Adani Hyderabad @ORR : హైద‌రాబాద్‌పై ఆదాని క‌న్ను..ORR టోల్ హ‌క్కుల కోసం యత్నాలు

దేశంలో వ్యాపార సామ్రాజ్య దిగ్గ‌జంగా ఉన్న ఆదాని గ్రూప్ ఇప్పుడు తెలంగాణ‌పై దృష్టి పెట్టిందా.? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై కన్నేసిందా? తెలంగాణలో త‌న తొలి బిజినెస్ ఎంట్రీ కోసం... ఔట‌ర్ రింగ్ రోడ్డును ఎంచుకుందా.? అవును..రాజ‌ధాని చుట్టూ ఉన్న ఔట‌ర్ రింగ్ టోల్ హ‌క్కుల‌ను చేజిక్కుంచుకుని ... హైద‌రాబాద్ లో వ్యాపార విస్త‌రణ‌కు తొలి అడ‌గు వేసింది ఆదాని గ్రూప్.

Adani Hyderabad @ORR  : హైద‌రాబాద్‌పై ఆదాని క‌న్ను..ORR టోల్ హ‌క్కుల కోసం యత్నాలు

Adani Group has filed a bid for hyderabad ORR toll

Updated On : December 19, 2022 / 4:31 PM IST

Adani Hyderabad @ORR : దేశంలో వ్యాపార సామ్రాజ్య దిగ్గ‌జంగా ఉన్న ఆదాని గ్రూప్ ఇప్పుడు తెలంగాణ‌పై దృష్టి పెట్టిందా.? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై కన్నేసిందా? తెలంగాణలో త‌న తొలి బిజినెస్ ఎంట్రీ కోసం… ఔట‌ర్ రింగ్ రోడ్డును ఎంచుకుందా.? అవును..రాజ‌ధాని చుట్టూ ఉన్న ఔట‌ర్ రింగ్ టోల్ హ‌క్కుల‌ను చేజిక్కుంచుకుని … హైద‌రాబాద్ లో వ్యాపార విస్త‌రణ‌కు తొలి అడ‌గు వేసింది ఆదాని గ్రూప్.

దేశంలోనే టాప్ బిజినెస్ గ్రూప్ గా నిలిచిన ఆదానీ గ్రూప్ ఇప్పుడు హైద‌రాబాద్ పై ఓఆర్ఆర్ పై పడింది. తెలంగాణ‌లో బిజినెస్ ఎంట్రికి ఆదాని గ్రూప్ ఆరాటపడుతోంది. అనుకుంటే చాలు ఆచరణలో పెట్టేసే ఆదానీ హైద‌రాబాద్ ఓఆర్ఆర్ వేదిక‌గా అడుగులు వేస్తున్నారు. 30 ఏళ్ళ పాటు లీజు కిచ్చేందుకు HMDA రెఢీ అయ్యింది. బిడ్‌ల సమర్పణకు ఆఖ‌రు తేదీ జనవరి 16గా నిర్ణయించింది. దీంతో ఆదానీ గ్రూప్ దీన్ని దక్కించుకునే పనిలో పడింది.దాదాపు 8 వేల కోట్ల విలువైన ఈ డీల్ దక్కించుకోవాలనే యోచనలో ఉంది. టోల్ ఆప‌రేట్ ట్రాన్స‌ఫ‌ర్ ప‌ద్ద‌తిలో 30 ఏళ్లపాటు లీజ్ ఉంటుంది. మొత్తం 158 కీ. మీ పోడువైన ఓఆర్ఆర్ టోల్ వసూళ్లను ఆదానీ దక్కించుకోనున్నట్లుగా సమాచారం. జనవరి 24న ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ ఉండగా ఎంపికైన కంప‌నీని జ‌న‌వ‌రి 28 న ప్ర‌క‌టించ‌నుంది HMDA.

ఆదాని గ్రూప్.. దేశంలో ప‌రిచ‌యం అక్క‌ర లేని బిజినెస్ గ్రూప్. దేవంలో ఎన్నో రంగాల‌లో త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించింది ఆదాని గ్రూప్. పంచ‌భూతాలైన‌.. భూమి,నీరు , నిప్పు, గాలి, ఆకాశాల‌లో … వేటీని వ‌ద‌ల‌కుంగా… అన్నింటా త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించి… ఇప్పుడు దేశంలోనే టాప్ బిజినెస్ గ్రూప్ గా నిలిచింది ఆదాని. ఇలా దేశంలో ప్ర‌తి రాష్ట్రంలో… త‌న వ్యాపారాన్ని కొన‌సాగిస్తున్న ఆదాని గ్రూప్ … ఇప్పుడు తెలంగాణ‌లో త‌న బిజినెస్ విస్త‌ర‌ణ కోసం త‌హ‌త‌హ లాడుతుంది.

