BRS Party : సిట్టింగ్ సీట్లలో గెలుపుగుర్రాలపై బీఆర్ఎస్ సర్వేలు.. అధికార పార్టీలో సిట్టింగ్‌లకు టెన్షన్..
సర్వే ఫలితాల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారని తెలియడంతో అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది.

brs party sitting mla seats
BRS Party Sitting MLA Seats: తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ తప్పదని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలనే దానిపై గులాబీ బాస్ పలు సర్వే చేయించినట్టు తెలుస్తోంది. ఎక్కడెక్కడ సిట్టింగ్ లను మార్చాలనే దాని గురించి, ప్రత్యామ్నాయ అభ్యర్థులు ఎవరు దానిపై ఆయన కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
సర్వే ఫలితాల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారని తెలియడంతో అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. తమకు మరోసారి టిక్కెట్లు వస్తాయా, రావా అనే టెన్షన్ తో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు వామపక్షాలతో పొత్తు కుదిరితే మరికొన్ని సీట్లు అధికార బీఆర్ఎస్ పార్టీ వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహుల.. బలాలు, బలహీనతలపై నియోజకవర్గాల వారీగా 10టీవీ ఎక్స్‌క్లూజివ్ గా అందిస్తున్న సమగ్ర వివరాలు ఇక్కడ చూడండి.
ఉమ్మడి హైదరాబాద్ జిల్లా
1. జూబ్లీహిల్స్
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
బలాబలాలు
వరుసగా రెండుసార్లు విజయం, ప్రజలతో మంచి సంబంధాలు
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించే నైజం
బలహీనతలు
ద్వితీయశ్రేణి నాయకులతో విభేదాలు
ఉద్యమకారులతో దూరంగా ఉన్నారనే విమర్శలు
రావుల శ్రీధర్ రెడ్డి (యాస్సిరెంట్)
బలాబలాలు
పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు, ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం మద్దతు
గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం
బలహీనతలు
పార్టీ నేతలను సమన్వయం చేయలేకపోవడం
కార్పొరేట్ తరహా రాజకీయాలనే విమర్శలు
2. ఖైరతాబాద్
సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్
క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలతో సంబంధాలు
బలమైన సామాజిక వర్గం, సుదీర్ఘ రాజకీయ అనుభవం
బలహీనతలు
తరచూ వెంటాడే వివాదాలు, ఉద్యమకారుల్లో వ్యతిరేకత
పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండరనే విమర్శలు
దాసోజు శ్రవణ్, మన్నె గోవర్దన్ రెడ్డి (యాస్పిరెంట్స్)
పార్టీ అగ్రనాయకత్వంతో సాన్నిహిత్యం
ఉద్యమంలో కీలక పాత్ర వహించారనే గుర్తింపు
బలహీనతలు
క్షేత్రస్థాయిలో పెద్దగా పట్టు లేకపోవడం
రాజకీయంగా ఎలాంటి పెద్ద పదవులు దక్కకపోవడం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
3- మహేశ్వరం
సిట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బలాబలాలు
ప్రజలతో సంబంధాలు, నియోజకవర్గ అభివృద్ధి
జిల్లావ్యాప్తంగా ప్రభావం చూపగల నాయకురాలు
బలహీనతలు
స్థానికేతర నినాదం, సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి
కుమారుడు కార్తీక్రెడ్డి మితిమీరిన జోక్యం
తీగల కృష్ణా రెడ్డి (యాస్సిరెంట్)
బలా బలాలు
సుదీర్ఘ రాజకీయ అనుభవం
