TS Covid-19 : తెలంగాణలో కొత్తగా 3,982 కోవిడ్ కేసులు

TS Covid-19 : తెలంగాణలో కొత్తగా 3,982 కోవిడ్ కేసులు

Ts New Covid Cases

Updated On : May 18, 2021 / 7:38 PM IST

TS Covid-19 : తెలంగాణాలో గడచిన 24 గంటల్లో 3,982 మందికి కోవిడ్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వివరిచింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా కోవిడ్ సోకి 27 మంది మరణించారు. ఆస్పత్రుల్లో కోవిడ్ కు చికిత్స పొంది మరో 5,186 మంది కోలుకుని ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. దీంతో, ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 5,36,766 గా నమోదైంది.  రాష్ట్రంలో రికవరీ రేటు 90.47 శాతానికి మెరుగు పడింది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోలుకున్నవారి సంఖ్య 4,85,644 గా నమోదైంది. కొత్తగా నమోదైన మరణాలతో కోవిడ్, తదితర సమస్యలతో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 3 వేల మార్కు దాటింది.

ఇలా ఉండగా, గడచిన 24 గంటల్లో GHMC పరిధిలో కొత్తగా 607 కోవిడ్ కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. అదే సమయంలో మేడ్చల్ మల్కాజ్ గిరి లో 225, రంగారెడ్డి జిల్లాలో 262, ఖమ్మం 247 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి.