Hyderabad: పాతబస్తీలోని ఎంఐఎం ఆఫీసుకు నిప్పు

అటు ఇటు చూసి ఒక్కసారిగా అగ్గిపుల్లతో నిప్పంటించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Hyderabad: పాతబస్తీలోని ఎంఐఎం ఆఫీసుకు నిప్పు

Updated On : December 5, 2023 / 4:52 PM IST

పాతబస్తీలో ఆల్ ఇండియా ముజ్లిస్ ఏ ఇత్తెహదుల్ ముస్లిమిన్ (ఏఐఎంఐఎం) కార్యాలయానికి గుర్తు తెలియని ఒక వ్యక్తి నిప్పటించాడు. న్యూ ఇందిరానగర్‌లోని హాశమబాద్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చి తలుపుపై పోశాడు. అనంతరం అటు ఇటు చూసి ఒక్కసారిగా అగ్గిపుల్లతో నిప్పంటించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.