సబితపై అసంతృప్తి, స్థానిక నేతల మద్దతు
బలహీనతలు
ప్రజలతో మమేకం కాలేరన్న విమర్శలు
హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటారన్న అపవాదు
4- ఎల్బీ నగర్
సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
బలాబలాలు
కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, అభివృద్ధి పనులు
నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు
బలహీనతలు
భూ వివాదాల్లో జోక్యంపై ఆరోపణలు
ఏకపక్ష నిర్ణయాలు, చురుగ్గా పనిచేస్తున్న వ్యతిరేక వర్గం
రామ్మోహన్ గౌడ్ (యాస్పిరెంట్)
బలాబలాలు
రెండుసార్లు ఓడిపోయారని ప్రజల్లో సానుభూతి
బీఆర్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు
బలహీనతలు
తరచూ వెంటాడే వివాదాలు
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రాజకీయాలు, క్యాడర్తో గ్యాప్
5- తాండూరు
సిట్టింగ్ ఎమ్మెల్యే- పైలెట్ రోహిత్ రెడ్డి
బలాబలాలు
యువనేతగా మంచి ఫాలోయింగ్
సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్తో సన్నిహిత సంబంధాలు
బలహీనతలు
రాజకీయ అనుభవం లేమి, కుటుంబ సభ్యుల జోక్యం
ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు
పట్నం మహేందర్ రెడ్డి (యాస్పిరెంట్)
బలాబలాలు
సుదీర్ఘ రాజకీయ అనుభవం
అన్నిగ్రామాల్లో అనుచర గణం
బలహీనతలు
పదవుల కోసం పాకులాడటం
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారన్న ప్రచారం
యువతకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం
6- పరిగి
సిట్టింగ్ ఎమ్మెల్యే- కొప్పుల మహేశ్ రెడ్డి
బలాబలాలు
తండ్రి హరీశ్వర్ రెడ్డి రాజకీయ వారసత్వం
సరైన ప్రత్యర్థి లేకపోవడం
బలహీనతలు
పెండింగ్ పనులు, ఎన్నికల హామీలు అమలు కాకపోవడం
కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు, సొంత తమ్ముడి తిరుగుబాటు
మనోహర్ రెడ్డి (యాస్పిరెంట్)
బలాబలాలు
హరీశ్వర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు
రాజకీయ అనుభవం, యువత మద్దతు
బలహీనతలు
మహేందర్ రెడ్డి అనుచరుడిగా ముద్ర
స్థానిక నేతల సంపూర్ణ మద్దతు లేకపోవడం
7- చేవెళ్ల
సిట్టింగ్ ఎమ్మెల్యే – కాలె యాదయ్య
బలాబలాలు
నిత్యం నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం
పార్టీ నేతలు, కార్యకర్తలతో పూర్తి సమన్వయం
బలహీనతలు
కుటుంబ సభ్యులకే ప్రాధాన్యమిస్తారనే విమర్శలు
మంత్రి సబిత, మాజీ మంత్రి మహేందర్రెడ్డి వర్గాలకు దూరం
కేఎస్ రత్నం (యాస్పిరెంట్)
బలాబలాలు
సుదీర్ఘ రాజకీయం అనుభవం, అన్ని పార్టీలవారితో సత్సంబంధాలు
మంత్రి సబిత, మాజీ మంత్రి మహేందర్రెడ్డి అండదండలు
బలహీనతలు
పదవిలో ఉన్నప్పుడు ఎవరికీ అందుబాటులో ఉండరనే విమర్శలు
టిక్కెట్ దక్కకపోతే పార్టీ మారతారనే అనుమానం
8- కుత్బుల్లాపూర్
సిట్టింగ్ ఎమ్మెల్యే- వివేకానంద
రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక, ఉద్యమ నేపథ్యం
బలమైన కుటుంబ, సామాజిక వర్గ అండదండలు
బలహీనతలు
పార్టీలో ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత
మంత్రి మల్లారెడ్డి, ఇతర కీలక నేతలతో విభేదాలు
శంబీపూర్ రాజు (యాస్పిరెంట్)
బలాబలాలు
పార్టీ అగ్ర నేతలతో సాన్నిహిత్యం, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం మద్దతు
ఉద్యమం నుంచి పార్టీలోనే చురుగ్గా పనిచేసిన గుర్తింపు
