My Home Industries : మైహోమ్‌ ఇండస్ట్రీస్‌‍కు గ్రీన్‌ సిమెంటెక్‌-2023 అవార్డ్

Green Cementech 2023 : నిర్మాణ రంగంలో అందరి సహకారంతో మై హోమ్ గ్రూప్ సక్సెస్ సాధ్యమైంది. 2025 నుంచి జీరో కార్బన్ నిర్మాణం మా టార్గెట్

My Home Industries : మైహోమ్‌ ఇండస్ట్రీస్‌‍కు గ్రీన్‌ సిమెంటెక్‌-2023 అవార్డ్

My Home Industries

Updated On : May 18, 2023 / 7:19 PM IST

Gree Cementech 2023 : గ్రీన్ సిమెంటెక్-2023 వార్షిక సదస్సుకు హైదరాబాద్ HICC వేదికైంది. రెండు రోజుల పాటు జరిగే 19వ ఎడిషన్ గ్రీన్ సిమెంటెక్ 2023 కాన్ఫరెన్స్ ను.. CII తో పాటు సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సులో.. సిమెంట్ తయారీ రంగంలో విశేష కృషి చేసిన మై హోమ్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుని ఈ ఏడాది సత్కారానికి ఎంపిక చేశారు.

రామేశ్వరరావు బదులు సత్కారాన్ని మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు స్వీకరించారు. Cii-soharbji Godrej Green Business Centre అవార్డును జూపల్లి రాము రావు అందుకున్నారు. మై హోమ్ సిమెంట్ తో నిర్మాణ రంగంలో విదేశీ విప్లవాత్మక మార్పులు తెచ్చారని CII ప్రతినిధులు కొనియాడారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ప్రశంసించారు.

Also Read..Zomato UPI Service : జొమాటో యూపీఐ సర్వీసు వచ్చేసింది.. ఇకపై ఫుడ్ ఆర్డర్ ఈజీగా చేసుకోవచ్చు..!

CII కాన్ఫరెన్స్ లో మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు వర్చువల్ గా మాట్లాడారు. ”నిర్మాణ రంగంలో అందరి సహకారంతో మై హోమ్ గ్రూప్ సక్సెస్ సాధ్యమైంది. సిమెంట్ తయారీలో ఇండస్ట్రీలో మార్పులను అందిపుచ్చుకున్నాం. ఈ అవార్డు ఇచ్చిన CII కు కృతజ్ఞతలు. నిర్మాణ రంగంలో పర్యావరణహిత సదుపాయాలు ముఖ్యం. అందులో భాగంగా గ్రీన్ సిమెంటెక్ విధానాలతో ముందుకు వెళ్తున్నాం. 2025 నుంచి జీరో కార్బన్ నిర్మాణం మా టార్గెట్”.

జూల్లి రాము రావు..

” నాన్నగారు బిజినెస్ పై ఎంతో మక్కువతో ముందుకు వెళ్లారు. ఒడిదొడుకులు వచ్చినా వెనుదిరగలేదు. పట్టుదలతో పని చేసి విజయం సాధించారు. వ్యాపారాన్ని నమ్ముకుని ముందుకెళ్లారు”.