ఆదాని గ్రూప్.. పోర్ట్ లు, ఎయిర్ పోర్ట్, విద్యుత్ త‌యారి, టెక్స‌్ టైల్స్, ట్రాన్స్ పోర్ట్, మైనింగ్, నేచుర‌ల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, విమాన రంగం,సినిమా, చివ‌రికి మీడియా.. ఇలా ప్ర‌తి రంగంలో అడుగు పెట్టి… దేశంలో దాదాపు అన్నీ రాష్ట్రాల‌లో త‌న వ్యాపారాన్ని విస్త‌రించింది.అయితే ఇప్ప‌డి వ‌ర‌కు తెలంగాణ‌లో ఆదాని గ్రూప్ డైరెక్గ్ గా త‌న బిజినెస్ ను మొద‌లు పెట్ట‌లేదు. దీన్ని బ్రేక్ చేసేందుకు…ఆదాని గ్రూప్ .. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ చుట్టూ ఉన్న‌ ఓట‌ర్ రింగ్ రోడ్డు ను

ప్ర‌స్తుతం హెచ్ఎండిఏ ఆద్వ‌ర్యంలోని అవుట‌ర్ రింగ్ రోడ్డు ఉంది. 158 కీ. మీ పొడుగున‌… రాజ‌దాని చుట్టేసిన ఈ ఓఆర్ఆర్.. హైద‌రాబాద్ రూప‌రేఖ‌లే మార్చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఓఆర్ఆర్ ను టోల్ ఆప‌రేట్ ట్రాన్స‌ఫర్ ప‌ద్ద‌తిలో… 2019 నుండి ఈగిల్ ఇన్‌ఫ్రా ఇండియా టోల్‌లను వసూలు చేస్తోంది. ఏడాదికి.. 421 కోట్ల‌ను ఈగిల్ ఇన్ ఫ్రా HMDA కు చెల్లిస్తోంది. అయితే ఈ ఏడాది నుండి… అదే టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ కాంట్రాక్ట్ లో భాగంగా… ఏకంగా 30 ఏళ్ళ‌కు లీజుకు ఇచ్యేందుకు హెచ్ ఎండిఏ సిద్దం అయ్యింది. 30 ఏండ్ల‌కు.. దాదాపు 8 వేల కోట్ల రూపాయ‌ల‌కు టెండ‌ర్ల‌ను ఆవ్వానించింది. దీనితో… ఈ బిడ్ ను ద‌క్కించుకునేందుకు 10 కి పైగా కంప‌నీలు… బిడ్ లో పాల్గొన్నాయి. అయితే… అందులో.. ఇప్పుడు ఆదాని గ్రూప్ కు చెందిన‌… స్ట్రాట్ జీ ప్లేయర్ అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఉండ‌టం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇప్ప‌డి వ‌ర‌కు ఆదాని గ్రూప్ పోరుగు రాష్ట్రాల‌లైన ఏపీ, క‌ర్నాట‌క‌,త‌మిల్ నాడు ల‌లో వ్యాపారం చేస్తోంది. కోల్, విధ్యుత్, రెనెవల్ ఎన‌ర్జీ, ఇన్ ఫ్రా, ఏయిర్ పోర్ట్, ఏపీలో కృష్ణ ప‌ట్నం పోర్ట్ ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. యితే… ఇప్ప‌టి వ‌ర‌కు… తెలంగాణ‌లో మాత్రం డైరెక్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేయ‌లేదు. దీంతో.. ఇప్ప‌డు అవుట‌ర్ రింగ్ టోల్ హ‌క్కుల‌తో… తెలంగాణ‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తుంద‌ట ఆదాని గ్రూప్. దేశంలో వేగంగా అభీవృద్ది చెందుతున్న హైద‌ర‌బాద్ లోకి… ఓ ఆర్ఆర్ గుండా… ప‌క్కా రోడ్ మ్యాప్ తో వ‌స్తుంద‌ట ఆదాని గ్రాప్. ఇప్ప‌డికే టోల్ హ‌క్కుల కోసం బిడ్ దాఖ‌లు చేసింది ఆదాని గ్రూప్. జనవరి 24న ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయ‌నున్న హెచ్ఎండిఏ … ఎంపికైన కంప‌నీని జ‌న‌వ‌రి 28 న ప్ర‌క‌టించ‌నుంది.

అతి త‌క్కువ కాలంలో… దేశంలోని వ్యాపార సామ్రాజ్యానిక చ‌క్ర‌వ‌ర్తిలా… వెలుగుతున్న ఆదాని గ్రూప్ అంచెలంచెలుగా విస్తరిస్తునే ఉంది. ఆదానీ కన్ను పడితే అది ఆ గ్రూప్ లో కలవాల్సిందే. అడుగు పెట్టిన చోటును పూర్తిగా త‌న ఆదిప‌థ్యంలోకి తీసుకుని… త‌న వ్యాపార విస్త‌ర‌ణ‌కు కేంద్రంగా మార్చుకుంటుంది ఆదాని గ్రూప్. ఇప్పుడు హైద‌రాబాద్ లో ఓఆర్ఆర్ ఫీజుల వసూళ్లకు సిద్దంకానుందేమో వేచి చూడాలి.