బలహీనతలు
భూ వివాదాల్లో జోక్యంపై విమర్శలు
ఎమ్మెల్సీగా ఉంటూ ఎమ్మెల్యే టిక్కెట్ కు ప్రయత్నం
9- ఉప్పల్
సిట్టింగ్ ఎమ్మెల్యే- బేతి సుభాశ్ రెడ్డి
బలాబలాలు
ఉద్యమ సమయం నుంచి పార్టీలో కీలక పాత్ర
వివాద రహితుడిగా పేరు
బలహీనతలు
కార్పొరేటర్లతో సమన్వయం లేకపోవడం, క్యాడర్ నుంచి వ్యతిరేకత
నియోజకవర్గాన్నిపెద్దగా అభివృద్ధి చేయలేకపోయారనే విమర్శలు
బొంతు రామ్మెహన్ (యాస్పిరెంట్)
బలాబలాలు
పార్టీ కీలక నేతలు అందరితోనూ సాన్నిహిత్యం
మేయర్ గా గతంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి
బలహీనతలు
గతంలో మేయర్గా అధికార దుర్వినియోగంపై విమర్శలు
పార్టీలో కార్యకర్తలను కలుపుకుని వెళ్లడంలో విఫలం
10- ఇబ్రహీంపట్నం
సిట్టింగ్ ఎమ్మెల్యే- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
బలాబలాలు
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
ప్రజలు, కార్యకర్తలతో నేరుగా సాన్నిహిత్యం
బలహీనతలు
ఎన్నికల హామీలు అమలు చేయలేకపోవడం
ఫార్మాసిటీ నిర్వాసిత రైతుల నుంచి వ్యతిరేకత
మంచిరెడ్డి ప్రశాంత్ (యాస్పిరెంట్)
బలాబలాలు
యువనేతగా నియోజకవర్గంలో ఫాలోయింగ్
నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల చేసిన పాదయాత్ర
బలహీనతలు
భూ వివాదాల్లో జోక్యంపై విమర్శలు
ఎమ్మెల్యే తనయుడిగా పెత్తనం చెలాయిస్తారనే ఆరోపణలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
11- నిజామాబాద్ అర్బన్
సిట్టింగ్ ఎమ్మెల్యే- బిగాల గణేష్ గుప్త
బలాబలాలు
వివాదరహితుడు, ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి
ప్రధాన పార్టీల నేతలతో సన్ని హిత సంబంధాలు
బలహీనతలు
సొంత సామాజిక వర్గానికే ప్రాధాన్యమిస్తున్నారనే అసంతృప్తి
ఉద్యమకారులను పట్టించుకోవటం లేదనే అపవాడు
ఆకుల లలిత (యాస్పిరెంట్)
బలాబలాలు
రాజకీయ అనుభవం, ప్రజల్లో మంచి గుర్తింపు
సొంత సామాజిక వర్గం బలం
బలహీనతలు
లలితా భర్తపై భూకబ్జా ఆరోపణలు
పదవుల కోసం పార్టీ మారతారనే విమర్శలు
12- బోధన్
సిట్టింగ్ ఎమ్మెల్యే- షకీల్ అమేర్
బలాలు
మైనారిటీ ఓటు బ్యాంక్, రెండు సార్లు ఎమ్మెల్యే
మన ఊరు మన ఎమ్మెల్యే పేరుతో ఇంటింటా ప్రచారం
బలహీనతలు
ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు
వివాదాలు, చక్కెర కర్మాగారాన్ని తెరిపించలేకపోవడం
తూము శరత్ రెడ్డి (యాస్పిరెంట్)
బలాబలాలు
అంగ, అర్థ బలాలు
ఎంఐఎం కౌన్సిలర్లు, మైనార్టీల మద్దతు
బలహీనతలు
గ్రామీణ ప్రాంతాల్లో అంతగా పట్టులేకపోవటం
ఎమ్మెల్యేతో తీవ్ర స్థాయిలో విభేదాలు
13- కామారెడ్డి
సిట్టింగ్ ఎమ్మెల్యే- గంప గోవర్దన్
బలాబలాలు
వరుస విజయాలతో గ్రామాల్లో పట్టు
జిల్లా కేంద్రం, మెడికల్ కళాశాల మంజూరు
బలహీనతలు
నోటి దురుసు, చేయి జోరుపై విమర్శలు
వివాదాస్పదమైన కామారెడ్డి మాస్టర్ ప్లాన్
నిట్టు వేణుగోపాల్ (యాస్పిరెంట్)
బలాబలాలు
కూతురు మున్సిపల్ చైర్మన్ గా ఉండటం
ఆర్థిక బలం, రాజకీయ అనుభవం, విస్తృత పరిచయాలు
బలహీనతలు
భూ వివాదాల్లో తలదూర్చటం
గ్రామీణ ప్రాంతాల్లో పట్టులేకపోవటం
ఉమ్మడి మెదక్ జిల్లా
14- పటానుచెరు
సిట్టింగ్ ఎమ్మెల్యే- గూడెం మహిపాల్ రెడ్డి
బలాబలాలు
ఆర్థిక బలం, మాస్ లీడర్ గా పేరు
రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం
బలహీనతలు
