద్దం అన్నారు.

10th Hindi Paper Leak
10th Hindi Paper Leak : తెలంగాణలో టెన్త్ హిందీ పేపర్ లీకేజీ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ తరలించారు. టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో ముగ్గురు నిందితులు విడుదల అయ్యారు. కరీంనగర్ జైలు నుంచి ప్రశాంత్, మహేశ్, గణేశ్ బెయిల్ పై విడుదలయ్యారు. మరోవైపు పేపర్ లీకేజీలో తన పాత్ర లేదని నిందితుడు ప్రశాంత్ అన్నారు. కుట్ర చేసి తనపై కేసులు పెట్టారని తెలిపారు. రెండు గంటల్లో వందల ఫోన్ కాల్స్ మాట్లాడింది అవాస్తవం, అబద్దం అన్నారు.
తాను అన్ని కాల్స్ మాట్లాడలేదని చెప్పారు. రెండు గంటల్లో ఎవరైనా వందల ఫోన్ కాల్స్ మాట్లాడాతారా అని అన్నారు. తాను షేర్ చేసిన తర్వాత వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ కు చెందిన తోటి జర్నలిస్టులు దానినికి సంబంధించిన సమాచారం తీసుకోవడానికి తనకు ఫోన్ చేశారని తెలిపారు. ఆ ఫోన్ కాల్స్ కూడా తాను పోలీసులకు అందుబాటులోకి వెళ్లినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకు వచ్చినవేనని తెలిపారు.
10th Paper Leak : టెన్త్ పేపర్ లీక్.. తెలిసిన విద్యార్థుల కోసమే
ఉదయం 10.46 గంటలకు తనకు వచ్చిన సమాచారాన్ని షేర్ చేశానని.. అనంతరం 11 గంటలకు అన్ని టీవీ ఛానెల్స్ లో ప్రసారం అయిన తర్వాత ఇలాంటి పరిస్థితి వరంగల్ లో ఉందని సమాచారం ఇచ్చానని తెలిపారు. తాను పోస్టు చేసిన గ్రూప్ లో జర్నలిస్టులు, పోలీసలు, ఇంటెలిజెన్స్ అధికారులు, ఎస్ బీతోపాటు అందరూ ఉన్నారని పేర్కొన్నారు. అందరికీ సమాచారం చేరాలని పోస్టు చేశానని వెల్లడించారు.
పేపర్ లీకేజ్ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చింది తానేనని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. నిందితుడి కాదన్నారు. తానొక జర్నలిస్టుగా తనకు వచ్చిన సమాచారాన్ని తోటి జర్నలిస్టులకు షేర్ మాత్రమే చేశానని చెప్పారు. తనపై ప్రభుత్వం, పోలీసులు కుట్ర చేసి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని వాపోయారు.