10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్-2025… రేపే అవార్డుల ప్రదానోత్సవం
సుమారు 50కి పైగా విభాగాల్లో 10 టీవీ అవార్డులు అందించింది.

10TV Food Fusion Awards 2025 Program
పసందైన వంటలతో అదరగొట్టే రెస్టారెంట్స్.. నోరూరించే ఫుడ్‌తో ఆహా అనిపించే వెరైటీస్. వారెవ్వా అనిపించే చెఫ్స్ మ్యాజిక్.. ఫుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని టేస్ట్.. ఎదురులేని క్వాలిటీ.. అబ్బురపరిచే ఇన్నోవేషన్‌తో దూసుకుపోతున్న హోటల్స్, రెస్టారెంట్స్, క్యాటరింగ్ సెంటర్స్, కేఫటేరియాస్, బేకరీస్‌కు సగర్వంగా పట్టం కట్టిన కార్యక్రమం 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025.
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా.. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమక్షంలో.. సెలబ్రిటీలు, ప్రముఖులు, అతిరథమహారథుల సందడి మధ్య.. టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ విశేష ప్రతిభకు.. ప్రతిష్ఠాత్మకంగా 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవం జరగనుంది. ఈ శనివారం, ఆదివారం మీ 10టీవీలో ఈ అవార్డ్స్ ప్రదానోత్సవాన్ని చూడొచ్చు.
ఏ హోటల్లో బిర్యానీ బెస్ట్ గా ఉంది.. ఏ రెస్టారెంట్ లో మంచి యాంబియన్స్ ఉంది.. ఏ రెస్టారెంట్ వెజ్ వంటకాల్లో దుమ్మురేపుతోంది.. బెస్ట్ వెడ్డింగ్ కేటరర్స్ ఎవరు? బెస్ట్ అథంటిక్ తెలుగు రెస్టారెంట్ ఏది? ఇలా సుమారు 50కి పైగా విభాగాల్లో 10 టీవీ అవార్డులు అందించింది. ఆయా విభాగాలకు సంబంధించి టాప్‌లో నిలిచిన వాటికి అవార్డులను అందజేసింది 10టీవీ.
మంచి ఫుడ్ అందించే అవుట్‌లెట్స్ కృషికి సమున్నత గౌరవం ఇది. వివిధ కేటగిరిల్లో టాప్ ప్లేస్ ఎవరిది? వారెవ్వా అనిపించే వెరైటీ ఫుడ్ అందించే రెస్టార్టెంట్స్ ఏవో చూడొచ్చు. ఏయే టాప్ మోస్ట్ రెస్టారెంట్స్‌కు 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ అందుతాయో రేపు సాయంత్రం తెలుసుకోవచ్చు.