సోదరుడు, తనయుల భూకబ్జా వ్యవహారాలు
సీనియర్లను దూరం పెడుతున్నారనే ఆరోపణలు
నీలం మధు (యాస్పిరెంట్)
బలాబలాలు
ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం మద్దతు
యువతలో గుర్తింపు, కేటీఆర్, హరీశ్ రావు అండదండలు
బలహీనతలు
నియోజకవర్గంలో పెద్దగా పరిచయం లేకపోవటం
15- మెదక్
సిట్టింగ్ ఎమ్మెల్యే- పద్మాదేవేందర్ రెడ్డి
బలాబలాలు
రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం
మంత్రి హరీశ్ రావు అండదండలు
బలహీనతలు
క్యాడర్ తో సఖ్యత లేకపోవడం, జనంలో వ్యతిరేకత
భర్త దేవేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు
మైనంపల్లి రోహిత్ (యాస్పిరెంట్)
బలాబలాలు
తండ్రి హనుమంతరావుకు ఉన్న ప్రజా సంబంధాలు
యువత మద్దతు, సేవా కార్యక్రమాలు
బలహీనతలు
తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనుండటం
సొంత ఇమేజీ కన్నా తండ్రిపై ఆధారపడటం
16- ఆందోల్
సిట్టింగ్ ఎమ్మెల్యే- చంటి క్రాంతి కిరణ్
బలాబలాలు
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి
పటిష్ట క్యాడర్, స్థానిక నినాదం
బలహీనతలు
నియోజకవర్గ వ్యవహారాల్లో సోదరుడి జోక్యం
భూకబ్జా ఆరోపణలతో జనంలో వ్యతిరేకత
జడ్పీటీసీ కె.రమేష్ (యాస్పిరెంట్)
బలాబలాలు
సుధీర్ఘ కాలం ప్రజాప్రతినిధిగా పనిచేయటం
జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు
బలహీనతలు
ఆర్థిక స్థోమత లేకపోవడం
నియోజకవర్గంలో అంతంత మాత్రం పరిచయాలు
17- జహీరాబాద్
సిట్టింగ్ ఎమ్మెల్యే- మాణిక్రావు
బలాబలాలు
పార్టీ ఇమేజ్ తో నెట్టుకొస్తున్నారు
బలమైన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్
బలహీనతలు
పార్టీ కేడర్ ఏమాత్రం సఖ్యత లేదు
సీనియర్ నాయకులను కలుపుకుని వెళ్లలేకపోవడం
ఎర్రోళ్ళ శ్రీనివాస్ (యాస్పిరెంట్)
బలాబలాలు
మంత్రి హరీశ్ మద్దతు, ఉద్యమకారుడిగా గుర్తింపు
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన కృషి
బలహీనతలు
స్థానికేతరుడు, ఆర్థికంగా బలహీనం
నియోజకవర్గంలో తక్కువ పరిచయాలు
18- నర్సాపూర్
సిట్టింగ్ ఎమ్మెల్యే- మదన్ రెడ్డి
బలాబలాలు
సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు
సుదీర్ఘ రాజకీయ అనుభవం, అభివృద్ధి
బలహీనతలు
వయోభారం వల్ల తిరగలేకపోవడం
పార్టీ కేడర్ తో సంబంధాలు తగ్గిపోవడం
సునీత లక్ష్మారెడ్డి (యాస్పిరెంట్)
బలాబలాలు
నియోజకవర్గ ప్రజలతో మంచి పరిచయాలు
అందరితో కలసిపోయే స్వభావం
బలహీనతలు
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిరావడం
నాయకులు, కార్యకర్తలతో పెద్దగా సంబంధాలు లేకపోవడం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా
19- కోరుట్ల
సిట్టింగ్ ఎమ్మెల్యే- కల్వకుంట్ల విద్యాసాగర్రావు
బలాబలాలు
వరుస విజయాలు, నియోజకవర్గ అభివృద్ధి
వివాదాలకు దూరం, క్యాడర్ తో సమన్వయం
బలహీనతలు
షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకలేకపోవడం
వరుసగా గెలుస్తూ వస్తున్నా పెద్ద పదవులు దక్కకపోవడం
కల్వకుంట్ల సంజయ్ (యాస్పిరెంట్)
బలాబలాలు
తండ్రి విద్యాసాగర్ రావుగా వారసత్వం
సేవ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవ్వడం
బలహీనతలు
కార్పొరేట్ తరహాలో పాలిటిక్స్
వ్యక్తిగత ఇమేజ్ కూడగట్టుకునే ప్రయత్నాలు
20- రామగుండం
