Omicron Cases: తెలంగాణలో ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో బుధవారం(22 డిసెంబర్ 2021) అత్యధికంగా 14 కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

Omicron
Omicron Cases: తెలంగాణలో బుధవారం(22 డిసెంబర్ 2021) అత్యధికంగా 14 కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన మొత్తం 12మందికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు వైద్యులు. లేటెస్ట్ ఒమిక్రాన్ లెక్కలతో తెలంగాణలో మొత్తం 38కి చేరాయి ఒమిక్రాన్ కేసులు. ఇతర దేశాల నుంచి వచ్చిన 12మందిలో ఒమిక్రాన్ గుర్తించారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించారు అధికారులు.
ఇప్పటివరకు నిర్ధరణ అయిన 38 ఒమిక్రాన్ కేసులలో ఆరుగురు మాత్రమే హై రిస్క్ దేశాల నుంచి రాగా, మిగిలినవారు ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరంతా కెన్యా, సోమాలియా, బ్రిటన్, ఘనా, టాంజానియా, దోహా, అబుదాబి లాంటి దేశాల నుంచి వైద్య చికిత్సల నిమిత్తం హైదరాబాదు వచ్చినవారే.
దేశంలో ఢిల్లీ, మహారాష్ట్రల్లో వెలుగులోకి వచ్చిన కేసులు తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 54 కేసులు, ఢిల్లీలో 57 కేసులు ఒమిక్రాన్‌ను గుర్తించారు. తెలంగాణ తర్వాత స్థానంలో కర్ణాటకలో అత్యధికంగా 19 కేసులు ఉన్నాయి.