Home Guards Salary : హోంగార్డులకు ప్రభుత్వం శుభవార్త.. వేతనం పెంపు
తెలంగాణ ప్రభుత్వం హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల గౌరవ వేతనం పెంచింది. గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేతనాలు జూన్ 2021 నుంచి

Home Guards Salary
Home Guards Salary : తెలంగాణ ప్రభుత్వం హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల గౌరవ వేతనం పెంచింది. గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేతనాలు జూన్ 2021 నుంచి అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
Vitamin Pills : విటమిన్ మాత్రలు ఎవరికి అవసరమో తెలుసా?
పోలీసు శాఖలో కిందిస్థాయి ఉద్యోగులుగా హోంగార్డులు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం హోంగార్డులకు నెలకు రూ.22వేల వరకు గౌరవ వేతనం అందుతోంది. గౌరవ వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హోంగార్డులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 30 శాతం జీతాల పెంపు.. దాదాపు అన్ని కేటగిరీల వారికి అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.