మే 19వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు

లాక్‌డౌన్ కారణంగా మార్చి 25వ తేదీ నుంచి ఆగిపోయిన దేశీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా విమాన సర్వీసులు ఆగిపోగా.. నాలుగో దశ లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రధాని మోడీ ప్రకటించారు.
ఈ క్రమంలోనే ప్రత్యేక రైళ్ల పేరుతో పాక్షికంగా రైల్వే సర్వీసులను ప్రారంభించిన కేంద్రం.. దేశీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. మే 19 నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రత్యేక విమానాలను ఎయిరిండియా నడపబోతుంది. లాక్‌డౌన్ కారణంగా వేర్వేరు నగరాల్లో చిక్కుకున్న ప్రయాణికుల సహాయార్ధం వారిని స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను నడునుంది కేంద్రం.
ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు నుంచి పెద్ద సంఖ్యలో విమానాలు నడవబోతున్నాయి. ఈ మేరకు ఎయిరిండియా ఓ ప్రకటన చేసింది. చెన్నై నుంచి ఒక్క విమానం మాత్రమే నడవనుంది. కోచి-చెన్నై విమానం మే 19న నడుస్తుంది. ఢిల్లీ నుంచి 173, ముంబయి నుంచి 40, హైదరాబాద్ నుంచి 25, కోచి నుంచి 12 విమానాలు నడవనున్నాయి.
ఢిల్లీ నుంచి జైపూర్, బెంగళూరు, హైదరాబాద్, అమృత్‌సర్, కోచి, అహ్మదాబాద్, విజయవాడ, గయ, లక్నో సహా మరికొన్ని నగరాల మధ్య ప్రత్యేక విమానాలు నడుస్తాయి. అలాగే, ముంబయి నుంచి విశాఖపట్నం, కోచి, అహ్మాదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ.. అలాగే, హైదరాబాద్ నుంచి ముంబై, ఢిల్లీ,.. బెంగళూరు నుంచి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ మధ్య నడపనున్నట్టు ఎయిరిండియా వెల్లడించింది. ప్రభుత్వ ప్రకటన తర్వాత టిక్కెట్‌లను ఎయిర్‌లైన్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
Read Here>>> ఇండియాలో విమాన సర్వీసులు ప్రారంభం ఎప్పుడంటే..గ్రీన్ జోన్ల నుంచి గ్రీన్ జోన్ల వరకే