Sangareddy : ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై ఏబీవీపీ నేతలు దాడి.. సంగారెడ్డిలో ఉద్రిక్తత
ఈ ఘర్షణలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ కు తీవ్ర గాయలు అయ్యాయి. దీంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

ABVP attacked SFI students
ABVP Attacked SFI – Sangareddy : సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలు ఘర్షణకు దిగారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై ఏబీవీపీ నేతలు దాడి చేశారు. ఇవాళ్టి నుంచి సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు రాత్రి బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థులను ఏబీవీపీ నేతలు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, ఏబీవీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై ఏబీవీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ కు తీవ్ర గాయలు అయ్యాయి. దీంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో సంగారెడ్డిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.