సిట్టింగ్ ఎమ్మెల్యే – కోరుకంటి చందర్
బలాబలాలు
పార్టీ బలం, అభివృద్ధి పనులు
మెడికల్ కళాశాల, IT పరిశ్రమలు
బలహీనతలు
ఉద్యోగాల పేరిట డబ్బులు దండుకున్నారనే అపవాదు
పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోకపోవడం
జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, పాతపెల్లి ఎల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి (యాస్పిరెంట్స్)
బలాబలాలు
ముగ్గురి సామాజిక వర్గాల బలం, భారీ అనుచర గణం
ఆర్థికంగా బలమైన నేపథ్యాలు, సెపరేట్ ఓటు బ్యాంకు
బలహీనతలు
మెజారిటీ క్యాడర్ పార్టీ లైన్లో ఉండటం
ముగ్గురు పోటీలో నిలిస్తే ఓట్లు చీలిపోయే అవకాశం
21- మానుకొండూరు
సిట్టింగ్ ఎమ్మెల్యే- రసమయి బాలకిషన్
బలాబలాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు
తొలిపొద్దు కార్యక్రమం పేరిట ప్రజల్లో తిరగడం
బలహీనతలు
స్థానిక నాయకుల మధ్య విభేదాలు
ప్రధానమైన రోడ్లు పూర్తి చేయకపోవడం
ఆరెపల్లి మోహన్ (యాస్పిరెంట్)
ఎమ్మెల్యేగా గతంలో చేసిన అభివృద్ధి
దళితుల్లో ఆరెపల్లిపై పూర్తి సానుకూలత
బలహీనతలు
యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండటం
టిక్కెట్ దక్కకపోతే మళ్లీ కాంగ్రెస్ కు వెళ్తారనే ప్రచారం
ఉమ్మడి నల్లగొండ జిల్లా
22- నకిరేకల్
సిట్టింగ్ ఎమ్మెల్యే- చిరుమర్తి లింగయ్య
బలాలు
అధిష్టానం ఆశీస్సులు, అభివృద్ధి పనులు
వివాదాలకు దూరం, బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి
బలహీనతలు
దూరంగా ఉన్న సొంత పార్టీ నాయకులు
పార్టీలో సమన్వయం చేసుకోలేకపోవడం
వేముల వీరేశం (యాస్పిరెంట్)
బలాలు
అంగ, అర్థ బలాలు, భారీ అనుచరవర్గం
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మద్దతు
బలహీనతలు
బెదిరింపులు, సెటిల్మెంట్ల ఆరోపణలు
మాజీ ఎంపీ పొంగులేటితో కాంగ్రెస్లోకి వెళ్లే ప్రయత్నం
23- నాగార్జునసాగర్
సిట్టింగ్ ఎమ్మెల్యే – నోముల భగత్
బలాబలాలు
వివాదరహితుడిగా గుర్తింపు, అభివృద్ధి పనులు
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం
బలహీనతలు
స్థానిక ప్రజాప్రతినిధులతో సఖ్యత లేకపోవడం
స్థానికేతరుడు నినాదంతో ఇబ్బందులు
ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి (యాస్పిరెంట్)
బలాలు
స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు
మంత్రి జగదీశ్ రెడ్డికి సన్నిహితుడనే గుర్తింపు
బలహీనతలు
నియోజకవర్గాన్ని ప్రభావితం చేయలేరనే అపనమ్మకం
కేవలం కొన్ని మండలాల్లోనే అనుచరవర్గం ఉండడం
24- కోదాడ
సిట్టింగ్ ఎమ్మెల్యే – బొల్లం మల్లయ్య యాదవ్
బలాబలాలు
అంగ, అర్థ బలాలు, పార్టీ అండదండలు
బలమైన ఓటుబ్యాంకు, బీసీ నేతగా గుర్తింపు
బలహీనతలు
ప్రతి పనికి పర్సెంటేజీలు తీసుకుంటారనే ఆరోపణలు
నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం
గుజ్జ యుగందర్ రావు (యాస్పిరెంట్)
బలాబలాలు
భార్య దీపిక జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉండటం
మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేల మద్దతు
బలహీనతలు
నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం చూపలేకపోవడం
ఎమ్మెల్యేతో ఉన్న గ్యాప్ కారణంగా నియోజకవర్గానికి దూరం
25- ఆలేరు
సిట్టింగ్ ఎమ్మెల్యే – గొంగిడి సునీత
బలాబలాలు
నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన అనుచరగణం
యాదాద్రి ఆలయ అభివృద్ధి
బలహీనతలు
గుట్ట పైకి ఆటోలను అనుమతించలేనని చేతులెత్తేయడం
భూకబ్జా, అవినీతి ఆరోపణలు
పైళ్ల శేఖర్ రెడ్డి (యాస్పిరెంట్)
బలాబలాలు
అంగ, అర్థ బలాలు, నియోజకవర్గంలో సత్సంబంధాలు
ఆలేరు పోటీ చేయాలని చేసుకున్న గ్రౌండ్ వర్క్
బలహీనతలు
గత తొమ్మిదేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండటం
భువనగిరి ఎమ్మెల్యేగా ఆ ప్రాంతానికే పరిమితం కావడం
26- భువనగిరి
సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
బలాలు
అంగ, అర్థ బలాలు,
నియోజకవర్గ వ్యాప్తంగా అనుచర వర్గం
బలహీనతలు
సొంత పార్టీలో అసంతృప్తి
జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డితో ఆధిపత్య పోరు
ఎలిమినేటి సందీప్ రెడ్డి (యాస్పిరెంట్)
బలాలు
జడ్పీ చైర్మన్ గా ఉండటం, బలమైన ఆర్థిక స్థోమత
తండ్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డిపై ప్రజల్లో అభిమానం
బలహీనతలు
క్యాడర్ మద్దతు పెద్దగా లేదనే అభిప్రాయం
కుటుంబ నేపథ్యమేగాని సొంత ఇమేజ్ లేకపోవడం
ఉమ్మడి వరంగల్ జిల్లా
27- మహబూబాబాద్
సిట్టింగ్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
బలాబలాలు
కార్యకర్తలు, ప్రజలతో సత్సంబంధాలు
మెడికల్ కాలేజీ, ఎన్నడూ లేని అభివృద్ధి పనులు
బలహీనతలు
వివాదాస్పద వ్యవహారశైలి, నోటి దురుసు
ప్రజాప్రతినిధులతో సమన్వయం లేకపోవడం
సత్యవతి రాథోడ్ (యాస్పిరెంట్)
బలాబలాలు
మంత్రిగా మంచి గుర్తింపు, స్థానిక నేతలతో సఖ్యత
మహబూబాబాద్ అభివృద్ధికి చొరవ
బలహీనతలు
కార్యకర్తలు, నేతలతో నేరుగా సంబంధాలు లేకపోవడం
శంకర్ నాయక్ అనుచరుల నుంచి తీవ్ర వ్యతిరేకత
28- స్టేషన్ ఘన్ పూర్
సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
బలాబలాలు
కార్యకర్తలు, ప్రజలతో మమేకం, అందరితో సత్సంబంధాలు
సొంత సామాజిక వర్గం మద్దతు, అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్టులు
బలహీనతలు
సోషల్ మీడియాలో రాజయ్యపై దుష్ప్రచారం
పార్టీ నేతలు, అనుచరుల చేతివాటంపై ఆరోపణలు
కడియం శ్రీహరి (యాస్పిరెంట్)
బలాబలాలు
మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సుపరిచితులు
అవినీతికి దూరమనే అభిప్రాయం, గ్రామస్థాయిలో పూర్తి పట్టు
బలహీనతలు
ఒంటెత్తు పోకడలు, నియంత్రత్వ ధోరణిపై విమర్శలు
సొంత సామాజిక వర్గం ఓట్లు అత్యల్పంగా ఉండటం
29- డోర్నకల్
సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
బలాబలాలు
కిందిస్థాయి నేతల నుంచి సంబంధాలు, రాజకీయంగా పట్టు
సొంత సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరు
బలహీనత
వరుస వివాదాలు, ప్రజల నుంచి వ్యతిరేకత
మంత్రి సత్యవతి రాథోడ్ వర్గం నుంచి వ్యతిరేకత
మాలోత్ కవిత (యాస్పిరెంట్)
బలాబలాలు
తండ్రితో సమానంగా కార్యకర్తలు, ప్రజలతో సంబంధాలు
ఆకట్టుకునే చరిష్మా, మంత్రి సత్యవతి వర్గం నుంచీ సానుకూలత
బలహీనతలు
సోదరుడు రవిచంద్ర నుంచి వ్యతిరేకత
కవితపై తండ్రి రెడ్యానాయక్ కూడా సుముఖంగా లేకపోవడం
30- జనగామ
సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
బలాబలాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు
కాంగ్రెస్ పార్టీకి దీటుగా బీఆర్ఎస్ ను బలోపేతం చేయడం
బలహీనతలు
