Sirisilla : సిరిసిల్లలో మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతైన వ్యక్తి మృతి
సిరిసిల్లలో మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతైన దేవయ్య మృతదేహం లభ్యమైంది.. భవన నిర్మాణ కార్మికుడు దేవయ్య నిన్న మ్యాన్ హోల్‌లో పడి గల్లంతయ్యాడు. రెస్క్యూ టీమ్స్ అతని కోసం గాలింపు జరిపాయి.

Manhole
man died in Sirisilla : సిరిసిల్లలో మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతైన దేవయ్య మృతదేహం లభ్యమైంది.. భవన నిర్మాణ కార్మికుడు దేవయ్య నిన్న మ్యాన్ హోల్‌లో పడి గల్లంతయ్యాడు. అప్పటి నుంచి రెస్క్యూ టీమ్స్ అతని కోసం గాలింపు జరిపాయి. అర్ధరాత్రి వరకు గాలింపు జరిపినా అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో నిలిపివేశారు.
ఈ రోజు ఉదయం తిరిగి గాలింపు ప్రారంభించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం.. నాలా నుంచి 50 మీటర్ల దూరంలో దేవయ్య మృతదేహాన్ని గుర్తించింది. అనంతరం అతని మృతదేహాన్ని బయటకు తీశారు. మరోవైపు సిరిసిల్లలో 25 కాలనీలు ఇంకా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.. కాలనీల్లో డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించే అవకాశం ఉంది.
తెలంగాణలో కురిసిన భారీవర్షాలకు నగరాలు, పట్టణాలు, పల్లెలు చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు, ఇళ్లను వరద బురద ముంచెత్తింది. కుండపోతకు పలు జిల్లాలు, ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని 21 ప్రాంతాల్లో 20 నుంచి 38.8 సెంటీమీటర్ల వరకు వర్షపాతాలు నమోదయ్యాయి.