Telangana Covid : తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 19వేల 947 కరోనా పరీక్షలు నిర్వహించగా..

Telangana Corona : తెలంగాణలో (Telangana Covid Cases) కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 19వేల 947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 44 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో మరో 425 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,88,931 పాజిటివ్ కేసులు(Telangana covid cases) నమోదు కాగా… 7,81,852 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 2వేల 968 కరోనా యాక్టివ్ కేసులు(Corona) ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కోవిడ్ మరణాలేవీ నమోదు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 4,111గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.

India Covid Cases : భారత్‌లో భారీగా తగ్గిన కరోనా.. 10వేలకు దిగువన కొత్త కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముందురోజు 10 వేలకు తగ్గిన కొత్త కేసులు.. తాజాగా 8 వేలకు పడిపోయాయి. కొత్త కేసులే కాదు కోవిడ్ మరణాలు కూడా 120 దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది.

ఆదివారం 7 లక్షల మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 8,013 మందికి కరోనా వైరస్ సోకింది. కొత్త కేసులు దాదాపు రెండు నెలల కనిష్ఠానికి క్షీణించాయి. దాంతో పాజిటివ్‌ రేటు 1.11 శాతానికి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో మరో 119 మంది కొవిడ్ తో చనిపోయారు. ముందురోజు ఆ సంఖ్య 243గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,13,843కి పెరిగిది.

ఇక కోవిడ్ బాధితుల సంఖ్య లక్షకు దిగొచ్చింది. యాక్టివ్ కేసుల రేటు 0.24 శాతానికి తగ్గిపోయింది. నిన్న 16,765 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.23 కోట్లు (98.56 శాతం)గా ఉన్నాయి. నిన్న కేవలం 4,90,321 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. మొత్తంగా 177 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా గణాంకాలు విడుదల చేసింది.

దేశంలో కరోనా థర్డ్ వేవ్(Corona Third Wave) ప్రభావం క్రమంగా తగ్గుతోంది. కేసులు దిగివస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారి(Corona) పీడ వదిలినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్ వేవ్‌(Corona Fourth Wave) మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.

India Covid-19 Update : దేశంలో కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదు

ఇందుకు సంబంధించిన అధ్యయనం ప్రీప్రింట్ సర్వర్ MedRxivలో ఇటీవలే ప్రచురితమైంది. ఫోర్త్‌ వేవ్‌ దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుందని, ఆగస్టు 15 నుండి 31 వరకు కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని వివరించింది. గత మూడు వేవ్‌ల సమయంలో కొవిడ్‌ కేసులు, పీక్‌ టైమ్‌, మరణాల సంఖ్యలో ఐఐటీ కాన్పుర్‌ పరిశోధకుల బృందం వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా అధ్యయనం కూడా నిజమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే అలసత్వం వహించొద్దని, ప్రజలంతా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు