రేవంత్ సర్కార్‌కు టార్గెట్ కావడానికి కారణం అదే? వీకెండ్ విత్ పల్లా రాజేశ్వర్ రెడ్డి..

పల్లా భూకబ్జాలకు పాల్పడ్డారా? ప్రతిపక్షంలో పార్టీని నడిపే నెంబర్ 2 నాయకుడు ఎవరు?

రేవంత్ సర్కార్‌కు టార్గెట్ కావడానికి కారణం అదే? వీకెండ్ విత్ పల్లా రాజేశ్వర్ రెడ్డి..

Weekend With Mla Palla Rajeshwar Reddy : బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు ఆయనే తలలో నాలుక. కళ్లు, చెవులు కూడా. ఏ టాస్క్ అప్పగించినా తూ.చ. తప్పకుండా విజయవంతం చేసే నేత ఆయన. కేసీఆర్ కుటుంబం తర్వాత బీఆర్ఎస్ లో ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది. అదే ఆయనకు పార్టీలో కూడా కొంతమంది శత్రువులను తయారు చేసిందంటారు.

ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయాక రేవంత్ సర్కార్ కు ఆయన టార్గెట్ గా మారారు. కేసీఆర్ కు తక్కువ కాలంలోనే నమ్మిన బంటుగా మారిపోయిన ఆ నేతే పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్సీగా, రైతుబంధు ఛైర్మన్ గా దాదాపు పదేళ్ల పాటు చక్రం తిప్పిన ఆయన.. ఇప్పుడు జనగామ ఎమ్మెల్యేగా అధికార పక్షంతో ఫైట్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు పల్లా స్థలం వైపు హైడ్రా బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆయన వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు.

రేవంత్ సర్కార్ కు ఎందుకు టార్గెట్ అయ్యారు? పల్లా భూకబ్జాలకు పాల్పడ్డారా? పల్లా కాలేజీ దిశగా హైడ్రా బల్డోజర్లు వచ్చే ఛాన్స్ ఉందా? కవిత అరెస్ట్, విడుదలపై కేసీఆర్ ఏమన్నారు? ప్రతిపక్ష నేతగా ఉండటం కేసీఆర్ కు ఇష్టం లేదా? ప్రతిపక్షంలో పార్టీని నడిపే నెంబర్ 2 నాయకుడు ఎవరు? కేసీఆర్ రైతు యాత్ర ఎప్పుడు మొదలవుతుంది? జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో 10టీవీ వీకెండ్ స్పెషల్ ఇంటర్వ్యూ..

 

Also Read : హైడ్రాపై కాంగ్రెస్‌లోనూ గుస్సా! ఏం జరుగుతోంది?