మేడారం మహాజాతర తేదీలు ఖరారు.. ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన మేడారం పూజారులు 

ఈ మహాజాతర నాలుగు రోజుల పాటు జరుగుతుంది.

మేడారం మహాజాతర తేదీలు ఖరారు.. ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన మేడారం పూజారులు 

Medaram Jatara

Updated On : July 2, 2025 / 9:58 AM IST

మేడారం మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. ములుగు జిల్లా మేడారంలో పూజారుల సంఘం సభ్యులు సమావేశమై జాతర తేదీలు ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మహాజాతర జరగనుంది. 28వ తేదీన సాయంత్రం సారలమ్మ అమ్మవారు, గోవింద రాజు, పగిడిద్దరాజు గద్దెలకు చేరుకుంటారు.

ఇక, 29వ తేదీన సాయంత్రం సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటారు. 30వ తేదీన సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు మొక్కుల సమర్పణ ఉంటుంది. 31వ తేదీన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేస్తారు. జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మేడారం పూజారులు ప్రభుత్వాన్ని కోరారు.

Also Read: భారత్‌పై 500 శాతం టారిఫ్.. మరో సంచలన బిల్లును ప్రవేశపెట్టే దిశగా ట్రంప్

మేడారం మహాజాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. రెండేళ్లకు ఒకసారి ఈ జాతర జరుపుకుంటారు. లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. మేడారం జాతర గిరిజనుల ఆచార సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తుంది.

ఆదివాసీల సాహస, ధైర్యాలను గుర్తుచేస్తుంది. ప్రభుత్వం భారీ భద్రత, వసతులు, తాగునీరు, రవాణా, వైద్య సదుపాయాల ఏర్పాట్లు చేస్తుంది. ఈ జాతర గిరిజనుల సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ప్రకృతి ప్రేమను, సామాజిక సమగ్రతను ప్రతిపాదిస్తుంది.