corona cases : తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో 394 కేసులు, ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు.

corona cases : తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో 394 కేసులు, ముగ్గురు మృతి

394 Corona Cases Registered In A Single Day Across Telangana 1

Updated On : March 21, 2021 / 11:51 AM IST

corona cases in Telangana : తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1669కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2, 804గా ఉంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం(మార్చి 21, 2021) బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో పల్లె , పట్నం తేడా లేకుండా కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో మరోసారి కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 43 వేల 846 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కాగా గడిచిన 24 గంటల్లో 197 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజుల్లోనే లక్ష కొత్త కేసులు వచ్చాయి.

మహారాష్ట్రలో కరోనా ఉగ్ర రూపం దాల్చింది. ఆరు నెలల తరువాత గరిష్ట స్థాయిలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 27 వేల 126 కేసులు నమోదవ్వగా 92 మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ ఒక లక్షా 91 వేల 6 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 63 శాతం పైగా కేసులు మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి.

ఇప్పటి వరకు మహరాష్ట్రలో 24 లక్షల 49 వేల 147 కేసులు నమోదవగా 53 వేల 300 మంది చనిపోయారు. కరోనా దెబ్బకు 9 జిల్లాల్లో లాక్‌డౌన్, నైట్‌ కర్ఫ్యూ వంటి కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. కోవిడ్‌ వ్యాప్తి అడ్డుకునేందుకు ముంబై కార్పొరేషన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నాగ్ పూర్ లో లాక్ డౌన్ అమలవుతున్నాయి.