India Covid Cases : భారత్‌లో భారీగా తగ్గిన కరోనా.. 10వేలకు దిగువన కొత్త కేసులు

భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. రోజురోజుకీ కరోనా తీవ్రత తగ్గిపోతోంది. రోజువారీ కరోనా కొత్త కేసులు కూడా భారీగా తగ్గిపోతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి.

India Covid Cases : భారత్‌లో భారీగా తగ్గిన కరోనా.. 10వేలకు దిగువన కొత్త కేసులు

India Covid Cases India's Single Day Rise Of Covid Infections Fall Below 10,000 After Two Months

India Covid Cases : భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. రోజురోజుకీ కరోనా తీవ్రత తగ్గిపోతోంది. రోజువారీ కరోనా కొత్త కేసులు కూడా భారీగా తగ్గిపోతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా కొత్త కేసులు పదివేల దిగువకు పడిపోయాయ. సోమవారం (ఫిబ్రవరి 28)న దేశంలో కొత్తగా 8,013 కొత్త కేసులు నమోదు కాగా.. 119 కరోనా మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కరోనా మరణాల్లో కేరళ నుంచి 62 మంది, కర్ణాటక నుంచి 17 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,02,601 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 0.24 శాతంగా యాక్టివ్ కేసుల సంఖ్య నమోదైంది.

ఇక కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 1.11 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకూ 4,29,24,130 కరోనా కేసులు నమోదు కాగా.. 5,13,843 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కరోనాతో మరణించినవారిలో మహారాష్ట్రలో (1,43,697) కేరళ (65,223), కర్ణాటక (39,936), తమిళనాడు (38,003), ఢిల్లీ (26,122), ఉత్తరప్రదేశ్ (23,543), పశ్చిమ బెంగాల్ నుంచి (21,175) మంది ఉన్నారు.

India Covid Cases India's Single Day Rise Of Covid Infections Fall Below 10,000 After Two Months (1)

India Covid Cases India’s Single Day Rise Of Covid Infections Fall Below 10,000 After Two Months

వీరిలో 70శాతం మంది comorbidities వంటి సమస్యతో బాధపడేవారే ఎక్కువమంది ఉన్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రికవరీ రేటు కూడా 98.56 శాతంగా నమోదైంది. ఆదివారం (ఫిబ్రవరి 28న) కరోనా నుంచి 16,765 మంది కోలుకున్నారు.  ఇప్పటి వరకు కరోనా నుంచి 4,23,07,686 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అధికారిక డేటా ప్రకారం.. వరుసగా 22 రోజుల్లో ఒక లక్ష మంది కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 8,871 నమోదయ్యాయి.

మరోవైపు.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు కలిపి మొత్తంగా ఇప్పటివరకూ 177.44 కోట్లకు అధిగమించింది. కొవిడ్ బూస్టర్ డోస్ మూడో దశ ట్రయల్స్ కోసం సీరమ్ సంస్థ Covovax కోసం భారత డ్రగ్ రెగ్యులేటర్ నుంచి అనుమతి కోరింది. ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) CovoVaxకు ఆమోదించింది. ఈ కోవాగ్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లోనే పెద్ద వయస్సువారిలో వినియోగించాలంటూ డిసెంబర్ 28న డీసీజీఐ ఆమోదించింది.

Read Also : Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 460 కరోనా కేసులు.. తగ్గిన పాజివిటీ రేటు!