Doctor Negligence : ఆపరేషన్ అనంతరం కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్

పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్వాకం బయటపడింది. ఓ మహిళ డాక్టర్ ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిపోయారు. గోదావరి ఖనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Doctor Negligence : ఆపరేషన్ అనంతరం కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్

Doctor Negligence

Updated On : February 25, 2023 / 3:37 PM IST

Doctor negligence : పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్వాకం బయటపడింది. ఓ మహిళ డాక్టర్ ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిపోయారు. గోదావరి ఖనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల క్రితం ఓ మహిళ డెలివరీ కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. మహిళా డాక్టర్ ఆమెకు డెలివరీ చేశారు. సర్జరీ చేసిన అనంతరం డాక్టర్ కడుపులో కత్తెర మరిచిపోయారు.

అయితే గత కొన్నేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్న సదరు మహిళ హైదరాబాద్ ఆస్పత్రిలో చెకప్ చేయించుకున్నారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP: బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేస్తూ..రోగి పుర్రె ప‌గుల‌గొట్టిన డాక్టర్లు..

గోదావరి ఖనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఆ మహిళా డాక్టర్ ను నిలదీశారు. దీంతో జరిగిన పొరపాటు గురించి తెలుసుకున్న ఆ వైద్యురాలు మహిళ కడుపులోని కత్తెరను తొలగించేందుకయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. సర్జరీ కోసం సదరు మహిళను హైదరాబాద్ కు తరలించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలో చోటు చేసుకున్నాయి.