Akbaruddin Owaisi : నాంపల్లి కోర్టులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ఊరట.. రెండు కేసులు కొట్టివేత
Akbaruddin Owaisi : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసింది.

Akbaruddin Owaisi Aimim's Akbaruddin Owaisi Acquitted In Two Hate Speech Cases
Akbaruddin Owaisi : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసింది. నిజామాబాద్, నిర్మల్‌లో అక్బరుద్దీన్ మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై అప్పట్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడా ఆ కేసులను నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఓవైసీ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు చూపలేదని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్‌పై నమోదైన రెండు కేసులను కొట్టివేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
2012 డిసెంబర్‌లో నిజామాబాద్, నిర్మల్‌లో అక్బరుద్దీన్ పర్యటించిన సందర్భంగా ఆయన మతపరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణను చేపట్టిన కోర్టు అనేక మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించింది.

Akbaruddin Owaisi Aimim’s Akbaruddin Owaisi Acquitted In Two Hate Speech Cases
ఈ సందర్భంగా నాంపల్లి ధర్మాసనం ఒవైసీకి పలు సూచనలు చేసింది. కేసు కొట్టివేయగానే ఇదేదో విజయమని భావించకూడదని నాంపల్లి కోర్టు సూచించింది. భవిష్యత్తులో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సూచించింది. అలాంటి ప్రసంగాలు దేశ సమగ్రతకు మంచిది కాదని కోర్టు అభిప్రాయపడింది.
9ఏళ్ల విచారణ తర్వాత..
2012 డిసెంబర్‌లో నిర్మల్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో అప్పట్లోనే ఓవైసీపై నిర్మల్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. జనవరి 8న ఓవైసీని పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్‌తో అక్బరుద్దీన్‌ను నిర్మల్ కు పోలీసులు తరలించారు. జనవరి 9న ఆయన్ను నిర్మల్ కోర్టులో హాజరుపరిచారు. ఆపై నిర్మల్ జైలుకు ఒవైసీని తరలించారు. ఫిబ్రవరి 14న అక్బరుద్దీన్ ఓవైసీకి నిజామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 15న నిర్మల్ జైలు నుంచి అక్బరుద్దీన్ విడుదల అయ్యారు. ఏప్రిల్ 13న (9ఏళ్ల విచారణ తర్వాత) నాంపల్లి కోర్టు ఓవైసీపై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.
Read Also : Akbaruddin Owaisi: విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు.. నేడే తుది తీర్పు!