Terrorists Links In Hyderabad : హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం .. ప్రజాస్వామ్యదేశాలే టార్గెట్గా కుట్రలు
హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్నట్లుగా ఏటీఎస్ గుర్తించింది. ప్రజాస్వామ్యదేశాలే టార్గెట్ గా ఉగ్రదాడులకు పాల్పడేలా కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Terrorists Links In Hyderabad
Terrorists Links In Hyderabad : హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్నట్లుగా ఏటీఎస్ గుర్తించింది. ప్రజాస్వామ్యదేశాలే టార్గెట్ గా ఉగ్రదాడులకు పాల్పడేలా కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 50 దేశాల్లో కార్యకలాపాలు, 16 దేశాల్లో హెచ్ యూటీపై నిషేధం విధించారు. మరోవైపు హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలోనే వారిని సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం అధికారులు హైదరాబాద్ కు తరలించనున్నారు. ఈ నిందితులను మే 19 వరకు 19 మంది నిందితులను ఏటీఎస్ విచారించనుంది.
హైదరాబాద్లో మరోసారి ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రవాద మూలాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అధికారులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సల్మాన్ సైతం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్టైన ఆరుగురు, భూపాల్ లో అదుపులోకి 11 మందిని ఏటీఎస్ అధికారులు కోర్టులో హాజరు పర్చారు. దీనికి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రత్యేక న్యాయస్థానం మే19 వరకు కస్టడీ విధించింది.
Also Read..Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్ .. 16మంది అరెస్ట్
ఈ ఉగ్ర కుట్రలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. విచారణలో భోపాల్ టు హైదరాబాద్ కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద నగరాలను టార్గెట్ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరులుగా స్థిరపడినట్లుగా తెలుస్తోంది.
ఉగ్రవాది శిక్షణలో భాగంగా 17మంది హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడటంతో ఆందోళనను కలిగిస్తోంది. కేంద్ర ఇంటలిజెన్స్ సాయంతో నిన్న మంగళవారం భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ను నిర్వహించి 17మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ప్రత్యేక భద్రత మధ్య మధ్యప్రదేశ్ కు తరలించారు.
కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించాగా..మహమ్మద్ సలీల్, అబ్దుల్ రెహ్మాన్, షేక్ జునైద్, మహమ్మద్ అబ్బాస్, హమీద్ లను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో సలీమ్ ఓ మెడికల్ కాలేజీలో హెచ్ఓడీగా పని చేస్తున్నాడు. అబ్దుల్ రెహ్మాన్ ఎంఎన్ సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. షేక్ జునైద్ పాతబస్తీలో డెంటిస్ట్ గా పని చేస్తున్నాడు. మరో ఇద్దరు మహమ్మద్ అబ్బాస్, హమీద్ రోజువారీ కూలీలు. సల్మాన్ అనే కూలీ పరారీలో ఉన్నాడు. సల్మాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారికి హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.