Woman Left Children : ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన వివాహిత
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత తన ముగ్గురు కన్న పిల్లలను వదిలించుకుంది.

yadadri
Woman Left Children : యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత తన ముగ్గురు కన్న పిల్లలను వదిలించుకుంది. ప్రియుడితో కలిసి తన ముగ్గురు పిల్లలను యాదాద్రికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లల చేతులకు తాళ్లు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి వదిలి వెళ్లి పోయారు.
అయితే, ఆ ముగ్గురు పిల్లలను గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా పోలీసులు బంధువులకు సమాచారం అందించారు. అయితే బంధువులు మాత్ర తమకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు. దీంతో ముగ్గురు పిల్లలను కూడా పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.