పార్టీలో ఏకచత్రాధిపత్యం చేస్తారనే విమర్శలు
కూతురు తుల్జా భవాని రెడ్డి చేస్తున్న భూకబ్జా ఆరోపణలు
పోచంపల్లి శ్రీనివాసరెడ్డి (యాస్పిరెంట్)
బలాబలాలు
వివాదరహితుడిగా సౌమ్యుడిగా పేరు
బీఆర్ఎస్ కేడర్ తో వ్యక్తిగత సంబంధాలు, ప్రత్యేక వర్గం
బలహీనతలు
ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవడం
స్థానికేతరుడు అన్న విమర్శ, వర్గ రాజకీయాలపై ఆరోపణలు
31- వరంగల్ తూర్పు
సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్
బలాబలాలు
నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన మార్క్
కార్పొరేటర్లుగా ప్రధాన అనుచరులను గెలిపించుకోవడం
బలహీనతలు
ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, ఒంటెద్దు పోకడలు
ఎమ్మెల్సీ, మేయర్ తో తీవ్రమైన విభేదాలు
బసవరాజు సారయ్య (యాస్పిరెంట్)
బలాబలాలు
క్షేత్రస్థాయిలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు
సుదీర్ఘకాలం మంత్రిగా నియోజకవర్గానికి చేసిన సేవలు
బలహీనతలు
2014 ఓటమి తర్వాత ప్రజల్లో నేరుగా తిరగకపోవడం
ఆర్థికంగా బలహీనత
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
32- అచ్చంపేట
సిట్టింగ్ ఎమ్మెల్యే- గువ్వల బాలరాజు
బలాబలాలు
రెండుసార్లు గెలిచి నియోజకవర్గంపై పట్టు సాధించడం
ఆర్థిక బలం, ఎస్సీ ఓట్లతో ఎలాగైనా గెలుస్తామనే ధీమా
బలహీనతలు
నోటి దురుసు, అగ్రకులాల నుంచి వ్యతిరేకత
భారీగా అవినీతి ఆరోపణలు
ఎంపీ రాములు (యాస్పిరెంట్)
బలాబలాలు
సీనియర్ నేత, మంత్రిగా పనిచేయడం, సత్సంబంధాలు
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే గుర్తింపు
బలహీనతలు
ఆర్థిక స్థోమత లేకపోవడం
పాత క్యాడర్ అంతా ఎమ్మెల్యే వెనుక ఉండటం
33- షాద్ నగర్
సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
బలాబలాలు
రెండు సార్లు గెలుపు, నియోజకవర్గంపై పట్టు
ఆర్థిక సామర్థ్యం, సొంత సామాజికవర్గం మద్దతు
బలహీనతలు
వయస్సు, కుమారుల వ్యవహార శైలి, అవినీతి ఆరోపణలు
మార్పు కోరుకుంటున్న షాద్నగర్ ప్రజలు
ప్రతాప్ రెడ్డి (యాస్పిరెంట్)
బలాబలాలు
పటిష్ట ఆర్థిక నేపథ్యం, రాజకీయ అనుభవం
బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ వస్తుందని నమ్మకం
బలహీనతలు
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారనే ప్రచారం
34- అలంపూర్
సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం
బలాలు
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపు, ఆర్థిక బలం
సొంత సామాజిక వర్గ ఓట్లు, అభివృద్ధిపై చేశారనే ప్రచారం
బలహీనతలు
కుమారుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తాడనే విమర్శలు
ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యం, అవినీతి ఆరోపణలు
మాజీ ఎంపీ మందా జగన్నాథం (యాస్పిరెంట్)
బలాబలాలు
నియోజకవర్గంలో వ్యక్తిగత క్యాడర్, అధిష్టానం ఆశీస్సులు
కుటుంబంలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఓకే అంటుండటం
బలహీనతలు
ఎంపీగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు
నియోజకవర్గంపై పట్టు తగ్గిపోయిందనే విమర్శలు
35- కల్వకుర్తి
సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
బలాబలాలు
వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపు, అధిష్టానం ఆశీస్సులు
