తెలంగాణలో 2,891కి చేరిన కరోనా కేసులు, 92 మంది మృతి

  • Published By: bheemraj ,Published On : June 2, 2020 / 08:03 PM IST
తెలంగాణలో 2,891కి చేరిన కరోనా కేసులు, 92 మంది మృతి

Updated On : June 2, 2020 / 8:03 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు. జీహెచ్ ఎంసీ పరిధిలో అత్యధికంగా 70 కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ 3, నల్గొండ జిల్లాలో 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్ నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయింది. 

12 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 2,891కి చేరాయి. కరోనాతో 92 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 1,273 యాక్టివ్ కేసులు ఉండగా, 1,526 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా కేసుల్లో 2,264 మంది రాష్ట్ర వాసులు కాగా, మిగతా 434 మంది విదేశాల నుంచి వచ్చిన వారు, వలస కూలీలు. ఇప్పటివరకు 1213 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

లాక్ డౌన్ లో సడలింపుల తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. సోమవారం (జూన్ 1, 2020) కొత్తగా 94 కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 79 కేసులు ఉన్నాయి.