కారుపైకి ఎక్కిందని వీధికుక్కను తుపాకీతో కాల్చి చంపేశాడు..

  • Published By: nagamani ,Published On : May 14, 2020 / 07:13 AM IST
కారుపైకి ఎక్కిందని వీధికుక్కను తుపాకీతో కాల్చి చంపేశాడు..

Updated On : June 26, 2020 / 8:41 PM IST

పార్క్ చేసి ఉంచి కారుపై ఓ వీధికుక్క ఎక్కి కూర్చుందని ఓ యువకుడు దాన్ని తుపాకీతో కాల్చి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన గుజరాత్ లోనిరానిప్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (మే12,2020) జరిగింది. కార్లు..బైకులు, లారీలు ఇలా ఏ వాహనాలు ఆగి ఉన్నా కుక్కలు వాటి టైర్లపై మూత్రం పోయటం సర్వసాధారణం. అలాగే ఆగి ఉన్న వాహానాలపైకి ఎక్కి కూర్చోవటం కూడా సాధారణమే. 

అలా కూర్చున్నవాటిని ఏ..పో..ఛీ అని అదిలిస్తే వెళ్లిపోతాయి. కానీ..రానిఫ్ ప్రాంతంలోని గీతా అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న జిగర్ పంచాల్ (35) అనే యువకుడికి బైట పార్క్ చేసిన తన కారుపై దర్జాగా ఓ వీధికుక్క కూర్చోవటాన్ని చూశాడు..పైగా అది తన గోళ్లతో కారు పైభాగాన్ని గీతలు పెట్టేసింది. అది చూసిన జిగర్ కు పట్టరాని కోపం వచ్చేసింది. ఊగిపోయాడు. దాంతో ఏకంగా తుపాకితో దాన్ని కాల్చిపారేశాడు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారును తన అపార్ట్ మెంట్ లో పార్క్ చేసుకోకుండా..బైటే పార్క్ చేయటం..పైగా కారుపైకి కుక్క ఎక్కిందని దాన్ని చంపేయటంతో ఆగ్రహించిన స్థానికులు రానిప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంచాల్‌ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అతనికి నెగిటివ్‌ తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. 

దీనిపై స్థానికులను పోలీసులు ప్రశ్నించారు. దీనికి మనోజ్ ఠాకూర్ అనే 56 ఏళ్ల వ్యక్తి మంగళవారం 6గంటల సమయంలో పంచాల్ ఆ ప్రాంతంలోని కుక్కలను భయపెడుతున్నాడనీ..ఈ సమయంలోనే తనకు కాల్పులు వినిపించాయని తెలిపాడు. దీంతో పోలీసులు పంచాల్ పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Read Here>> కేకులు చేసి..అమ్మి పోలీసులకు రూ.50వేలు విరాళం ఇచ్చిన మూడేళ్ల బుడతడు