నియోజకవర్గంపై పట్టు, ప్రజలకు అందుబాటులో ఉండటం
బలహీనతలు
భారీగా ఉన్న ఆశావహులు, ఎన్నికల్లో ఖర్చుకు వెనుకాడటం
కాంగ్రెస్, బీజేపీ బలంగా ఉండటం
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి (యాస్పిరెంట్)
బలాబలాలు
ఆర్థిక బలం, రాజకీయ అనుభవం
టిక్కెట్పై గతంలో అధిష్టానం నుంచి హామీ
బలహీనతలు
స్థానికంగా అందుబాటులో ఉండరనే ప్రచారం
సొంత సామాజికవర్గం ఓట్లు తక్కువగా ఉండటం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
36- బోథ్
సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు
బలాబలాలు
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు
సీనియర్ పొలిటీషియన్ గా జిల్లాలో గుర్తింపు
బలహీనతలు
ప్రభుత్వ పథకాల్లో పర్సెంటేజీ తీసుకుంటారనే ఆరోపణలు
శంకుస్థాపనలేకాని పనులు పూర్తిచేయరనే విమర్శలు
గెడం నగేశ్ (యాస్పిరెంట్)
బలాలు
ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అనుభవం
వివాదరహితుడుగా గుర్తింపు, ఎమ్మెల్యేపై వ్యతిరేకత
బలహీనతలు
పదవుల్లో ఉన్నప్పుడు చేసిందేమీ లేదన్న విమర్శలు
ప్రజలకు అందుబాటులో ఉండరనే చెడ్డపేరు
37- ఖానాపూర్
సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్
బలాబలాలు
రెండుసార్లు ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న పరిచయాలు
ఆర్థిక బలం, విషయ పరిజ్ఞానం ఉన్న మహిళా నేతగా గుర్తింపు
బలహీనతలు
అవినీతి ఆరోపణలు, ప్రతి పనికీ పర్సేంటేజి అన్న విమర్శ
భర్త శ్యామ్నాయక్ షాడో ఎమ్మెల్యేగా అధికారం చలాయించడం
జాన్సన్ నాయక్ (యాస్పిరెంట్)
బలాలు
వివాదరహితుడిగా పేరు, మంత్రి కేటీఆర్తో సాన్నిహిత్యం
సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకుల నుంచి సంపూర్ణ మద్దతు
బలహీనతలు
స్థానికేతురుడనే నినాదంతో ఇబ్బందికర పరిస్థితి
క్యాడర్ తో పూర్తిస్థాయి సంబంధాలు లేకపోవడం
38- మంచిర్యాల
సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు
బలాబలాలు
సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా ఉండటం
సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు
బలహీనతలు
కొడుకుల భూదందాలు, అనుచరుల దౌర్జన్యాలపై ఆరోపణలు
జిల్లా కేంద్రంగా మారినా, పెద్దగా అభివృద్ధి చేయలేకపోవడం
పుస్కూర్ రామ్మోహనరావు (యాస్పిరెంట్)
బలాబలాలు
కేసీఆర్తో సాన్నిహిత్యం, ఆర్థిక నేపథ్యం
ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఉద్యమకారుడిగా గుర్తింపు
బలహీనతలు
నియోజకవర్గంతో పెద్దగా సంబంధాలు లేకపోవడం
బిఆర్ఎస్ నేతలు, క్యాడర్ సపోర్ట్ లేకపోవడం
వామపక్షాలకు కేటాయించే అవకాశమున్న స్థానాలు
1- కొత్తగూడెం
సిట్టింగ్ ఎమ్మెల్యే- వనమా వెంకటేశ్వర్ రావు/జలగం వెంకట్రావు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (యాస్పిరెంట్)
2- మునుగోడు
సిట్టింగ్ ఎమ్మెల్యే- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి (యాస్పిరెంట్)
3- హుస్నాబాద్
సిట్టింగ్ ఎమ్మెల్యే- సతీష్ బాబు
సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి (యాస్పిరెంట్)
4- మిర్యాల గూడ
సిట్టంగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు
ఫిట్టింగ్ జూలకంటి రంగారెడ్డి (సీపీఎం మాజీ ఎమ్మెల్యే)